Saturday, 9 March 2024

Heartburn or Pyrosis awareness

*👆Heartburn or Pyrosis awareness.*
*కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య సలహాలు*

🫀🫀. గ్యాస్ట్రిక్ నొప్పి మరియు గుండెనొప్పి రెండూ ఛాతీలో నొప్పిని కలిగిస్తూ ఒకేలా అనిపిస్తాయి. కానీ ఈ రెండు రకాల నొప్పుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలను బట్టి తెలుసుకోవచ్చు.

🫀. నొప్పి యొక్క స్థానం…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా ఎగువ కడుపులో లేదా ఛాతీ మధ్యలో అనిపిస్తుంది. గుండెనొప్పి సాధారణంగా ఛాతీ ఎడమ వైపున, భుజం, మెడ, దవడ లేదా చేతిలో అనిపిస్తుంది.

🫀 నొప్పి యొక్క స్వభావం….గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా తీవ్రంగా ఉంటుంది, కడుపు ఉబ్బరం, మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలతో కూడి ఉంటుంది. గుండెనొప్పి సాధారణంగా ఒత్తిడి, బిగుతు, చిక్కుకున్న భావన వంటి లక్షణాలతో కూడి ఉంటుంది.

🫀. నొప్పి యొక్క వ్యవధి…… గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా కొన్ని నిమిషాల నుండి గంటల వరకు ఉంటుంది. గుండెనొప్పి సాధారణంగా కొన్ని నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఉంటుంది.

🫀. నొప్పిని ప్రేరేపించే అంశాలు…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా కారంగా ఉండే ఆహారం, కెఫిన్, ఆల్కహాల్, పొగత్రాగడం వంటి కారకాల వల్ల ప్రేరేపించబడుతుంది. గుండెనొప్పి సాధారణంగా శారీరక శ్రమ, ఒత్తిడి, చలి వంటి కారకాల వల్ల ప్రేరేపించబడుతుంది.

🫀. నొప్పిని తగ్గించే ప్రధమ చికిత్స…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా యాంటాసిడ్స్, డైజెస్టివ్ ఎంజైములు, కడుపు ఖాళీగా ఉంచడం వంటి చికిత్సలతో తగ్గుతుంది. గుండెనొప్పి సాధారణంగా నైట్రోగ్లిజరిన్, ఆస్పిరిన్, విశ్రాంతి వంటి చికిత్సలతో తగ్గుతుంది.

🫀🫀. ఏ నొప్పి అని నిర్ధారించే 'కొన్ని చిట్కాలు…….

🔹. మీ నొప్పి ఎక్కడ ఉందో గమనించండి.

🔹. మీ నొప్పి ఎలా ఉందో గమనించండి.

🔹. మీ నొప్పి ఎంతసేపు ఉంటుందో గమనించండి.

🔹 మీ నొప్పిని ఏది ప్రేరేపిస్తుందో గమనించండి.

🔹. మీ నొప్పిని ఏది తగ్గిస్తుందో గమనించండి.

గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి మూల కారణం ఏంటో తెలుసా..

ఆహారం తీసుకునేటప్పుడు సరిగా నమల కుండా మింగడం వల్ల లేదా గాలిని మింగడం వల్లన,
ఆహారం తీసుకున్న వెంటనే ఎక్కువ మంచినీరు తీసుకోవడం వల్లన,
సల్ఫర్ ను కలిగిన ఆహార పదార్థాలు - వెల్లుల్లి, కాబేజీ, కాలిఫ్లవర్ , పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్లన,
ప్రేగులలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లల వలన/ చెడు బాక్టరీయా వలన / కొన్ని టాబ్లెట్ ల వలన,
కొన్నిసార్లు స్ట్రెస్ / మానసిక ఒత్తిడి వల్ల కూడా త్రేన్పులు వచ్చే అవకాశం ఉంది.
దీన్ని ఇంట్లోనే సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంది.

ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. ఆహారం తినడానికి అరగంట ముందు, ఆహారం తీసుకున్న అరగంట తరువాత మంచినీరు త్రాగడం మంచిది.

ఆహారంలో వాము, సోంపు, గ్రీన్ టీ చేర్చడం వలన జీర్ణ క్రియ సజావు గా జరుగుతుంది.

తాజా అల్లం/ అల్లం టీ , తేనె , పసుపు జీర్ణక్రియ ను వేగవంతం చేస్తుంది.

తాజా పండ్లు, కురాగాయలు, ఆకు కూరలు , పెరుగు, మజ్జిగ , ఇడ్లీ, దోసె (పులిసిన పదార్థాలు) తీసుకోవడం వల్ల ప్రేగులలో మంచి బక్టరీయా వృద్ధి చెందుతుంది.

మసాలా కూరలు, వేపుళ్లు తగ్గించాలి.

కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి.

యోగా, ప్రాణాయామం, వాకింగ్ ను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.

నిదురించే / విశ్రాంతి తీసుకునే టపుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన ఉపయోగకరం గా ఉంటుంది.

ఇంటి చిట్కా…

మంచి మట్టి పాత్రలో రెండు స్పూన్లు అన్నం వేసి, అది మునిగే వరకు మజ్జిగ లేదా మంచినీరు పోసి ఒక రాత్రి అంతా పులవ పెట్టండి.

మరునాడు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోండి.

పొట్టలో మంచి bacteria వృధి చెందుతుంది. Gastric, acidity సమస్యలు 90 శాతం వరకు నివారిస్తుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://chat.whatsapp.com/BkqsdNxJ18gLQ7ve5higcf

No comments:

Post a Comment