*పచ్చకామెర్లు_నివారణకు Naveen Nadiminti వైద్య సలహాలు ,* *Jaundice,Hepatitis*
పచ్చకామెర్లను రక్తంలో ఈ బిలురూబిన్ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి.
*కామెర్లకు_ముఖ్య_కారణాలు 3.*
1.-ఒకటి రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తిగావడం. దీన్ని 'హీమోలిటిక్ జాండిస్' అంటారు.
2.-#రెండోది- ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని 'హెపాటిక్ జాండిస్' అని వ్యవహరిస్తారు.
3.-#మూడోది - లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం . దీన్ని 'అబ్‌స్ట్రక్టివ్ జాండిస్' అంటారు.
లివర్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే 'హెపటైటిస్' అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో 'హెపాటిక్ జాండిస్' చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు - ఒకటి ఇన్ఫెక్షన్, రెండవది ఆల్కహాల్, మూడు పౌష్టికాహార లోపము (Nutritional jaundice)
ఇన్ఫెక్షన్ పరంగా 5 రకాల వైరస్‌లను -గుర్తించారు. ఇవి హెపటైటిస్- ఎ, బి, సి, డి, ఇ.
హెపటైటిస్ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..
కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు.
నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే. లివర్ వ్యాధి బాగా ముదిరినా కూడా కొందరిలో ఇటువంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశమూ ఉంటుంది,
#చికిత్సా_విధానము :
పచ్చకామెర్ల వ్యాధికి అల్లోపతిలో సరైన ఔషధం లేదు. ఈ వ్యాధి నీటిద్వారా సోకుతుందని వైద్యులు అంటారు. ఈ వ్యాధి ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదన్న నియమంలేదు. అంతేకాదు ఇది శరీరంలో అత్యంత ప్రధానమైన 'లివర్'పై ప్రభావం చూపుతుంది. అందువల్ల విధిగా ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి.
1.- ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడపోసి, చల్చార్చి వాడడం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
2.-పచ్చకామెర్ల వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణంకానివి ఏవీ వాడకూడదు. రెండు నెలలేకాదు కనీసం సంవత్సరం వరకు కూడా
వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=789351439658355&id=100057505178618&mibextid=Nif5oz
*ఆహారంలో_నియమాలు_తప్పక_పాటించాలి.*
1.- మజ్జిగ బాగా వాడాలి,
2.-అడపాదడపా కొబ్బరి బోండాలు తాగాలి,
3.-అరటిపళ్ళు బాగా తినాలి.
4.-మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి.
5.- గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి.
6.- ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లుకాదని భావించేవారు కొన్నాళ్ళు వాటికి గుడ్‌బై చెప్పాలి.
7.-కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
8.- డాక్టర్ సలహాలనుబట్టి లివ్-52 మాత్రలు మరికొన్నాళ్ళు వాడవచ్చు. అవి 'లివర్' పనితీరును మెరుగుపరుస్తాయి.
ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్ ఎ,బి,సి,డి,ఇ, రకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్-ఏ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి. వీటి గురించి ఓసారి తెలుసుకుందాం...
*హెపటైటిస్-ఏ :*
ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్ రూట్' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.
*హెపటైటిస్-బి*
ఇదిహెపటైటిస్-ఏకన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వైరొకరికి ఎక్కించినపడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి.
ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఇక వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా ఈవ్యాధి వస్తుంది..
ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.
ఎయిడ్స తదితరాలులా ఇది కూడా ఎలాంటి చికిత్స లేని వ్యాధికావటం ఆందోళన కలిగించే విషయం, దీనికి నివారణాచర్యలు ముఖ్యమైనవి. కలుషిత సూదులు గుచ్చుకున్నా, వ్యాధికారకులతో లైంగిక సంపర్కం జరిపినా 14 రోజుల్లోగా వ్యాక్సిన్‌ని వేయించు కోవటం ద్వారా వ్యాధి కారకాలను నిలువరించవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో పాటు వైద్యుల సూచనల మేరకు ఇమ్యూనోగ్లోబిలిన్‌ని కూడా ఇవ్వాల్సి ఉం టుంది. ఈ వ్యాధి కార కాల గర్భిణీకి జన్మించిన బిడ్డకు పుట్టగానే వ్యాక్సిన్ ఇప్పించడం ద్వారా చాలామేరకు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
*హెపటైటిస్-సి :*
ఇది హెపటైటిస్-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్-బి కనీసం వ్యాక్సిన్ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్తలని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్ సిరోసిస్‌గా, లివర్ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు.
*లక్షణాలు :*
ఈ వైరస్ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వికారంగా ఉండటం, విరేచనాలు కావ టం, ఆకలి లేకపోవటంతో పాటు
*వ్యాధి నిర్ధారణ--పరీక్షలివి...*
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కాలేయ పరిస్ధితిని నిర్ధారించుకోవచ్చు. మూత్ర పరీక్షలు చేస్తే అందులో బైల్ పింగ్మెంట్స్ కనిపిస్తాయి. అలాగే రక్త పరీక్షలలో సీ
*జాగ్రత్తలిలా...*
హెపటైటిస్ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గానూ గ్లూకోజ్‌తో పాటు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అడపా దడపా తాగించాలి.
*#ఆహారం...*
ఈ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి దూరంగా ఉంచాలి. ఆకలిగా ఉన్నపడు అధిక ఆహారం ఇవ్వాలి. పళ్ల రసాలు, మజ్జిగ తదితరాలు ఎక్కు వగా ఇవ్వటమే కాకుండా కూరగాయలు, పప్పుదినులు బాగా ఉడక పెట్టి ఇవ్వటంతో పాటు పౌష్టికాహరం ఇవ్వటం ద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకుంటారు.
*జాండీస్_నివారణకు_ఆయుర్వేదిక్_నవీన్__రోయ్_సలహాలు*
లివర్ పనితీరులో ఒడిదుడుకులు వచ్చినపుడు శరీరంలో వచ్చే మార్పులను లక్షణాలను కామెర్లు అంటాం. లివర్‌ను మామూలుగా పనిచేటట్లు చేయడమే దీనికి చికిత్స అది ప్రధానంగా ఆహారంతోనే సాధ్యపడుతుంది.
1.-ప్రతిరోజు ఒక గాస్లు తాజా టమాటారసం తాగాలి. ఒకగ్లాసు రసంలో చిటికెడు ఉప్పు, మిరయాల పొడి కలిపి పరగడుపున తాగాలి.
2.-పొట్ల ఆకులను ఎండబెట్టి పదిహేను గ్రాముల ఆకులను పావులీటరు నీటిలో వేసి మరిగించాలి. మరొక పాత్రలో అర లీటరు నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలను వేసి, నీరు మూడు వంతులు వచ్చే వరకు మరిగించాలి. ఈ మిశ్రమంలో పొట్ల ఆకులను మరిగించిన నీటిని కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి. ఎండు ఆకులను బదులు తాజా ఆకులు వాడవచ్చు.
3.-ముల్లంగి ఆకుల రసం తాగితే జాండీస్ అదుపులోకి వస్తుంది. తాజా ముల్లంగి ఆకులను గ్రైండ్ చేసి తాగాలి. మూడు లేదా నాలుగు దఫాలుగా రోజు మొత్తంలో అరలీటరు రసం తాగితే పది రోజుల్లో లివరు పనితీరు పూర్తిగా మెరుగయ్యి జాండీస్ తగ్గుతుంది.
4.-నాలుగు స్పూనుల తాజా నిమ్మరసంలో తగినంత నీటిని కలిపి తాగితే జాండీస్ తగ్గుతుంది. నిమ్మరసం లివర్ కణాలను రక్షిస్తుంది.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
ఫోన్ -9703706660
This group created health informaNaveen Nadimintic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment