Sunday 24 March 2024

Thyroid Cancer Awareness

*👆Thyroid Cancer Awareness.*
*Thyroid Cancer: దగ్గు తగ్గకపోవడం, గొంతు పొడి బారడం లక్షణాలు కనిపిస్తే.. అది థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు...అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid) అనేది థైరాయిడ్ గ్రంథి కణజాలం నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్. ఇందులో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లక్షణాలు మెడలో వాపు, గడ్డ ఉంటాయి.

థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid) అనేది థైరాయిడ్ గ్రంథి కణజాలం నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్. ఇందులో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లక్షణాలు మెడలో వాపు, గడ్డ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ వివిధ సంకేతాలు, లక్షణాల ద్వారా వ్యక్తమవుతుంది. మెడలో వాపు థైరాయిడ్ క్యాన్సర్ ఇది థైరాయిడ్ గ్రంధి సాధారణ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే ఆగకుండా పొడి దగ్గు (Cough), మ్రింగడంలో కష్టంగా ఉంటే జీవక్రియను నియంత్రించడంలో థైరాయిడ్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, క్యాన్సర్ కారణంగా వాపుకు దారితీస్తుంది. ఈ లక్షణాలన్నీ థైరాయిడ్ క్యాన్సర్ కు కారణం కావచ్చు.

1. మెడ ముందు భాగంలో నొప్పి , అప్పుడప్పుడు చెవుల వరకు వ్యాపించడం, థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం.

2. థైరాయిడ్ క్యాన్సర్‌కు బొంగురుపోవడం, వాయిస్ మార్పులు గుర్తించదగిన లక్షణాలు.

3. మ్రింగడంలో ఇబ్బందిని డైస్ఫాగియా అంటారు, థైరాయిడ్ క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న మరొక లక్షణం.

ఇది కూడా చదవండి: లేటు వయసులో గర్భధారణ వల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి..

4. కణితి పెరుగుదల కారణంగా మ్రింగడానికి ఆటంకం కలిగిస్తుంది, దీని వలన ఆహార మార్గంలో అసౌకర్యం, ఇబ్బందులు ఏర్పడవచ్చు.

5. థైరాయిడ్ (Thyroid) కణితి వాయుమార్గాలను అడ్డుకోవడం జరిగితే దీనితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

6. జలుబు లేదా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం లేని స్థిరమైన దగ్గు (Cough)థైరాయిడ్ క్యాన్సర్‌కు లక్షణం కావచ్చు.

కాబట్టి ఈ నిరంతర దగ్గు, ఇతర థైరాయిడ్ సంబంధిత సంకేతాలతో ఉన్నదేమోనని పరీక్ష, రోగనిర్ధారణ అవసరం.

ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.  ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment