Sunday, 11 June 2023

అతిమూత్ర వ్యాధికి ఏం తినవచ్చు? ఏం తినకూడదు?

అతిమూత్ర వ్యాధికి ఏం తినవచ్చు? ఏం తినకూడదు?
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
🌿అతిమూత్రానికి - పథ్యం, అపథ్యం


 🌿సేవించవలసినవి: పాలిష్ తక్కు వగాపట్టిన పాతబియ్యంతో వండిన అన్నం లేదా జావ, పచ్చ పెసరపప్పు మరియు దానికట్టు, పాత కందిపప్పు దానికట్టు, చిరిసెనగలతో వండిన పప్పు దానికట్టు, సెనగ పప్పు దానికట్టు, ఆహారంలో సేవించవచ్చు.

పొట్లకాయ, బీరకాయ, అరటిదూట, అరటిపూవు, లేత అరటి కాయ, లేతమునగాకుకూర, లేత మునగకాయలకూర, మెంతికూర, తంగేడుపువ్వుకూర, నువ్వులపిండికలిపివండిన తంగేడుపువ్వు కూర, పొన్నగంటికూర సేవించవచ్చు.

మీగడ తీసివేసిన ఆవుపాలు, ఆవు మజ్జిగ, ఆవునెయ్యి వాడవచ్చు. చింతకాయపచ్చడి, నిమ్మకాయపచ్చడి, ఉసిరికకాయపచ్చడి అన్నంలో కలుపుకొని తినవచ్చు.

నేరేడుపండ్లు, నిమ్మపండ్లు, అరటిపండ్లు, నల్లద్రాక్షపండ్లు, వెలగ పండ్లు, భుజించవచ్చు.

రాత్రి ఆహారంలో గోధుమఅన్నం లేదా గోధుమ బార్లీ సమంగా కలిపి ఆవునేతితో కలిపి చేసిన రొట్టెలు తినవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే ఉదయంపూట కూడా ఇదే రొట్టెలు తినడం ఉత్తమం.

కాచి చల్లార్చిన నీటినే తాగాలి. అదే నీటితో తలస్నానం, కంఠస్నానం చేయాలి

 🌿సేవించకూడనివి : ఆలస్యంగా జీర్ణమయ్యే కొత్తబియ్యం,

తెల్లబియ్యం, వీటితో వండిన అన్నం సరిగా ఉడికీ ఉడకక పలుకు పలుకుగా ఉన్న అన్నం, అతిగా కష్టాన్ని పెంచే తీపిపదార్థాలు భుజించ రాదు.
మృగాల లేదా పక్షుల మాంసాలు, ఎండు లేదా పచ్చిచేపలు ఎట్టిపరిస్థితులలోను భుజింపరాదు.
కల్లు, సారాయి, బీరు వంటి మత్తుపదార్థాలు పొరపాటుగా
కూడా ముట్టుకొనరాదు.

బెల్లం, పంచదార వీటితో వండిన వివిధరకాల తీపిపదార్థాలు వ్యాధి నివారణ జరిగేవరకు నిషేధించాలి.

గేదెపాలు, గేదెనెయ్యి, గేదె పెరుగు ముఖ్యంగా జర్సీగేదెలకు సంబంధించిన పదార్థాలు ముట్టుకొనకూడదు.
చింతపండుపులుసును పూర్తిగా విడిచిపెట్టాలి.

ఇంగువ, వెల్లుల్లి, నువ్వులనూనె, ఆవనూనె, గుమ్మడికాయ, పిండివంటలు, ఆకుకూరలు అసలు ముట్టుకొనరాదు.అతిగా కారం, అతిఉప్పు, అతివేడిచేసే పదార్థాలు విడిచిపెట్టాలి.

పనసపండు, కంద మొదలైన దుంపకూరలు నిషిద్ధం. అతిగా మంచినీరు తాగడం, అతిమూత్రరోగులకు అతి ప్రమాదమని కలలో కూడా విస్మరించరాదు.
పగటిపూట నిద్రించడం, రాత్రిపూట మేల్కొనడం, అతిగా నిద్రించడం మానుకోవాలి.

స్త్రీ సంభోగంలో అతిగా పాల్గొనడం, ఏ పని చేయకుండ ఊరికే తిని కూర్చొవడం, ఎండలో తిరగడం, అతిగా నడవడం, ఆకలిని బలవంతంగా ఆపడం వంటివి చేయరాదు.

 🌿అతిమూత్రవ్యాధి లక్షణాలు

అతిగా మూత్రంపోయే వ్యాధిగ్రస్తులకు ఆకలి, దప్పిక, శరీరతాపం, బలహీనత ఎక్కువగా వుంటయ్. ఆహారపు రుచి తెలియదు. మాటిమాటికి గొంతు ఎండిపోతుంటుంది. అధిక శాతం మందికి మూత్రం తియ్యగా వుండి విసర్జించిన చోట చీమలు మూగుతయ్. ఈ లక్షణాలను బట్టి అతిమూత్ర సమస్యను గుర్తించి ఈ క్రింది ఆహారమార్గాల ద్వారా నివారించుకోండి.

🫐అల్లనేరేడు గింజలతో అస్ద్భుతయోగం

అల్లనేరేడుకాయలు తిన్న తరువాత లోపలి గింజలకు ఊసివేస్తుంటాం. కాని ఆ గింజలు చాలా విలువైనవి. ఆ గింజలను దంచి జల్లించిన పొడి నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా పావుచెంచా నుండి అరచెంచా వరకు ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తుంటే, అతిమూత్రం హరించిపోతుంది.

 🌿జీలకర్రతో
జీవమైనయోగం

జీలకర్రను కొంచెం దోరగా వేయించి దంచి పొడిచేసి ఆ పొడితో సమంగా పాతబెల్లం లేదా తాటిబెల్లం కలిపి బాగా దంచి ఆ ముద్దను నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా 10గ్రా॥ ముద్దను తింటూవుంటే, అతిమూత్రం అణగారిపోతుంది.

 🌿తం గేడుతో - తప్పనియోగం

తంగేడుపువ్వులపొడి, తంగేడుబెరడుపాడి, తంగేడు గింజల పొడి, తంగేడుఆకులపొడి సమభాగాలుగా కలిపి ఉంచుకోవాలి. రెండుపూటలా పావుచెంచా పొడి పావుచెంచా వెన్నతో కలిపిగాని లేదా పావుచెంచా చక్కెరతో కలిపిగాని మంచినీటితో సేవిస్తుంటే, అతిమూత్రం ఆగిపోతుంది.

ఉసిరిక పండ్లతో ఉసిగొలిపే యోగం

పచ్చిఉసిరికపండ్లరసం 1 ఔన్స్ తీసుకొని అందులో తేనె రెండు చెంచాలు. కలిపి రెండుపూటలా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే, కొద్దిరోజు లోనే అతిమూత్రం హరించిపోయి శరీరంలోని అన్ని అవయవాలకు అమిత మైనశక్తి కలుగుతుంది.


⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓

No comments:

Post a Comment