Thursday 29 February 2024

Headache awareness

February 29, 2024 0
*👆Headache awareness*
*తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణం ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

నాకు తెలిసి మనం
(1) మంచి నీళ్లు తక్కువగా త్రాగటం వలన
(2) సరైన టైమ్ కు భోజనం చేయక పోవటం మూలాన
(3) ఎక్కువగా ఫిజికల్ మరియు మెంటల్ స్టైన్ కు గురైనప్పుడు
(4) మనకు నచ్చని, వ్యక్తులు, నచ్చని చోట, మనసును చంపుకొని అక్కడ వుండవలసి రావటం మూలాన
 (5) కంటి చూపు సమస్యలు వున్నప్పుడు.
(6) మన శరీరంలో విటమిన్ డెఫిషెన్సీ ఇష్యూస్ వున్నప్పుడు
 (7) ఎండకు బాగా ఎక్స్ పోజ్ అయినప్పుడు.

ఇక నేను ఇలా చెప్పుకుంటూ పోతే కూడా మీకు తల నొప్పి రావచ్చు.
*8.-గసగసాలు ఒక గ్లాసు వేడి నీటిలో వేసి ఒక గంటసేపు వుంచి ఆ నీరు తాగితే తలనొప్పి మటుమాయం అవుతుంది. లేదా గసగసాలను కచ్చాపచ్చా గ వేడి చేసి మూటకట్టి వాసన చూసినా తలనొప్పి మటుమాయం అవుతుంది*

9.- చల్లటి నీటితో మొహం కడుకొండి మంచి కాఫీ తాగండి ఏ విషయం ఆలోచించకండి మనసుకి ఇష్టమైన విషయాలు ఆలోచించండి ఇవ్వన్నీ చేసినా తగ్గలేదు అంటే గదిని చీకటి గా చేసిపడు కొండి నిద్రలో తలనొప్పి తగ్గుతుంది మీ తత్వం బాగా అర్దం చేసుకోండి కొంత మందికి కడుపులో ఖాళీ గా ఉంటే తలనొప్పి వస్తుంది కొంత మందికి motion అవ్వక పోతే తలనొప్పి వస్తుంది కొంత మందికి resistance తక్కువ గా ఉంటుంది వాళ్ళు వాతావరణ మార్పులు వల్ల ఇబ్బంది పడతారు వాళ్లకి కూడా తలనొప్పి వస్తుంది ఇలా తలనొప్పి ఎందుకు వస్తుందో గమనించు కుంటే మనం రెమిడీ కూడా పొందగలం
*10.- తలనొప్పి బాగా ఉంటే ఒక చీకటి గదిలో ఒంటరిగా కాసేపు కూచుని ధ్యానం చేసి చూడండి, ఇది ఒత్తిడి తలనొప్పిని బాగా తగ్గిస్తుంది లేకపోతే ఒక వేలుతో ముక్కు రంధ్రాన్ని మూస్తూ గాలి వదలండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది.*
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*👆Headache awareness*
*తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణం ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

నాకు తెలిసి మనం
(1) మంచి నీళ్లు తక్కువగా త్రాగటం వలన
(2) సరైన టైమ్ కు భోజనం చేయక పోవటం మూలాన
(3) ఎక్కువగా ఫిజికల్ మరియు మెంటల్ స్టైన్ కు గురైనప్పుడు
(4) మనకు నచ్చని, వ్యక్తులు, నచ్చని చోట, మనసును చంపుకొని అక్కడ వుండవలసి రావటం మూలాన
 (5) కంటి చూపు సమస్యలు వున్నప్పుడు.
(6) మన శరీరంలో విటమిన్ డెఫిషెన్సీ ఇష్యూస్ వున్నప్పుడు
 (7) ఎండకు బాగా ఎక్స్ పోజ్ అయినప్పుడు.

ఇక నేను ఇలా చెప్పుకుంటూ పోతే కూడా మీకు తల నొప్పి రావచ్చు.
*8.-గసగసాలు ఒక గ్లాసు వేడి నీటిలో వేసి ఒక గంటసేపు వుంచి ఆ నీరు తాగితే తలనొప్పి మటుమాయం అవుతుంది. లేదా గసగసాలను కచ్చాపచ్చా గ వేడి చేసి మూటకట్టి వాసన చూసినా తలనొప్పి మటుమాయం అవుతుంది*

9.- చల్లటి నీటితో మొహం కడుకొండి మంచి కాఫీ తాగండి ఏ విషయం ఆలోచించకండి మనసుకి ఇష్టమైన విషయాలు ఆలోచించండి ఇవ్వన్నీ చేసినా తగ్గలేదు అంటే గదిని చీకటి గా చేసిపడు కొండి నిద్రలో తలనొప్పి తగ్గుతుంది మీ తత్వం బాగా అర్దం చేసుకోండి కొంత మందికి కడుపులో ఖాళీ గా ఉంటే తలనొప్పి వస్తుంది కొంత మందికి motion అవ్వక పోతే తలనొప్పి వస్తుంది కొంత మందికి resistance తక్కువ గా ఉంటుంది వాళ్ళు వాతావరణ మార్పులు వల్ల ఇబ్బంది పడతారు వాళ్లకి కూడా తలనొప్పి వస్తుంది ఇలా తలనొప్పి ఎందుకు వస్తుందో గమనించు కుంటే మనం రెమిడీ కూడా పొందగలం
*10.- తలనొప్పి బాగా ఉంటే ఒక చీకటి గదిలో ఒంటరిగా కాసేపు కూచుని ధ్యానం చేసి చూడండి, ఇది ఒత్తిడి తలనొప్పిని బాగా తగ్గిస్తుంది లేకపోతే ఒక వేలుతో ముక్కు రంధ్రాన్ని మూస్తూ గాలి వదలండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది.*
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

February 29, 2024 0
*బరువు తగ్గాలంటే ఏం చేయాలి?నవీన్ నడిమింటి వైద్య సలహాలు అవగాహనా కోసం*

బరువు తగ్గాలి అంటే మొదట ఆరోగ్యకరము అయైన ఆహారం తీసుకోవాలి.

1.ఉదయం 6 -6:30 గంటలు కి మధ్యలో లేచి దగ్గర లో ఉన్న పార్క్ లో 10 రౌండ్స్ బ్రిస్క్ వాకింగ్

2.తరువాత రాగి జవా, మరియు శనగలు, అలసందలు, మొదలైనాయి నాకు సరిపడినంత తీసుకునే వాడిని

3. మధ్యలో 1 లీటర్ వాటర్

4 .1 గంటికి ఎక్కడ ఉన్నా సరే ముడి బియ్యం అన్నం గా తినే వాడిని

5. ఇంకా మధ్యలో ఒక లెమన్ టీ

6.8 గంటలకు ఫ్రూట్ సలాడ్ ఆర్ ఇడ్లీ ఆర్ రోటి (3)తినేవాడిని

9.ఇదే డైట్ ఇప్పుడు కూడా ఫాలో అవతున్న.

10.నేను మానేసిన ఫుడ్స్ : బిర్యానీ, ఫ్రంచ్ ఫ్రైస్, సమోసా, అప్పుడపుడు ఐస్ క్రీమ్స్, ఫంక్షన్స్ లో ఫుడ్ అన్ని మానేశాను. తప్పదు అన్నప్డుడు మాత్రమే తింటున్నాను

11. ఒక్క సండే మాత్రమే చికెన్ , ఫిష్ ముక్కలు అన్నం లేకుండ తినే వాడిని.

12.45 రోజులకు ఒకసారి లిపిడ్ PROFILE CHECK చేసుకుంటూ ఉన్నాను.

13. అప్పడి నుండి ఇంతవరకు బయట ఫుడ్ తినలేదు.

14. కచ్చితం గా మీరు ఫుడ్ మానేసి తగ్గితే మరల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ.

15 .డైట్ change చేసి చూడండి.

16 . ఆరోగ్యకరంగా బరువు తగ్గడం చాలా మంచిది.ఎందుకంటే మనకు ప్రతి రోజూ దొరికే విటమిన్స్, మైక్రో నుట్రెంట్స్ చాలా అవసరం.సో అది everyday మిస్ అవకుండా ఉంటే మంచిది.

ఇది నా సొంత అనుభవం.తప్పులు ఉంటే క్షమించగలరు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
Losing 10kg in a week is not a healthy or safe goal, as it would require a drastic calorie deficit and could lead to serious health problems. A healthy rate of weight loss is typically around 0.5-1kg per week. Here are some safe and sustainable tips for weight loss:

Reduce your calorie intake: Create a calorie deficit by reducing your daily calorie intake. Eat smaller portions, avoid high-calorie foods and drinks, and choose healthier options such as fruits, vegetables, lean protein, and whole grains.
Increase physical activity: Increase your physical activity by engaging in regular exercise such as walking, running, cycling, or strength training. Aim for at least 150 minutes of moderate-intensity activity per week.
Stay hydrated: Drink plenty of water and avoid sugary or high-calorie drinks.
Get enough sleep: Aim for 7-8 hours of sleep per night, as lack of sleep can disrupt hormone levels and lead to overeating.
Seek support: Consider working with a registered dietitian or a personal trainer to help create a sustainable weight loss plan and provide support and accountability.
Remember, sustainable weight loss takes time and effort, and it is important to prioritize your health and well-being above rapid weight loss goals
*With  -Naveen Nadiminti*
*Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*. 
         https://chat.whatsapp.com/DHOq7vgR6Dh0RRc8Abp5Ua

చెవి_నొప్పి_మరియు_చెవిలో_చీము_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహన_కోసం ,* *Ear Pus discharge(Otitis Media)

February 29, 2024 0
*చెవి_నొప్పి_మరియు_చెవిలో_చీము_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహన_కోసం  ,* 
*Ear Pus discharge(Otitis Media)*

              చిన్న పిల్లలలో చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలో చీమేగా...! చిన్నపిల్లల్లో ఇవన్నీ మామూలే అనుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.

                     పిల్లలకు ఏం పనులు చేయాలో, ఏం పనులు చేయకూడదో తెలియదు. ముఖ్యంగా స్నానం చేసినపుడు చెవిలో నీరు పోయినా, లేదా చెవిలో ఏదైనా చీమో, దోమో దూరినా వారికి తెలియదు కాబట్టి చెవిలో నొప్పి అని ఏడుస్తారు తప్పితే కారణాన్ని చెప్పలేరు.వివరాలు కు లింక్స్ లో చుడండి 
https://m.facebook.com/story.php?story_fbid=2694639680800900&id=1536735689924644

                చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్లు జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండిపోవడం వల్ల (సరిగ్గా స్నానం చేయన ప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకో బెట్టడం వల్ల వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు.
*లక్షణాలు*
               చెవి నొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు. చెవిలోపల ఎర్ర బడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధులతో పాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉండవచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి.

గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇటువంటి కేసులు చికిత్సకు తొందరగా స్పందించవు. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంతకాలం తరువాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవులను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయకూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.

టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. గ్రహణ పెదవి (మొర్రి) వలన తరచూ చెవిలో చీము కారడం ఇన్ఫెక్షన్ వలన జరుగుతూ ఉంటుంది .

#చెవిలో_చీము_కారడం (OtitisMedia) : మూడు రకాలు --
Acute otitis media (AOM),
Otitis media with effusion (OME)
Chronic suppurative otitis media

*వ్యాధి లక్షణాలు :*
ఒక చెవి లేదా రెండు చెవులలోంచి చీము,
నీరు, దుర్వాసనతో చీము వస్తుంటాయి.
జలుబు చేసినపుడు ఎక్కవగుతుంటుంది.
చెవినొప్పి, పోటు, జ్వరం కూడా రావచ్చును.

*జాగ్రత్తలు :*
నీరు చెవిలో పోనివ్వకూడదు.
దూదిపెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు.
చిన్నపుల్లకి దూదిచుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి.
నూనె, పసర్లు పోయనివ్వకూడదు.
డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి.

మూడు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చెవుల్లోనూ చీము కారడంతో మధ్య చెవి, లోపలి చెవి దెబ్బతిని శాశ్వతంగా మాటలు రాని, వినికిడి లేనివారుగా తయారవుతారు. అందుకని చిన్న పిల్లలకు చెవిలో చీము కారుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

#ట్రీట్మెంట్ : డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి

Drep ear drops --- రెండు చుక్కలు ఉదయం , సాయంత్రం వేయాలి .
#నొప్పి_తగ్గడానికి -- combiflam మాత్రలు ఒక్కొక్కటి ఉదయం , సాయంత్రం తీసుకోవాలి ,
ఇన్ఫెక్షన్ తగ్గడానికి - Oflaxin 200 మగ్ రోజుకి రెండు చొప్పునన 5-7 రోజులు వాడాలి
ఎలర్జీ తగ్గడానికి ... సిట్రజిన్ ట్యాబు రోజుకొకటి వాడాలి .
చిన్నపిల్లలకు పై మందులు సిరప్ రూపం లో దొరుకును .

చెవిపోటు వచ్చినపుడు తమలపాకులను మెత్తగా నూరి శుభ్రమైన తడి వస్త్రంలో ఆ ముద్దను వేయాలి. తర్వాత ఆ గుడ్డను పిండి అలా వచ్చిన రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.

ఇంటి వైద్యం
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?

*చెవిపోటుకు_ఆయుర్వేదంలో_నవీన్_సలహాలు :*
1. వామును రసం తీసి వేడిచేసి గోరు వెచ్చగా చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.
2. నేతిలో కర్పూరం కలిపి వెచ్చచేసి 2 చుక్కలు పోసిన పోటు తగ్గిపోతుంది.
3. సబ్జా చెట్టు ఆకురసం 2 చుక్కలు చెవిలో వేస్తే పోట్లు,కురుపులు తగ్గిపోతాయి.
4. తులసి ఆకుల రసం కొంచం వెచ్చచేసి 2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
5. రెండు, మూడు చుక్కలు తమలపాకు రసం చెవిలో వేస్తూవుంటే చెవినొప్పి తగ్గుతుంది.

ఇంటి వైద్యం
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?

*చెవిలో_చీము_ఆయుర్వేదంలో_నవీన్_సలహాలు  :*
1. బీరాకు రసం 2 చుక్కలు రోజూ ఒక పూట చెవిలో వేస్తే పుండు, చీము కారుట నిలిచిపోతుంది.
2. వేపాకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము,నొప్పి తగ్గిపోతుంది.
3. ఆవు పంచితము 2-4 చుక్కలు చెవిలో వేస్తే చీము, నొప్పి తగ్గుతుంది.
4. కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.
5. నీరుల్లి రసం కొంచము కాచి 2 చుక్కలు వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి.
6. మందార ఆకుల రసంలో మంచి నూనెను (నువ్వుల నూనె)చేర్చి నూనె మిగిలేటట్లు కాచి 2 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే చీము కారటం, చెడు వాసన తగ్గిపోతుంది.
7.దానిమ్మ పండు రసం వెచ్చచేసి వేస్తే 2 చుక్కలు పోటు, చేము, దురద తగ్గిపోతుంది.
8. చేమంతి ఆకురసం 2 చుక్కలు పండిన చీముకారటం, పోటు దురద తగ్గిపోతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

Wednesday 28 February 2024

ప్రోటీన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాది ఏది ? అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

February 28, 2024 0
*ప్రోటీన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాది ఏది ? అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*


ప్రోటీన్ అవసరం…….ప్రతి వ్యక్తి యొక్క వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిల ఆధారంగా ప్రోటీన్ అవసరం మారుతుంది. సాధారణంగా, ఒక వ్యక్తికి ప్రతిరోజూ శరీర బరువు కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం.

🔸. 1-3 సంవత్సరాలు: 13 గ్రాములు/రోజు

🔸. 4-8 సంవత్సరాలు: 19 గ్రాములు/రోజు

🔸. 9-13 సంవత్సరాలు: 34 గ్రాములు/రోజు

🔸. 14-18 సంవత్సరాలు: 46 గ్రాములు/రోజు (బాలురకు)

🔸. 14-18 సంవత్సరాలు: 46 గ్రాములు/రోజు (బాలికలకు)

🔸. 19-50 సంవత్సరాలు: 56 గ్రాములు/రోజు (పురుషులకు)

🔸. 19-50 సంవత్సరాలు: 46 గ్రాములు/రోజు (మహిళలకు)

🔸. గర్భిణీ స్త్రీలు….71 గ్రాములు/రోజు

🔸. పాలిచ్చే స్త్రీలు….65 గ్రాములు/రోజు

🧿. *ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు…..,*

🔹. మరాస్మస్: ఈ వ్యాధి ఎక్కువగా పిల్లలలో బరువు తగ్గడం, కండరాలు క్షీణించడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

🔹. క్వాషియోర్కోర్. ….పిల్లలలో.ఈ వ్యాధి వల్ల చర్మం పొడిబారడం, వాపు, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

🔹. హైపోఅల్బుమినిమియా….. ఈ వ్యాధి వల్ల రక్తంలో ఆల్బుమిన్ స్థాయిలు తగ్గి కాళ్ళవాపు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

🔹. కండరాల క్షీణత…..ప్రోటీన్ లోపం వల్ల కండరాలు క్షీణించి బలహీనపడతాయి.

🔹. రోగనిరోధక శక్తి తగ్గడం….,ప్రోటీన్ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యానికి గురవుతారు.

🔹. గాయాలు నయం కావడానికి ఆలస్యం…. ప్రోటీన్ లోపం వల్ల గాయాలు నయం కావడానికి ఆలస్యం అవుతుంది.

🐦🐦. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు:

🔹. మాంసం: చికెన్, మటన్, చేపలు

🔹. గుడ్లు: గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

🔹 పాలు మరియు పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్

🔹 పప్పులు: పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు

🔹. సోయా ఉత్పత్తులు: సోయాబీన్, టోఫు

🔹. గింజలు: బాదం, జీడిపప్పు, వేరుశెనగ

🔹. ధాన్యాలు: గోధుమలు, బియ్యం, ఓట్స్
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
     
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

Tuesday 27 February 2024

ఉదయం పరగడుపున రోజు చేయవలసినముఖ్యమైన విషయం ఏమిటి?*ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

February 27, 2024 0
*ఉదయం పరగడుపున రోజు చేయవలసినముఖ్యమైన విషయం ఏమిటి?*ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
      నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్ర లేచిన వెంటనే పరగడుపున కనీసం 650 mL 3 కప్పులు నీరు త్రాగాలి.

శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది.
మీ జీవక్రియను పెంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శక్తి స్థాయిలను పెంచుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మీరు ఉదయం ఎంత నీరు త్రాగాలి అనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
*2.-తిప్పతీగ ని సంస్కృతంలో అమృతవల్లి హిందీలో గిలోయి అని పిలుస్తారు రోజుకి ఐదు ఆకులు తీసుకోవాలా లేక తక్కువ తీసుకోవాలా అనేది దాని పరిమాణాన్ని బట్టి ఉంటుంది ఇవి బాగా ఎదిగితే పెద్ద పరిమాణం లోకి వస్తాయి అప్పుడు రెండు ఆకులు సరిపోతాయి అలా కాకుండా మరీ చిన్న ఆకులు ఐదు తీసుకోవడం మంచిది ఇక తిప్పతీగ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే ప్రధానంగా రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది ప్రధానంగా శ్వాసకోశవ్యాధులను తగ్గిస్తుంది ఉదాహరణకు ఉబ్బసం దగ్గు ఊపిరితిథుల్లో ఉన్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి తిప్పతీగలో యాంటీ బయోటెక్ లక్షణాలు ఎక్కువ కామెర్లు వచ్చినప్పుడు తిప్పతీగ కషాయం తాగడం వలన అవి తగ్గే అవకాశం ఉంది మానసిక ఆందోళన చర్మ వ్యాధులు గాయలని తగ్గిస్తుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి*

3.-థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోవడం మచింది

థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజమ్  అయిన పక్షంలో మాత్ర పరగడుపున వేసుకోమని డాక్టర్ సలహా ఇచ్చినపుడు అలాగే వేసుకోవాలి .ఒక వేళ అవా ఒకేటైముకి వేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి

సరే… మరి మరచిపోతే గుర్తు రాగానే వేసుకోవడమే కాకపోతే టిఫెన్ తిన్న గంటన్నర తరువాత కడుపు కాస్త ఖాళీ అవగానే వేసేసుకోండి .మానకుండా వేసుకోవాలి .డాక్టర్ సలహా ప్రకారమే .

*4.-ఉదయం  జీలకర్ర నీరు త్రాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది..బరువు తగ్గుతారు.జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.వాటితో పాటుగా మెంతులు కూడా వేసి మరిగించి తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.*

*5.-తేనె మరియు నిమ్మరసంతో నీటిని తాగడం*
దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక ప్రసిద్ధ పద్ధతి. ప్రజలు ఈ పానీయాన్ని తాగడానికి ఎంచుకోవడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి: 
 
 *6.-హైడ్రేషన్:*
 తేనె మరియు నిమ్మరసం కలిపిన నీటిని త్రాగడం వలన మీరు రోజంతా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు, ఎందుకంటే తేనె మరియు నిమ్మరసం రెండూ అధిక స్థాయిలో నీటిని కలిగి ఉంటాయి. 
 
  *7.-విటమిన్ సి:* నిమ్మకాయలు విటమిన్ సి యొక్క మంచి మూలం, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. 
 
 *8.-జీర్ణక్రియ:* తేనె మరియు నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడతాయని నమ్ముతారు. తేనెలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి, అయితే నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడే పిత్త ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. 
 
*9.-గొంతు నొప్పి ఉపశమనం:* గొంతు నొప్పి నివారణకు తేనె మరియు నిమ్మరసం రెండూ సాంప్రదాయకంగా ఉపయోగించబడుతున్నాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు, అయితే నిమ్మరసంలోని ఆమ్లత్వం శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేసి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 
 
*10.-బరువు తగ్గడం:*
తేనె మరియు నిమ్మరసం కలిపిన నీటిని తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఎందుకంటే తేనె మరియు నిమ్మరసం రెండింటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆకలిని అణచివేయడంలో సహాయపడవచ్చు. 
 
ఏది ఏమైనప్పటికీ, తేనె మరియు నిమ్మరసంతో నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని గమనించడం ముఖ్యం మరియు దీనిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు.వైద్య నిలయం లింక్స్
https://fb.me/5107t43fT
*11.-ఖాళీ కడుపుతో తినకూడనివి ఏమిటి?*
      క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలా మంది ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టడం లేదు . ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోవడం లేదు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం,చేసే పనుల మీద మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

1. ఆలస్యంగా నిద్ర లేచినప్పుడు, భాగంగా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు. విడుదల అవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.. వికారం, వాంతుల వంటివి. బాధిస్తాయి. వీటన్నింటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.

2. ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట, అదీ పరగడుపున తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధన్యం ఇవ్వాలి.

3. చాలా మంది నిద్రలేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమo వీటివల్ల హార్మోన్ల అసమతల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాస్ నీళ్లు తాగి ఓ పది నిమిషాల తరువాత వీటిని తీసుకుంటే మంచిది.

4. పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టమాటాలను పరగడుపున తీసుకోరాదు. చాలా మంది టమాటా బాత్ లేదా టమాటా రైస్ వంటివి. తింటుంటారు. ఇలాంటివి తినే ముందు పాలు తాగడమో, వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.

5. కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్కు వెళ్లిపోతారు. అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి ముందు కూడా ఇలాగే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు.

6. పరగడుపున 🍌 జోలికి వెళ్లకూడదు. అరటి పండులో మెగ్నిషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదు.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

మగవారిలో_కనిపించే_ఇన్_ఫెర్టిలిటీ_సమస్యల్లో_దాదాపు_90_శాతం_వరకు_స్పెర్మ్‌_కౌంట్‌_తక్కువ (#వీర్య_కణాలు)* *లోపం_వల్ల_వచ్చేవే_స్పెర్మ్‌కౌంట్‌_తగినంతగా_లేకపోతే_వారు_తండ్రి_కావడం_కష్టమే.-**అవగాహనా_కోశం_నవీన్_నడిమింటి_సలహాలు

February 27, 2024 0
*మగవారిలో_కనిపించే_ఇన్_ఫెర్టిలిటీ_సమస్యల్లో_దాదాపు_90_శాతం_వరకు_స్పెర్మ్‌_కౌంట్‌_తక్కువ (#వీర్య_కణాలు)* *లోపం_వల్ల_వచ్చేవే_స్పెర్మ్‌కౌంట్‌_తగినంతగా_లేకపోతే_వారు_తండ్రి_కావడం_కష్టమే.-*
*అవగాహనా_కోశం_నవీన్_నడిమింటి_సలహాలు*
*these foods are very usefull for men to increase sperm count*

        సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. మగవారిలో కనిపించే ఇన్ ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్‌ కౌంట్‌ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్‌ కౌంట్‌ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. ఈ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది.  
 
మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటే ఉంది అంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. విటమిన్‌-సి, ఇ, ఫోలేట్‌ యాసిడ్‌ మరియు జింక్‌ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కింద సూచించిన పదార్థాలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ను భారీగా పెంచడంలో తోడ్పడతాయి.పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2900228716908661/

              పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులు కచ్చితంగా డైట్ ఫాలో కావాలి. అందులోనూ పురుషులకు అతి ముఖ్యం. లేకపోతే లైంగిక సామర్థ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఆహార నియమావళిలో మార్పులు చేసుకోవాలి. ప్ర‌స్తుతం అనేక మంది పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటోంది. దీంతో సంతానం క‌ల‌గ‌డంలేదు. ఈ క్ర‌మంలోనే వీర్యం ఉత్ప‌త్తిని పెంచుకోవ‌డం కోసం నిర్దిష్ట‌మైన ఆహారం తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప‌లు ర‌కాల ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల వీర్యం ఎలా అయితే పెరుగుతుందో, ఓ ర‌కమైన ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల మాత్రం వీర్యం త‌గ్గుతుంద‌ట‌.

*ఇవి_ఎక్కువగా_తీసుకోవాలి:*

*ఓయెస్టర్_గుమ్మడికాయ గింజలు:* వీటిలో ఉండే జింక్ టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. స్పెర్మ్ చచ్చుబడిపోవడాన్ని తగ్గించి కౌంట్‌ను పెంచుతుంది.

*ఆరెంజ్, #బ్రకోలి, #స్ట్రాబెర్రీ:* విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. స్పెర్మ్ అభివృద్ధిలో దోహదపడుతుంది.

*పాలకూర_ఆకుకూరలు:* ‘ఫోలేట్’అధికంగా లభ్యమవుతుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి.

*డార్క్_చాకొలేట్:* అర్జినైన్ అనే అమైనో ఆమ్లాన్ని కలిగి ఉండే డార్క్ చాకొలేట్ వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పెరుగుతుంది.

#సాల్మన్_సార్డినెస్: వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్పెర్మ్ నాణ్యతను,కౌంట్‌ను పెంచుతాయి.

#దానిమ్మ_జ్యూస్: దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టెస్టోస్టిరాన్ స్థాయులను, స్పెర్మ్ క్వాలిటీని ఎక్కువ చేస్తాయి

#నీళ్లు: ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. మంచి వీర్యం ఉత్పత్తి అయ్యేలా తోడ్పడుతుంది.

*వీటికి దూరంగా ఉండాలి:*

#ఫ్రైడ్_ఫుడ్స్‌: స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయి

కొవ్వు ఎక్కువగా డెయిరీ పదార్థాలు: ఇందులో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల ఆరోగ్యకర వీర్యం తగ్గిపోతుంది

#ప్రాసెస్‌డ్_మాంసం: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.

#కెఫిన్: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.

#ఆల్కాహాల్: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.

#సోడా: వీర్య కణాలు చచ్చుబడిపోతాయి.

*1) #వెల్లుల్లి:* వెల్లుల్లి ఉండే ‘ఎలిసిన్‌’ అనే పదార్థం స్పెర్మ్‌ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పదార్థం జననాంగాలకు రక్తం సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సెలూనియమ్‌, బీ6 స్పెర్మ్‌ డ్యామేజ్‌ను అరికడతాయి.
 
*2) #గుడ్లు:* ఎగ్స్‌లో విటిమన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వృషాణాల్లో కణాల నాశనాన్ని అరికడుతుంది. అలాగే గుడ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచుతాయి.
 
*3) #అరటి:* అరటి పళ్లలో బ్రొమేలియన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది సెక్స్‌ హార్మోన్ల విడుదలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఎ, బీ1, సి విటమిన్‌లు వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి.
 
*4) #డార్క్‌ చాకొలెట్స్‌:* వీటిల్లో ఉండే ఎల్‌-అర్గినిన్‌ హెచ్‌సీఎల్‌ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
ఫోన్ - 9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

Monday 26 February 2024

పిల్లలు బరువు పెరగాలి అంటే ఏం చెయ్యాలి

February 26, 2024 0
*పిల్లలు బరువు పెరగాలి అంటే ఏం చెయ్యాలి? నవీన్ రోయ్ డైట్ ప్లాన్ అవగాహనా కోసం*

బరువు పెరగడానికి ముందుగా , మీ శరీర తత్వం పట్ల మీకు అవగాహన చాలా ముఖ్యం. మీ పేరెంట్స్ కూడ తక్కువ బరువు ఉన్నారా? జన్యువుల పరంగా చూస్తే కొందరు, ఎంత తిన్నా లావు అవ్వరు. అలాంటి సమస్య లేకపోతే, నేను ఇవ్వబోయే సూచనలు, మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తాయని నా నమ్మకం.

1.-లావు కావాలంటే ముఖ్యమైనది High Protein Food.అయితే రోజు కాస్త ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి. మరి ఎక్కువైతే, కిడ్నీ పై చెడు ప్రభావం పడొచ్చు.
*2.-High Protein కొరకు, మీరు non- veg అయితే చికెన్, మటన్, ఫిష్, ఎగ్, రొయ్య వీటిని రెగ్యులర్ గా రోజు లేదా రోజు విడిచి రోజు 50 grams తీసుకోండి. ఒకేసారి 250 / 500grams ఫలితం ఇవ్వవు. Sunday కాస్త ఎక్కువగా 200 గ్రామ్స్ తీసుకున్నా పర్వాలేదు.*
3.-Veg అయితే పాలు రోజు చిన్న గ్లాస్, రోజు 1 గుడ్డు ( తినేటట్లు అయితే) కొన్ని నెలల పాటు తీసుకోండి.
*4.-సోయాబీన్ లో అత్యధిక ప్రోటీన్స్ ( 100 గ్రాములకు 44 గ్రాములు) ఉంటాయి. సోయాబీన్ పౌడర్ రోజు పాలలో 20 grams కలుపుకొని తాగండి*
5.-రోజు ఆహారంలో మినుములు, పెసలు, బఠాణీలు, అలసందలు, వేరుశనక్కాయలు ( Ground Nut) వీటిలో రోజు ఏదోఒకటి కనీసం 30 grams ఉండేలా చూసుకోండి. గుగ్గుళ్ళ రూపంలో సాయంత్రం స్నాక్ గా తినవచ్చు. మినుములతో సున్నుండలు చేసుకొని రోజు విడిచి రోజు ఒకటి తినండి. సున్నుండలు ఒకసారి చేస్తే 2 వారాలు నిల్వ ఉంటాయి.
*6.-బాదం పప్పు రోజు రాత్రి 4–5 నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినండి. జీడిపప్పు కూడా తినవచ్చు.*
7.-మీరు Non-Veg / Veg అయితే ఒకే రకమైన ప్రోటీన్ కాకుండా, రోజు 2 రకాల ప్రోటీన్( ఒకటి nonveg,2 వది veg) తీసుకోండి. ఒక రోజు చికెన్, మరొక రోజు మటన్, మరొక రోజు ఫిష్ / రొయ్య ఇలా…. Veg అయితే కూడా పైన తెలిపిన పప్పు ధాన్యాలు రోజు మార్చి తినండి.
*8.-రోజు పాలు ఇష్టం లేకపోతే రాగి మాల్ట్ ( మొలకలు వచ్చి పౌడర్ గా చేసిన రాగుల పొడి తో ) తాగండి. అందులోనే కొన్ని పాలు, బెల్లం ( చక్కెర బదులు ) వేసుకోండి.**
9.-మీకు లభ్యం అయితే రోజు ఒక గ్లాస్ ఫ్రెష్ చెరుకు రసం ( Sugarcane Juice ) తాగండి ( కొన్ని నెలల పాటు ). దీనిలో విటమిన్ B12 ఉంటుంది. హీమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
*10.-మీరు నివాసం ఉన్న ప్రాంతంలో పండే ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. సిమ్లా ఆపిల్, పియర్స్, కివి ఇవి మనకు వంటబట్టవు అని గత సంవత్సరం క్రితం, మా కళాశాల లో కోవిడ్ గురించి, immunity ఎలా పెంచుకోవాలో చెబుతూ నవీన్ నడిమింటి గారు  చేసిన సూచన ఇది.*
*సమయం లేకపోతే :* *Protinex / B- Protein పౌడర్ పాల లో, రోజు ఒక spoon కలుపుకొని తాగండి.*
వేళకు తినండి. వేళకు నిద్రించండి. లేకుంటే ఆహారం సరిగా absorb అవ్వదు.

12.-అయినా కూడ ఫలితం 2,3 నెలల్లో కనబడకపోతే హీమోగ్లోబిన్, B12 విటమిన్( ఇది చాలా ముఖ్యం) పరీక్షలు, డాక్టర్ ల ( Gastro Enterologist) / డైటిషియన్ & నుట్రిషనిస్ట్ సలహాతో చేయించుకొని, వారు చెప్పినవి పాటించండి. నేను చదివిన పుస్తకాలలో  B12 విటమిన్ లోపం వల్ల కూడా తిన్నది వంటబట్టక, చాలా మంది లావు కారని రాశారు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
      
*Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*. 
         https://chat.whatsapp.com/CEIA7slXbBoClXPbruHY58