Friday, 31 March 2023

ఆయసం & ఉబ్బసం తో ఉన్న వాళ్లకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు

*ఆయసం & ఉబ్బసం తో ఉన్న వాళ్లకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం నవీన్ నడిమింటి పరిష్కార మార్గం*
*👉🏿ఆయాసం ఎందుకు వస్తుంది ?*
* శ్వాస మండలంలో అవరోధం ఏర్పడడం వల్ల.
* శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు కుచించుకుని, గాలి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల.
* ఈ పక్రియ చలనానికి ప్రధాన కారణమైన వేగస్ నెర్వులో కొంత మార్పు రావడం వల్ల.
* శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తులలోని పొరలు ఏ కారణంచేతనైనా రేగడం వల్ల .
* ఎక్కడో ఏదోక కారణంవల్ల ఊపిరితిత్తులలోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముఖ్యంగా ముక్కు, గొంతు, జీర్ణాశయాలలో వచ్చే వ్యాధుల వల్ల.
* కొంతమందికి కొన్ని పదార్థాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దాన్నివల్ల కూడా గాలి అరలు సంకుచితమై ఆయాసం వస్తుంది.
*👉🏿మీకు  సమస్య ఉన్నది అని  మరెలా గుర్తించటం......*
* కొంచెం నడిస్తే ఆయాసం వచ్చి, కూర్చుంటే లేదా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంటే అది గుండెకు సంబంధించిన ఆయాసం. ఆ వ్యక్తి ఇలాంటి సమయంలో వెల్లకిలా పడుకోలేడు.
* హఠాత్తుగా ఆరంభమై ఆయాసంతోబాటు పిల్లికూతల వంటి శబ్దం వస్తుంటే అది ఆస్త్మా అని అర్థం.
* సాధారణంగా రోజుకు 21,600 సార్లు శ్వాసక్రియ జరుగుతుంది. అంటే నిమిషానికి 15 నుంచి 17 సార్లు ఆరోగ్య వంతుని శ్వాసక్రియ జరుగుతుంది.
*👉🏿జాగ్రత్తలు........*
* ఆయాసం వున్నవాళ్ళు చల్లటి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్‌లు, బెండకాయ, చేమదుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలికూర, ఎక్కువ పుల్లటి పదార్థాలు తినకూడదు.
* ముల్లంగి, వెలగపండు, వేడినీళ్లు, తేనె, వెల్లుల్లి, గోధుమ, పక్షి మాంసం హితకరములు.
* వాము 50 గ్రాములు గరిటలో వేయించి పల్చటి గుడ్డలో మూటగా కట్టి వీపు భాగంలోనూ, పక్కలలోనూ, వేడి వేడిగా కాపు పెట్టుకోవటం వల్ల కఫం కరిగి ఆ వ్యక్తికి సులభంగా శ్వాస అందుతుంది.
*  ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.

 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.

 *  మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.

 *  పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.

 *  ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.

 *  ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.

 *  ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .

 *  ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.

 *  అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.

 *  ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం .
*👉🏿ఉబ్బసం, జలుబు, దగ్గు, మలేరియా, రొంప ఉపసమనకు మందులు*
1. మిరియాల పొడి 3 గ్రాములు, మిస్రీ 5 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే ఉబ్బసం వెంటనే ఉపశమిస్తుంది. 

2. అరకప్పు పసుపు కషాయంలో కరకపొడి 5 గ్రాములు కలిపి తాగుతుంటే ఆస్తమా అదృశ్యం.

3. పాలు, చక్కెర కలపని కాఫీ డికాషను తాగుతుంటే దమ్ము, ఆయాసం తగ్గిపోతయ్.

4. తానికాయ చూర్ణం 5 గ్రాములు తేనె 10 గ్రాములు కలిపి తింటుంటే దగ్గు ఆయాసం తగ్గుతయ్.

5. మిరియాల పొడి 3 గ్రాములు, చక్కెర 5 గ్రాములు, నెయ్యి 5 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే అన్ని దగ్గులు అంతం.

6. లవంగంపొడి 3 గ్రాములు, పంచదార 5 గ్రాములు, తేనె 10 గ్రాములు కలిపి తింటుంటే దగ్గు వెంటనే తగ్గుతుంది.

7. అల్లం రసం 10 గ్రాములు్, తమలపాకు రసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే దగ్గు, రొంప తగ్గుతయ్.
8. కాల్చిన లవంగంపొడి 3 చిటికెలు, తేనె 5 గ్రాములు కలిపి తింటుంటే మొండిదగ్గులు తగ్గిపోతయ్.
9. జిలకర నోట్లో వేసుకుని రసం మింగుతుంటే దగ్గు తగ్గిపోతుంది.

10. నిమ్మరసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు మూడుపూటలా తింటుంటే దగ్గు, రొంప, పడిశం పరార్.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
     *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
https://fb.watch/jyLFIVSccw/

No comments:

Post a Comment