మధుమేహులు - జాగ్రత్తలు
*****************
1) బరువును అదుపులో ఉంచుకోండి
ఊబకాయలు అయన మధుమేహ వ్యాధిగ్రస్లు బరవును ఎప్పటి కప్పుడు చూసుకోవాలి. టైపు -2 మధుమేహులలో అధిక బరువు ఉండటం అత్యంత ప్రమాదకరం. బరువు 20 శాతం పెరుగుతున్న కొద్ది మధుమేహ సమస్య రెట్టింపు అవుతున్నట్లుగా భావించాలి. వారు 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహం అదుపులో ఉన్నట్లే . కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం , బరువును తగ్గించుకోవటంలో ఆ తగ్గిన బరువును కోనసాగించడంలో తోడ్పడతాయి.
2) చురుకైన జీవన శైలి
మధుమేహులు మందగొడిగ ఉంటే అది ఇంక పెరుగుతూ ఉంటుంది . చురుకుగా పని చేయడం వల్ల శరీరం కూడా హార్మోన్ నుతగువిధంగా వినియోగించి, చురుకుదనాన్ని పెంచుకోగలుగుతుంది . రోజు అరగంట వ్యాయామం చేస్తే మధుమేహం వలన సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు . వ్యాయామం ద్యారా ఇన్సులిన్ యొక్క పని విధానం మెరుగై కణజాలంలోకి చక్కెర గ్రహించబడుతుంది. 45 సం" ఫై బడిన ప్రతిఒక్కరూ, మధుమేహం వచ్చే అవకాశాలు కలిగిన యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ అని పరిశోధనలో తెలుపుతున్నాయి.
3) ఎర్ర మాంసం, అవయవమాంసం, హలిమ్ వంటి మాంసపు వంటకాలు నియంత్రించాలి
వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది . కనుక ఇవి తీసుకున్నట్లయితే మధుమేహులకు ప్రమాదాలు కూడా ఎక్కువవు తుంటాయి . వీటిని తీసుకున్న వారిలో సమస్య సుమారుగా 50 శాతం పెరిగిందని పరిశోధనలు చెపుతున్నాయి. మాంసాహారం సాధ్య మైనంత తక్కువ తీసుకుంటూ చేపలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటియాసిడ్లు అధికంగా వుంటాయి.
4) దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు వాడటం
దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు ఇన్సులిన్ తీసుకొనే వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది . దీనిలో గల ఔషధ గుణాలు ఇన్సులిన్ సక్రమంగా పనిచేసే విధంగా ఎమ్ంజైలను ప్రోత్సహిస్తాయి.
5) చక్కర లేని కాఫీ తీసుకోవటం
కాఫీలో ఉండే కేఫెన్ పదార్థం పొటాషియం, మెగ్నీషియం కణజాలం లోకి గ్రహింపబడే విధంగా దోహదం చేస్తుందని అభిప్రాయం. అమెరికాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల ఫై జరిగిన పరిశోధన ద్వారా కాఫీ తీసుకున్న వారిలో మధుమేహం వల్ల కలిగే సమస్యలు 29 శాతం తగ్గాయని చెప్పుతున్నారు.
6) మానసిక అందోళన,ఒత్తిడి తగ్గించుకోవటం
మానసిక ఆందోళన, ఒత్తిడి వలన రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది .కనుక సమయం దొరికినప్పుడల్ల శ్వాససంబంధ వ్యాయామం చేస్తే ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
7) తక్కువ పిండి పదార్థాలు గలిగిన ఆహారం తీసుకోవడం
మధుమేహులు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు అనేది అందరికి తెలిసిన సత్యం. ఇటీవల పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఎక్కువ పిండి పదార్థాలు తీసుకుంటే ఎవరిలోనైన త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మధుమేహం నియంత్రించలన్నా , నివారించాలన్నా తక్కువ పిండి పదార్థాలను గల ఆహారం తీసుకోవాలి
8) ఫాస్ట్ ఫుడ్స్ నిరోధించడం
మధుమేహం గలవారు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకొనేటట్లయితే వారిలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. సాధారణంగా మధుమేహులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవటానికి పండ్లు, గింజలు వంటివి దగ్గర పెట్టుకుంటే మంచిది.
9) అధిక పీచు పదార్థం గల ఆహారం తీసుకోవటం
ముడి బియ్యం, పొట్టు తియ్యని ధాన్యాలు వంటివి తీసుకోవటం వల్ల పీచుపదార్థం అధికంగా లభ్యమై మధుమేహాన్ని నియంత్రించుకోవటంలో తోడ్పతుంది.
10) పాదాల పట్ల జాగ్రతలు
ఆరికాళ్ళలో ముళ్ళు , గాజులు మొదలగునవి గుచ్చుకోకుండా ఉండటానికి చర్మం ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి మెత్తని చెప్పులు వేసుకోవాలి. మధుమేహులలో గాయలయితే త్వరగా మానవు కనుక ముందుగానే జాగ్రత్త పడితే సమస్యలు అధిగమించవచ్చు.
No comments:
Post a Comment