*చిన్నారులకు_ఎన్నో_నెలలో_ఏ_వ్యాక్సిన్_వేయించాలి..?*
*అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు*
*కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ వేయించడం చాలా ముఖ్యం. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే వ్యాక్సిన్ వేయించాలి. అయితే ఏ వయసులో ఏ వ్యాక్సిన్ వేయించాలి అనేది చాలా మందికి అవగాహన ఉండదు. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో.*
*పిల్లలు వారి మరియు వారి ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటాయి, వారి వయసు పరంగా కావాల్సిన టీకాలు ఇప్పించాలి, మీ పిల్లలు వ్యాధులకు దూరంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఏ వయసులో ఏ టీకాలు ఇవ్వాలో ఇక్కడ తెలుపబడింది........*
*వ్యాధి నిరోధక టీకాలు*
*శిశువుకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు జూన్, జనవరి నెలలలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి - విటమిన్ ఏ చుక్కలు ఇవ్వాలి.*
* గర్భవతులు - ప్రారంభ దశలో - టీటి లేదా బూస్టర్ ఇన్జెక్షన్/ సూది ; 4 వారాల తరువాత టీ.టి 2
*టీకాల ద్వారా నిరోధించగల అంటు వ్యాధులు*
1. డిఫ్తీరియా : ఇంటిలో పిల్లలకి గొంతులో అంగుటమీద తెల్లటి పొర ఏర్పడి తీవ్ర జ్వరం, దుష్పలితాలు ఏర్పడతాయి. చాలా ప్రాణాపాయం.
2. పర్ ట్యూసిస్ : కోరింత దగ్గు ఇందులో పిల్లలు జ్వరం, విపరీతంగా తెరలు తెరలుగా దగ్గుతూ నీరసించి పోతారు. ప్రాణాపాయం ఎక్కువ.
3. టెటనసం – ధనుర్వాతం : దీని వలన జ్వరం, ఫిట్స్, విల్లులుగా వెనక్కి విరచుకుపోతారు. ప్రాణం పోవచ్చు.
4. పోలియో – పక్షవాతం : దీనిలో జ్వరంతో మొదలయి కొద్దిపాటి విరోచనాల తరువాత కాళ్ళు చేతులు పక్షవాతంకి గురి అవుతాయి.
5. బిసిజి : ఈ టీకావలన క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.
6. పొంగు : మీజిల్స్ టీకావలన పిల్లలకి ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చును.
7. హెపటైటిసం బి : కాలేయమునకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించవచ్చును.ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి?
*వయస్సు --------------- మందు పేరు ----*
పుట్టిన వెంటనే -------- బి.సి.జి. మరియు ఓరల్ పోలియో,
6 వారాలకు--------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో,
10 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
14 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
9 మాసాలకు-------------- మీజిల్స్,
16 – 24 నెలలు----------- డి.పి.టి., పోలియో, బూస్టర్ డోసుల
ప్రతి 5 సంవత్సరాలకు బూస్టర్ డోసు ఇవ్వాలి -- మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించంది .
*చిన్న పిల్లలు కు టీకాలు ఎలా ఉపయోగపడతాయి....?*
1. వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులపై టీకాలు శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేయవచ్చు, తద్వారా సంక్రమణకు పోరాడటానికి లేదా నిరోధించడానికి సహాయం చేస్తుంది.
.2.టీకాలు -టీకా నిరోధక వ్యాధులు,అమ్మవారు ,పొంగు , కోరింత దగ్గు మొదలైనవాటిని కలిగి ఉన్న తీవ్రమైన అనారోగ్యం మరియు సంక్లిష్టతల నుండి పిల్లలను రక్షిస్తుంది.
3. టీకాలు సురక్షితం మరియు సమర్థవంతమైనవి. ఆహారం మరియు వ్యాయామం లాగే మీ ఆరోగ్యానికి ఇవి ముఖ్యమైనవి.
4. . ప్రతిచర్యలు చాలా తరచుగా చూస్తాము (జ్వరం ,నొప్పి మరియు చేసిన చోట ఎర్రబడడం). టీకా తర్వాత తీవ్రమైన ప్రతిచర్యలు చాలా అరుదు.
5. టీకాలు మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
6. టీకాలు వ్యాధిని కలిగించవు .టీకాలు వ్యాధిని నిరోధించడానికి తోడ్పడతాయి .
7. రెండు కారణాల వల్ల టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం మరియు మీ చుట్టూ ఉన్నవారిని కాపాడటం.
8. టీకా మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను సంక్రమణకు సంక్రమించడానికి రక్షణను పెంచుతుంది.
9. 95 శాతం పిల్లలు టీకాలు వ్యేపించుకుంటె వ్యాధి సోకడం తగ్గి అందరిని వ్యాధి బారినుండి కాపాడుతుంది.
10. 2 సంవత్సరము లోపల వయసు గల పిల్లలు అందరూ తప్పకుండా మీ దగరలో ఉన్న పిల్లల ఆసుపత్రి కి వెళ్లి టీకాలు వేయుంచుకోవలెను.
*ధన్యవాదములు 🙏,*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660*
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి
https://fb.watch/jHC02lEhNQ/
No comments:
Post a Comment