Monday, 12 February 2024

డిప్రెషన్ ఉన్న వారికి, తాము డిప్రెషన్ లో ఉన్నారు అనే విషయం తెలుస్తుందా? తెలియదా?

*డిప్రెషన్ ఉన్న వారికి, తాము డిప్రెషన్ లో ఉన్నారు అనే విషయం తెలుస్తుందా? తెలియదా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*


బాగా చదువుకొని అవేర్నెస్ ఉన్నవాళ్లు గ్రహించుకోగలరు. కానీ మనలో చాలామందికి తెలియదు Depression మరియు anxiety బాగా తక్కువ మోతాదు లో వున్న వారు గ్రహించ లేక పోవచ్చు గానీ, మిగతా వారికి చాలా క్లియర్ గా అర్థము అవుతుంది

అసలు మనదేశంలో మానసిక సమస్యల పట్ల ప్రజలకి అవగాహన తక్కువ. ఆ సమస్య గురించి పైకి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు తక్కువ .

నేను ఈ విషయంలో అన్ ప్రొఫెషనల్ ని అయినా, కర్నూలు లో ఉన్న మా స్నేహితురాలిని దగ్గరగా చుసిన అనుభవంతో కొన్ని విషయాలు చెబుతున్నాను.

మనలో చాలామందికి మానసిక సమస్యల గురించి అవగాహన లేక బాధితుల పట్ల రకరకాల తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటాం.. మానసిక సమస్యల్లో చాలా రకాలు ఉంటాయి, డిప్రెషన్ అని, అల్జైమర్స్ అని, ఆటిజం అని, హైవర్ ఆక్టివ్నెస్ అని, వినభిన్నమైన వయసులలో విభిన్నమైన సమస్యలు ఉంటాయి. . ఎదుటి వారికీ ఏ మానసిక సమస్య ఉన్నా "వాళ్లకి పిచ్చి ఉంది బాబోయ్." అని ఒక మాటలో తెల్చేసి అవహేళన చేస్తాం, చులకన చేస్తాం, కామెడీ చేస్తాం. 😔 ఖర్మ కాలి కొన్ని సినిమాల్లో కూడా మానసిక సమస్యలను, శారీరక సమస్యలను జోక్ గా చూపించటం వల్ల కూడా మనకి జబ్బుల పట్ల సమస్యల పట్లా ,అవేర్నెస్ పెరగడం లేదు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఈరోజుల్లో ప్రతీవాళ్ళు తమని తాము గమనించుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్తున్నాం అంటే కుటుంబసభ్యులకు సహాయంతో, సైకియాట్రిస్ట్ వద్దకు కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. ముఖ్యంగా టీన్ ఏజ్ పిల్లలు డిప్రెషన్ లోకి ఎక్కువగా వెళ్ళిపోతారు.

*డిప్రెషన్ లోకి ఎందుకు వెళతారు?*

1.-ప్రేమ విఫలం చెండటం
2.-పరీక్ష తప్పటం
3.-ఇంట్లో గొడవలు - గృహా హింస అత్త కోడలు, భర్త భార్య మధ్య గొడవలు .
3.-కాలేజీలో వేధింపులు బెదిరింపులు - శారీరకoగానో మానసికoగానో అబ్యూస్ కి గురి అవడం

4.-ఆఫీస్ లో గొడవలు, అవమానాలు, లైంగిక వేధింపులు.

5.-తరచూ శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడం వల్ల తట్టుకోలేక విసుగు రావడం.

6.-ఒంటరితనం(సొంత కుటుంబ సభ్యులు పిచ్చిదీ దూరం Sending )

6.-రిటైర్మెంట్ తరువాత ఆవరించే శూన్యం

7.-ఆర్థిక సమస్యలు- ఆస్తి తాగాదాలు.

8.-సామాజిక సమస్యలు - గొడవలు - శత్రువుల బెదిరింపులు.

నిరంతరం సెలఫోన్ -లాప్ టాప్- ఇంటర్నెట్ వాడటం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది.

ఇలా నిరంతరం ఒత్తిడికి లోను చేసే సమస్యలు ఏవైనా కావచ్చు, తట్టుకోలేని సున్నిత హృదయలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు.

*వీరు ఎప్పుడూ నిరాశగా మాట్లాడుతూ ఉంటారు, లేదా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతారు, అన్నింట్లోనూ నెగటివిటి కనిపిస్తుంది. కారణం లేకుండా ఏడ్చేయడం, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం, ఎంత వాళ్ళని* ఉత్సాహపరచాలని చూసినా మైండ్ లో తిరుగుతున్న నెగటివ్ ఆలోచనలని దూరం చేసుకోకపోవడం, ప్రతీదానికి ఇరిటేట్ అయిపోవడం, అతిగా నిద్రపోవడం, అతిగా తినడం, సమస్య నుండి ఎస్కేప్ అవడం. కొందరు మద్యపానానికి డ్ర*గ్స్ కీ అలవాటు పడిపోవడం. ఇలా డిప్రెషన్ లక్షణాలు చాలానే ఉంటాయి. ఇవి మనిషి మనిషికీ మారతాయి.

మనకి డిప్రెషన్ ఉన్నా, మనకి అయిన వాళ్లకి డిప్రెషన్ ఉన్నా, అదేమీ జబ్బు కాదు జలుబు లాంటి మామూలు సమస్యే అని భావించి సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళాలి. కౌన్సిలింగ్ తీస్కోవాలి..

*మీ ఇంట్లో వాళ్ళు డిప్రెషన్ ఉన్నవాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉండేట్టు చూసుకోవాలి. కుటుంబం అంతా కలిసి బలo ఇవ్వాలి ఇది నవీన్ రోయ్  సలహాలు* , ప్రేమని అందించాలి. అంతేకాదు వీళ్ళకి ప్రతీరోజు మెడిటేషన్ -యోగా- భక్తి సంగీతం- భక్తి సాహిత్యం -ప్రశాంతమైన పచ్చని ఊళ్లలో ప్రకృతికి దగ్గరగా నివసించటం - కుటుంబసభ్యులకు ప్రేమ తోడ్పాటు - పౌష్టికాహారం వగైరా అందించటం చాలా అవసరం.

నిరంతరం వీరిపైన ఒక కన్నేసి ఉంచాలి. పైకి ఏం చెప్పకపోయినా మనసులో ఆత్మహత్య గురించిన ఆలోచనలు నడుస్తుంటాయి. దాని నుండి డైవర్ట్ చేయాలంటే సైకియాట్రిస్ట్ ల కౌన్సిలింగే సరైన దారి.

మరింత వివరంగా మీ దగ్గర లో సైకియాట్రిస్ట్ లు చెప్పగలరు. 
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ - 9703706660
 This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://chat.whatsapp.com/FtWJiopd2Ms8uXhO7GG7t1
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment