Tuesday 20 February 2024

పొట్ట సులభంగా పోగుట్టుకోవడానికి మార్గాలు ఏమిటి?

*పొట్ట సులభంగా పోగుట్టుకోవడానికి మార్గాలు ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

పొట్టలేవరికీ ఊరికే రావు….వస్తే ఊరికే పోవు…

సంవత్సరాల నిర్లక్ష్యం/పట్టించుకోకపోవటం వలన వచ్చిన పొట్టను కేవలం నెల, రెండు నెలల్లో తగ్గించుకోవటానికి ప్రయత్నించడం ఆరోగ్యానికి మంచిది కాదు.

*నిపుణులైన డాక్టర్ను సంప్రదించకుండా అడ్డమైన డైట్ లు/మందులు వాడి అనారోగ్యాలు కొని తెచ్చుకోకండి.*

పొట్ట తగ్గించుకోవటానికి ఏ ఇద్దరు మునుషులకూ ఒకేరకమైన పరిష్కారం ఉండదు. మీ వయసు, ఎత్తు, బరువు, ఆరోగ్య స్థితి, శరీరతత్వం, జీవనవిధానాలను బట్టి నిపుణులైన డాక్టర్ ఇచ్చే సలహాను పాటించటం ఉత్తమం అని నా అభిప్రాయం…

పొట్ట తగ్గాలంటే, ముందు అది ఎందుకు వస్తుందో తెలియాలి.

పొట్ట రావడానికి కొన్ని కారణాలు: ఆహారం లో కార్బోహైడ్రాట్లు అంటే పిండి పదార్థాలు ఎక్కువ అయినప్పుడు ,

చక్కర ఎక్కువ అయినప్పుడు ,

బీర్, విస్కీ వంటి వి ఎక్కువ త్రాగినప్పుడు ,

మధుమేహం కంట్రోల్ తప్పినప్పుడు

,తగిన శారీరక వ్యాయామం లేనప్పుడు.

పై న చెప్పిన అన్ని పరిస్థితుల లో పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుంది .పొట్ట చుట్టే ఎందుకు చేరుతుంది అంటే తూర్పు ఆసియా లో జనానికి ఇది ఒక జెనెటిక్ కండిషన్. అంటే మనకు ఇతర ఖండాలలో ని వారి కన్నా చాల తొందరగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయే లక్షణం పుట్టుక తోనే ఉంటుంది.

పొట్ట తగ్గాలంటే మన ఆహారం లో అన్నం ,రొట్టెలు, బ్రెడ్, పిజ్జా, పాస్తా వంటివి తగ్గించి వాటి కి బదులు గా కూరలు ,పళ్ళు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు తీసు కోవాలి . చక్కర, బెల్లం వంటివి సాధ్యమైనంతvవరకు ఆహారం లోనించి తొలగించాలి .నీరు బాగా త్రాగాలి .రోజుకు ఒక గంట నడవాలి లేక ఏదైనా వ్యాయామం చేయాలి.

ఇలా క్రమం తప్పకుండా మూడు నెలలు చేస్తే తప్పకుండ పొట్ట తగ్గుతుంది.

మధుమేహం ఉన్నవారు పొట్ట ఎక్కువ అయినట్టైతే ,వారికి ఇన్సులిన్ రెసిస్టన్స్ వచ్చిందని అర్థం. అంటే వారి శరీరంlలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నా అది వ్యర్థంగా పోతున్నట్టు. పరీక్షcచేస్తే రక్తం లో చక్కెర పాలు మోతాదు కు మించి ఉంటుంది. కాబట్టి వారు ఆహార వ్యాయమ నియమాలు పాటించడం మంచిది.

ఎవ్వరికైనా గుండె పైనించిcచేయి కింది దాకా పోనిస్తే ,అది ఒకే సమంగా పోతే ఆరోగ్యానికి ఏమి ఢోకా లేనట్టు. అదే చేయి కడుపు దగ్గర ఒక కొండ ఎక్కి మళ్ళీ లోయ లోకి దిగుతున్నట్టు ఉంటె ఆరోగ్య పరిస్థితి డోలాయమానంగా ఉందని అర్థం. అందరు గుర్తు పెట్టుకోవలసిన ఒకే ఒక విషయం ," మన ఆరోగ్యం మన చేతుల్లోనే ".
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660


దయచేసి పొట్టను పోగొట్టుకోవద్దు, తగ్గించుకోండి🤗https://chat.whatsapp.com/JsPloEJjzP9Lxqe8hrmlxO

No comments:

Post a Comment