*మానసిక ఒత్తిడి, ఎక్కువ ఆలోచించడం పోయి మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలో మరియు శరీర మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార నియమాలు ఏమిటి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
సాధారణంగా జీవన్మరణ సమస్యలు తలెత్తినపుడు, పరీక్షలు రాస్తున్నప్పుడు, ఆప్తులను కోల్పోయినప్పుడు, తీవ్ర అనారోగ్యం పాలైనపుడు… ఇలా పలు సందర్భాల్లో మానసిక ఒత్తిడి, అతిగా ఆలోచించడం జరుగుతుంది.
దీనిని జయించటం అంత సులభం కాదు. అసాధ్యము కాదు. అలాంటి సందర్భాల్లో వేరే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భవిష్యత్తు బాగుంటుంది అన్న భావనను పెంచుకోవాలి.
చక్కటి సంగీతం వినాలి.
అంకెలు 100 నుంచి 1 కి చదువుకోవాలి. సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి.
మెడిటేషన్ చేయాలి.
🌾 *శరీర ఆరోగ్యానికి నియమాలు*
🍅 పండ్లు, కూరగాయలు ఆకుకూరలు….శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. రోజుకు కనీసం 5 రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
🍅. ధాన్యాలు:….శక్తిని అందిస్తాయి. గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి పోషకధాన్యాలను ఎంచుకోవాలి. Whole grain తినడం మంచిది,
🍅. పప్పుధాన్యాలు:., ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం అందిస్తాయి. శనగలు, పెసరలు, మినప్పప్పు, కందిపప్పు వంటివి తీసుకోవాలి.
🍅. పాలు, పాల ఉత్పత్తులు:..కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి అందిస్తాయి. పాలు, పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.
🍅. నట్స్, విత్తనాలు.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ అందిస్తాయి. బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా గింజలు వంటివి తీసుకోవాలి.
🍅. నీరు:…రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. శీతల పానీయాలు, కెఫిన్ పానీయాలు తగ్గించాలి.
🍅. రాత్రి భోజనం త్వరగా తినాలి, నిద్రపోయే ముందు 3 గంటలకు ముందుగానే ముగించాలి.
🍇. క్రమం తప్పకుండా తినాలి…. మితంగా తినాలి. తినేటప్పుడు ధ్యాసతో బాగా నమిలి తినాలి
🍇 టే, కాఫీలను మితంగా సేవించాలి….. ఆల్కహాల్, పొగను నివారించాలి.
🍇 ఉప్పు, చక్కిరలను పరిమితంగా తీసుకోవాలి
🍅 తగినంత నిద్ర పోవాలి…. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అత్యంత ఆవశ్యకం
🍅 వ్యాయామం:..రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కదిలే అన్ని అవయవాలను కదిలించాలి.
🌾🌾🌾 మానసిక ఆరోగ్యానికీ నియమాలు ….
🍀 మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.
🍀 మంచి ఆలోచనలు, సానుకూల వైఖరి శరీర మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం
🍀 బ్రెయిన్ ఫుడ్స్ అయిన చేపలు, గుడ్లు, చిక్కుళ్లు, నట్స్, ఆకుకూరలు వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
https://chat.whatsapp.com/CEIA7slXbBoClXPbruHY58
No comments:
Post a Comment