Friday, 9 February 2024

కొలెస్ట్రాల్ (dyslipidemia) అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఏమి చెయ్యాలి

*కొలెస్ట్రాల్ (dyslipidemia) అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఏమి చెయ్యాలి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
      
*కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?* 
               రక్తంలో కొంత కొవ్వు పదార్ధాలు (lipids) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి మూడు: యల్ డి యల్ (LDL), హెచ్ డి యల్ (HDL), ట్రిగ్లీసెరైడ్ (triglyceride). ఇవి శరీరానికి అవసరం, కానీ పరిమితులలో ఉండాలి. పరిమితులు మీరి ఎక్కువలు తక్కువలు ఐతే దాన్ని కొలెస్ట్రాల్ లేదా dyslipidemia అంటారు. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లకు యల్ డి యల్ (LDL) కానీ ట్రిగ్లీసెరైడ్ (triglyceride) కానీ ఎక్కువగా ఉండవచ్చును. లేదా హెచ్ డి యల్ (HDL) తక్కువగా ఉండవచ్చును.

కొలెస్ట్రాల్ ఉంటే నష్టం ఏమిటి? కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు పాడవవచ్చును. దీనిని అథెరోస్క్లేరోసిస్ atherosclerosis అంటారు. ఐతే అథెరోస్క్లేరోసిస్ atherosclerosis రావటానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చును. ఇందులో ముఖ్యమైనవి బీపీ, డయాబెటిస్, ఊబకాయం, వ్యాయామలోపం, పొగాకు అలవాటు. అథెరోస్క్లేరోసిస్ Atherosclerosis వలన రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, రక్తనాళాలు పూడుకుపోవచ్చును. రక్త ప్రసరణ లోపించడం వలన హార్ట్ ఎటాక్ heart attack, స్ట్రోక్ stroke, గాంగ్రీన్ gangrene లాంటి ప్రమాదకరమైన జబ్బులు రావచ్చును.

*కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది*
       ప్రధానంగా జీవనశైలిని బట్టి వస్తుంది. శరీరావసరాలకు మించి తినడం, వ్యాయామం లోపించడం ప్రధాన కారణాలు. డయాబెటిస్ కూడా ఒక ప్రధాన కారణం. జంతుసంబంధమైన కొవ్వు పదార్ధాలు అంటే వెన్న, నెయ్యి లాంటివి ఎక్కువగా వాడటం కూడా ఒక కారణం కావచ్చును. కొద్ది మందికి వారసత్వ ప్రభావం వలన కొలెస్ట్రాల్ వస్తుంది. వీరు జీవనశైలి ఎంతబాగున్నా కొలెస్ట్రాల్ నుండి తప్పించుకోలేరు.

*నూనె ఎక్కువ వాడితే కొలెస్ట్రాల్ వస్తుందా?*
             కేవలం నూనె వలన కొలెస్ట్రాల్ రాదు. మితిమీరి తింటే, ఎంత మంచి తిండి పదార్ధానికైనా కొలెస్ట్రాల్ వస్తుంది. ఐతే జంతు సంబంధమైన నూనెలు అంటే వెన్న, నెయ్యి, లాంటివి మాత్రం చెడ్డవి. డాల్డా లాంటివి కూడా చెడ్డవి. గడ్డకట్టే నూనెలు అంటే కొబ్బరి నూనె, పామాయిల్ లాంటి నూనెల్ని కాస్త తక్కువ వాడితే మంచిది. వ్యాయామం ఎక్కువగా చేసే వారు, మితంగా తినే వారూ, మంచి శరీర తత్త్వం ఉన్నవారూ, కాస్త వెన్న, నెయ్యి వాడినా ఇబ్బంది ఉండకపోవచ్చును.

*కొలెస్ట్రాల్ మందులు ఎవరు వాడాలి నవీన్ రోయ్ సలహాలు .*

1.-ఒకసారి హార్ట్ ఎటాక్ heart attack గాని, స్ట్రోక్ stroke గాని వస్తే, జీవితాంతం కొలెస్ట్రాల్ మందులు వాడాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉన్నాసరే.

2.-హార్ట్ ఎటాక్ గానీ, స్ట్రోక్ గానీ వచ్చే రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా వాడాలి. రిస్కు ఉజ్జాయింపుగా తెలుసుకోవటానికి గూగుల్ లో కాలిక్యులేటర్లు ఉంటాయి. పది సంవత్సరాలలో రిస్కు 10 కన్నా ఎక్కువగా ఉంటె కొలెస్ట్రాల్ మందు వాడాలి. రిస్కును పెంచే అంశాలలో ప్రధానమైనవి: వయసు, డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, బరువు, వ్యాయామలోపం, పొగాకు.

3.-డయాబెటిస్ ఉన్న వారు దాదాపు అందరూ వాడాలి.

4.-యల్ డి యల్ కొలెస్ట్రాల్ LDL cholesterol గానీ ట్రిగ్లీసెరైడ్ triglyceride గానీ మరీ ఎక్కువగా ఉంటే, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ heart attack, స్ట్రోక్ stroke లాంటి ఇతర ఇబ్బందులు లేనప్పటికీ, కొలెస్ట్రాల్ మందులు వాడాలి.

5.-కొలెస్ట్రాల్ కొంచెం ఉండి వేరే ఇబ్బందులు లేని వారు మందులు వాడనక్కరలేదు. దానర్ధం కొంచెం కొలెస్ట్రాల్ ఉండవచ్చునని కాదు. మందులు సాధ్యమైనంత తక్కువ వాడాలని. తిండిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం పెంచుకోవాలి.

*హెచ్ డి యల్ (HDL) తక్కువగా ఉంటే ఏం చెయ్యాలి*:
        దీనికి మందులు పెద్దగా పనిచేయవు. తిండిని అదుపులో పెట్టుకోవాలి. వ్యాయామం చెయ్యాలి. ఊబకాయాన్ని తగ్గించుకోవాలి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
          This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment