Wednesday, 3 April 2024

సయాటికా నొప్పి వేధిస్తుందా ? అసలు ఎందుకు వస్తుంది ?

*సయాటికా నొప్పి వేధిస్తుందా ? అసలు  ఎందుకు వస్తుంది  ? తీసుకోవలసిన  జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

      మనం తరచుగా మన శరీరంలోని కొన్ని సమస్యలను లైట్ తీసుకుంటుంటాము. ఇలా సమస్య చిన్నగా ఉన్నప్పుడే శ్రద్ధ పెట్టాలి. సమస్యను వెంటనే చికిత్స చేయించుకోవాలి. సకాలంలో చికిత్స అందించడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చు. ఇలాంటి సమస్యల్లో పాదం నొప్పి కూడా ఒకటి.  పాదాల నొప్పిని మనం ఎప్పుడూ విస్మరిస్తాం. కాళ్లలో నొప్పి  అసౌకర్యం వచ్చినప్పుడల్లా మనం దానిని చాలా సీరియస్‌గా తీసుకోము. కానీ అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యల విషయానికి వస్తే.. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాదాల నొప్పిని విస్మరించకూడదని నవీన్ నడిమింటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

*1. #కండరాల_నొప్పి (మజిల్ క్రాంప్స్):*

కాలి కండరాల్లో హఠాత్తుగా నొప్పి మొదలైనప్పుడు దానిని, 'మజిల్ క్రాంప్స్' అంటారు. ఆయుర్వేద పరిభాషలో ఈ నొప్పికి 'పిండకోద్వేష్టనం' అని పేరు. సాధారణంగా ఈ తరహా నొప్పి కాలి పిక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా, నొప్పి వచ్చినప్పుడు కాలి వేళ్ళను పైవైపుకు వంచి, పిక్కలపైన మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలవాటు లేని వ్యాయామాలను, శారీరక శ్రమలనూ చేయకూడదు. సరైన వార్మప్ లేకుండా వ్యాయామాలను మొదలెట్టకూడదు, కాఫీ, టీలను తగ్గించాలి. క్యాల్షియంనూ (పాల పదార్థాలు, పాలకూర, టమాట, గుడ్డు మొదలైనవి), పొటాషియంను (అరటి, కమలా, టమాటా తదితరలు) ఎక్కువగా తీసుకోవాలి.

#ఔషధాలు: సింహ నాదగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, మహాయోగరాజు గుగ్గులు.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం.
వైద్య సలహాలు కోసం లింక్స్
https://fb.me/7KDXnRjvL

*2. #తుంటి_నొప్పి / గృద్రసీవాతం (సయాటికా):*

సయాటికా నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలు దేరి పిరుదులు, తొడ పక్క భాగం, పిక్కలు మొదలైన ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ అరికాలు వరకూ వ్యాపిస్తుంది. సయాటిక్ నరం వాపునకు గురైనప్పుడు, ఇది ప్రయానించినంత మేరా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి సాధరణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పిరావటం, నడిచినప్పుడు నొప్పిరావటం, కాలులో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు క్షీణించుకుపోవడం, పట్టుకోల్పోవడం వంటివి జరుగుతుంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు అర్థం. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి, 

నవీన్ చికిత్సలు:
1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.
2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి.
 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

#ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరాపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాతగజాంకుశరసం.

*3.మోకాళ్ళు_అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్):*

వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన 'సంధివాతం' గా అర్థం చేసుకోవాలి.

నవీన్ సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను వాడాటం, వృత్తిరీత్యా చేయాల్సిన పనుల్లో మార్పులూ చేర్పులను చేసుకోవడంతో ఈ సమస్యను తేలికగా అదుపులో పెట్టుకోవచ్చు.

*4. #సిరలు_ఉబ్బటం (వేరికోస్ వీన్స్):*

కాళ్లలో సిరలు నల్లగా, నీలం రంగులో మెలికలు తిరిగి ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, వాటిని 'వేరికోస్ వీన్స్' అంటారు. వీటి వల్ల కాలులో నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు రక్తం స్థానికంగా సంచితమై, చుట్టుపక్కల నిర్మాణాలపైన ఒత్తిడిని కలిగించి నొప్పికి కారణమవుతుంది. పాదాలకు ప్రసారిణి తైలం అనే ఔషధ నూనెను రాసుకోవటం, ఎలాస్టిక్ సాక్స్ లను ధరించడం, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్య సలహాను అనుసరించి చేయడం ద్వారా ఈ స్థితిని చక్కదిద్దుకోవచ్చు.

*#ఔషధాలు:* వృద్ధివాదివటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, అర్శోఘ్నవటి, బోలపల్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం

*5.#రక్తనాళాలు_బిరుసెక్కి_సాగే_గుణాన్ని_కోల్పోవడం (ఎథిరోస్క్లీరోసిస్):*

రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉన్న వారిలోను, సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలోను ధమనుల లోపలి గోడలు పూడుకుపోయి కాలుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా కణజాలాలకు ప్రాణవాయువు సరైన మోతాదులో అందక నొప్పి బయల్దేరుతుంది. ఇలా ఎక్కువగా కాళ్లలో జరుగుతుంటుంది. ఈ స్థితిలో ఒకవేళశక్తికి మించి శ్రమ చేసినా, వ్యాయామం చేసినా, ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరిగి, డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో, తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. కాలువలలో రక్తనాళాలు (ధమనులు) పూడుకు పోయినప్పుడు చర్మంపై మార్పులు సంభవించడం, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పాలిపోయి కనిపించడం, చర్మాన్ని తాకితే స్పర్శకు చల్లగా తగలడం, పాదాల వేళ్ల సందుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

నవీన్ చికిత్సలు:
 1. వెల్లుల్లిపాయలు (ఇది గ్రాములు) తీసుకొని పైపొర తోఅలగించి లోపలి గర్భాలను మజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్ర మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వదపోసుకుని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి.
2. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.

#ఔషధాలు: లశునాదివటి, నవకగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, మేదోహరవిడంగాది లోహం.

*7. #పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్):*

సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని వారిలో, బీ-కాంప్లెక్స్ లోపం ఏర్పడి కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్లు నొప్పులూ అనిపించే అవకాశం ఉంది. ఆకు కూరల్లోను, తవుడులోనూ బీ- కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలి.

*8. #నరాల_సమస్యలు:*
ఆల్కహాల్ తీసుకునే వారిలోను, మధుమేహం నియంత్రణలో లేని వారిలోనూ కాళ్ల లోపలుండే నరాలకు రక్తసరఫరా తగ్గి వాటిలోని న్యూరాన్ కణజాలాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరిగితే సూదులతో గుచ్చినట్లు నొప్పి మొదలై క్రమంగా పాదాలు మొద్దుబారటం, కండరాలు శక్తిని కోల్పోవడాలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా, మద్యపానాన్ని వదిలేయటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయటం, పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.

*ఔషధాలు:* క్షీరబలాతైలం , మహావాత విధ్వంసినీ రసం, లశునక్షీరపాకం, వాతగజంకుశరసం, స్వర్ణసమీరపన్నగ రసం, వసంత కుసుమాకర ర

       పాదంలోని ఏదైనా భాగంలో భారంగా.. మంటగా అనిపించడం లేదా గట్టిగా అనిపించడం, పాదాల నొప్పి ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. ఆర్థరైటిస్ లేదా కండరాల నొప్పి వల్ల కూడా ఇలా వస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660,
   
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment