Thursday 30 March 2023

చర్మం_మీద_మంగు నల్లమచ్చలు_తెల్లమచ్చలు_సమస్య_పరిష్కారం_మార్గం

*#చర్మం_మీద_మంగు నల్లమచ్చలు_తెల్లమచ్చలు_సమస్య_పరిష్కారం_మార్గం_అవగాహనా_కోసం_నవీన్ నడిమింటి _సలహాలు*

మన శరీరంలోని మెలానిన్ పిగ్మెంట్ కారణంగా చర్మం యొక్క వర్ణం ఉంటుంది. ఈ మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తిలో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల మన చర్మంలో తెల్లమచ్చలు లేదా నల్లమచ్చలు రావచ్చు. మెలానిన్ పిగ్మెంట్ వల్ల చర్మానికి, కంటికి, జుట్టుకి వర్ణం వస్తుంది.
 
*#నల్లమచ్చల_రుగ్మతలు:*

 పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్: గాయం లేక వాపు వచ్చి మానడం వల్ల చర్మంలో నల్లమచ్చలు రావడాన్ని పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ అవస్థకి తరువాతనే మొటిమలు, సోరియాసిస్, ఎటోపిక్ మరియు కాంటాక్ట్ డెర్మటైటీస్, లెకైన్ ప్సానస్ వచ్చే అవకాశం వుంది. దీనివల్ల తెల్లమచ్చలు అప్పుడప్పుడు వచ్చే అవకాశం వుంది.
 
*#ముఖం_మీద_నల్లని_మచ్చల_చికిత్సకు*

*1.-నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్*

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.
*2.-వేప ఫేస్ ప్యాక్*
పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి 
*3.-ఉసిరికాయ:*
విటమిన్ సి పుష్కలంగా కలిగివుండే ఉసిరిని కేశ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెలో ఉసిరికాయలను వేసి తలకు పట్టిస్తే మృదువైన, దట్టమైన కేశాలు మీ సొంతం అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. పూర్తి వివరాలు కు లైక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2865141350417398/

*4.-సున్నిపిండి:* సున్నిపిండిని రోజూ స్నానానికి ముందు ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అంతేగాకుండా సున్నిపిండి పాల క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
*5-ఆలివ్ ఆయిల్:*
 ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టడంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది.
*6.-పసుపు :*
.క్రిములను నాశనం చేసే పసుపును చర్మానికి ఉపయోగించడం ద్వారా అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు. 
*7.-ఆపిల్ :*
మొటిమలు, మచ్చలను ఆపిల్ దూరం చేస్తుంది. ఆపిల్ మాస్క్ ద్వారా ఇంకా చర్మం మృదువుగా తయారవుతుంది. ముందుగా ఆపిల్ ముక్కలతో ముఖానికి మసాజ్‌లా చేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ పేస్ట్‌తో ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప పేస్ట్ చేర్చి ముఖానికి పట్టించాలి. 10 లేదా 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది 
*8.-కుంకుమ పువ్వు:*.
మీరు అందంగా తెల్లగా కనిపించాలంటే కుంకుమ పువ్వును వాడాలి. పాలులో కుంకుమపువ్వును చేర్చి ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. 
 *9.-రోజా పువ్వులు:*
  తాజా పువ్వులతో తయారు చేసే రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది జిడ్డుకు చెక్ పెట్టవచ్చు 
*10.-ముఖము పైన నల్లని మచ్చలు* ఏర్పడిన కలబంద గుజ్జు తీసుకొని అందులో తగు మాత్రం పసుపు కలిపి ముఖము నకు రాసి ఒక గంట సమయం వరకు ఆరనిచ్చి తర్వాత ముఖము కడుక్కోవాలి. ఈ విదంగా చేసిన చో ముఖము పై నల్లని మచ్చలు పోయి కాంతి వఁతముగా యుండును .
*11.-మెడ నల్లగా వున్నా వాళ్ళ కోసం*
ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వలన నల్లని మచ్చలు తొలగుతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.
టాన్ చర్మం కోసం
ముల్తానీ మట్టి, తేనే, శనగపిండి మరియు దోసకాయ రసం తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇది టాన్ చర్మాన్ని తొలగించుటకు వేసవిలో ఉపయోగపడుతుంది.
*13.-మంగు మచ్చలు పోవుటకు:*
సీమబాదంపప్పును నీళ్ళతోఅరగదీసి.మంగు ఉన్నచోట పైన పట్టంచుచుండిన యెడల మంగు మచ్చలు పోవును.
 
*#చికిత్స_విధానం:* ఆయుర్వేద వైద్యానుసారం దూషించబడిన వాత, పిత్త, కఫ దోషాలను సమస్థితిలోకి తీసుకుని వచ్చే ఔషధాలు, అద్భుతమైన లేపనాలు, పంచకర్మ విధానాలు ఉన్నాయి. వ్యాధి ఆరంభంలోనే రోగి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వ్యాధిని పూర్తిగా నివారించుకోవచ్చును.
 *ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
   *సభ్యులకు విజ్ఞప్తి*
  ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment