Wednesday, 29 March 2023

నెలసరి_సమయంలో_వచ్చే_తీవ్రమైన_భయంకరమైన_నొప్పి_రాకుండా_ఏం_చేయగలము

*#నెలసరి_సమయంలో_వచ్చే_తీవ్రమైన_భయంకరమైన_నొప్పి_రాకుండా_ఏం_చేయగలము?* *#నెలసరి_నొప్పికి_నివారణ_ఏమిటి?*
*ఈ_నడిమింటి_నవీన్_ఆయుర్వేద_చిట్కాలతో_నెలసరి_నొప్పులను_దూరం_చేసుకోండి..*
                        మహిళలను నెలకొకసారి పలకరించే సమస్యల్లో నెలసరి నొప్పులు ఒకటి. ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు
*1.- #Menstrual_Cramps:*
       ఈ ఆయుర్వేద సలహాలుతో నెలసరి నొప్పులను దూరం చేసుకోండి..
మహిళలను నెలకొకసారి పలకరించే సమస్యల్లో నెలసరి నొప్పులు ఒకటి. ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిర్లు, వికారం, విపరీతమైన ఆందోళన, తలనొప్పి, నిద్రలేమి, మూడ్‌ స్వింగ్స్‌, ఫుడ్‌క్రేవింగ్స్‌…ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మహిళలు ఏవేవో ట్యాబ్లెట్లు, మందులు వాడుతుంటారు. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెడితే దుష్ర్పభావాలు కూడా చాలానే ఉంటాయి. అందుకే వీలైనంతవరకు ఇంటి చిట్కాలనే పాటించాలంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ రోయ్ . ఈక్రమంలో నెలసరి నొప్పులను దూరం చేసుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారామే. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

*2.- #టీలు_స్మూతీలు…*
పిరియడ్స్‌ సమయంలో గోరువెచ్చని హెర్బల్‌టీలు, స్మూతీలు ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా తిమ్మిర్లతో పాటు వివిధ రకాల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఛామోలిన్‌టీ, అల్లం- నల్లమిరియాల టీ, జీలకర్ర- కొత్తిమీర- సోంపుటీ(సీసీఎఫ్‌), గ్రీన్‌టీలతో పాటు పసుపు, లెమన్‌ గ్రాస్‌, మెంతులతో తయారు చేసిన టీలు తాగితే బాగుంటుంది.

3.- *#పీరియడ్_లో_నొప్పి_ఎందుకు_వస్తుంది_దాని_నుండి_ఉపశమనం_ఎలా_పొందాలి?*
        చాలామంది మహిళల్లో ఇది సహజమేనండి. *హోమియోలో*
Belladonna;
Colocynthis;
Cocculus.
        వంటి చక్కటి ఔషధాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మీకు పీరియడ్స్ మొదలు కావడానికి 5 రోజుల ముందు నుండి 30 పొటెన్సీ లో రోజు ఒక సారి. పీరియడ్స్ మొదలయ్యేక రోజుకు 3 సార్లు వాడండి.
పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం వైద్య నిలయం లింక్స
https://fb.watch/jz-OnIJkAh/

https://m.facebook.com/story.php?story_fbid=641772774416223&id=100057505178618&mibextid=Nif5oz
#హాట్‌_జెల్‌_బ్యాగ్‌తో
గోరువెచ్చని నీటితో నింపిన వాటర్‌ బాటిల్‌ లేదా హాట్‌ జెల్‌ బ్యాగ్‌ను ఉపయోగించి నెలసరి నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఖర్చు కూడా అవసరం లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పద్ధతినే ఉపయోగిస్తారు. నొప్పులు ఉన్న భాగాల్లో వీటితో కాసేపు మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపులో ఉండే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

*4.- #సూర్యరశ్మి సూర్యరశ్మిలో డి-విటమిన్‌* పుష్కలంగా లభిస్తుంది. ఇది నెలసరిలో తిమ్మిర్లు, నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌ల ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తుంది. కాబట్టి పిరియడ్స్‌ సమయంలో ఉదయం పూట కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మిలో నిలబడాలి.

*5.-#హైడ్రేటెడ్_గా_ఉండాలి.. పిరియడ్స్‌ సమయంలో* ఎక్కువ నీరు తాగాలి. దీనివల్ల వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఛామోలిన్‌ లేదా అల్లం టీ చమోమిలే లేదా అల్లం టీలను బాగా తీసుకోవాలి. నీటిలో కొన్ని పుదీనా కాడలు వేసి (మింట్‌ వాటర్‌) రోజులో అప్పుడప్పుడూ తీసుకుంటే శరీరంలో నీటి స్థాయులు బాగా పెరుగుతాయి. దీనివల్ల నెలసరి నొప్పులే కాదు ఇతర ఆరోగ్యప్రయోజనాలు సమకూరుతాయి.

*6.- #యోగా_సాధన యోగా, ఇతర ఎక్సర్‌సైజులు*
 వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయులు బాగా పెరుగుతాయి. ఇవి నెలసరి నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌ల ఉత్పత్తిని తగ్గించేస్తాయి. ప్రాణాయామం, శవాసనం వంటి తేలికైన ఆసనాలతో నొప్పులు దూరమవ్వడమే కాకుండా శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
*7.-#పీసీఓడీ_లేదా_పీసీఓఎస్_ఉన్నవారు_బరువుని_అదుపులో_ఉంచుకోవడానికి_ఎటువంటి_ఆహారం_తీసుకోవాలి?*

పీసీఓడి ఉన్నవారు డైటింగ్ చేయాలి అన్నది నిజం. అయితే కేవలం మితంగా తినడం వలన బరువు తగ్గుతాము అనుకుంటే అది పొరపాటే. ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి.

బరువు తగ్గడం 80 శాతం సరైన డైట్ వల్ల, 20 శాతం ఎక్సర్ సైజ్ వల్ల ఉంటుంది.

1.-వేపుడు వంటకాలు, స్వీట్స్, జంక్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాలను నిషేధించుకోవాలి.
2.-కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
3.-ఓట్స్, గుడ్లు, బాదంపప్పులు, పాలు, నట్స్, కాబూలీ సెనగలు, పచ్చి బఠాణీలు వంటివి హై ప్రోటీన్ ఆహారానికి ఉదాహరణలు.
3.-పప్పుధాన్యాలు, అవిశ గింజలు, బ్రాకొలి వంటివి ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారానికి ఉదాహరణలు.
4.-ఆకు కూరలు, గ్రీన్ టీ, విటమిన్ సి ఉండే పళ్ళు (కమలా పళ్ళు, నిమ్మ రసం, వగైరా), నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకునేలా డైట్ ప్రణాళిక వేసుకోవాలి.
5.-ప్రో-బయాటిక్స్, ఉదాహరణకు పెరుగు (కొద్దిగానే లేదంటే ఫ్యాట్ కంటెంట్ తీసుకున్నట్లు అవుతుంది), మజ్జిగ (కావాల్సిన అంత తాగవచ్చు) కూడా ఉపయోగపడతాయి.
6.-వీటితో పాటు శరీరం బాగా అలసి, చెమట పట్టేలా బ్రిస్క్ వాకింగ్, వ్యాయామం చేయాలి. 
7.-ఒత్తిడి తగ్గించుకోవాలి. 8–9 గంటల పాటు రోజూ నిద్ర ఉండేలా చూసుకోవాలి.
8.-శరీర బరువు తగ్గడంలో నిద్ర మనం ఊహించనంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ -  097037 06660,*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment