*టైప్ 2 డయాబెటిస్‌కు ఉత్తమమైన మరియు చెత్త ఆహారాలు ఏమిటి?వైద్య నిలయం సలహాలు*
టైప్ 2 డయాబెటిస్ రోగులు ఎక్కువ తిన్నా సమస్యే, తక్కువ తిన్నా సమస్యే, వేళకు తినక పోయినా సమస్యే. కొన్ని అస్సులు తినకూడదు కొన్ని మితంగా తినాలి, కొన్ని ప్రతి రోజు తింటే మంచిది.
కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడం కీలకం. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇక్కడ కొన్ని ఉత్తమమైన మరియు చెత్త ఆహారాలు ఉన్నాయి:
*1.-టైప్ 2 డయాబెటిస్‌కు ఉత్తమ ఆహారాలు:*
పిండి పదార్దాలు ఎక్కువ లేని కూరగాయలు: ఆకు కూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్మి, మిరియాలు వంటి ఆహారాలు తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి, తిన్న వెంటనే మొత్తాన్ని ఒకేసారి గ్లూకోస్ గా మర్చి రక్తంలో చక్కెరను పెంచవు.
*తృణధాన్యాలు:*
బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్ లాంటి తృణధాన్యాల ఆహారాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
*లీన్ ప్రొటీన్లు:*
స్కిన్ లెస్ చికెన్, ఫిష్ మరియు టోఫు వంటి ప్రోటీన్లు మధుమేహం మంచి ఆహారం, అవి తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి అలాగే అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి.
*2.-ఆరోగ్యకరమైన కొవ్వులు:*
అవకాడోలు, పుచ్చ, గుమ్మడి, అవిసె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు వాపును(inflammation) తగ్గించడానికి సహాయపడతాయి.
*3.-టైప్ 2 డయాబెటిస్ తినకూడని చెత్త ఆహారాలు:*
*ప్రాసెస్ చేయబడిన మరియు చక్కెర ఆహారాలు:* ప్రాసెస్ చేసిన స్నాక్స్, కూల్ డ్రింక్స్ మరియు fry చేసిన వస్తువులలో కార్బోహైడ్రేట్లలో అధికంగా ఉంటాయి మరియు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి.
*రెడ్ మీట్:*
పెద్ద మొత్తంలో రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
*ఫుల్-ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు :*
జున్ను మరియు ఐస్ క్రీం వంటి ఫుల్-ఫ్యాట్ డైరీ ఉత్పత్తులలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఇది ఇన్సులిన్ నిరోధకత, వాపును (inflamation) కలిగిస్తాయి.
**ట్రాన్స్ ఫ్యాట్స్:*
వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉన్న బేక్డ్ గూడ్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి కూడా వాపు మరియు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి.
ప్రతి ఒక్క diabetic పేషెంట్ కంట్రోల్ ప్లాన్ చాలా వేరుగా ఉంటుంది, అది వారి లైఫ్ స్టైల్, శారీరక అవసరాలకు తగ్గట్టుగా డాక్టర్లు తాయారు చేస్తారు. సొంత ప్రయోగాలు చేయవద్దని మనవి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid035ZCJTy18VjsVeTGuv4nQ5xE2Nrmuews4m4rF6aCFMdruunbS6iwA6VRAfNA7edGMl&id=1536735689924644&mibextid=Nif5oz
*https://t.me/HelathTipsbyNaveen*
No comments:
Post a Comment