Sunday, 2 April 2023

పిల్లలు మరియు పెద్దవాళ్ళు కు వచ్చే సాధారణ సమస్య పైల్స్,ఫిస్టుల,ఫిషర్-ఆయుర్వేదం ఎలా నివారణ కోవాలి

*పిల్లలు మరియు పెద్దవాళ్ళు కు  వచ్చే సాధారణ సమస్య పైల్స్,ఫిస్టుల,ఫిషర్-ఆయుర్వేదం ఎలా నివారణ కోవాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
 
మలవిసర్జనలో
తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో  రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.

. *పైల్స్, ఫిస్టులా,ఫిషర్* ఈ కారాణాల వల్ల రావచ్చు.

 ఆధునిక జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు ఎక్కువ మందిని బాధ పెడుతున్నాయి.వివరాలు కు లింకు లో చూడాలి https://www.facebook.com/watch/?v=425541008301275

1 *పైల్స్*  ను వాడుక భాషలో *మొలలు*  అని కూడా అంటారు.
  మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బి విపరీతమైన నొప్పి ఉంటుంది, కొందరిలో స్రావం ఉంటుంది.

లక్షణాల ను బట్టి ,4 గ్రేడ్ లు గా విభజి చవచ్చు. మొదటి రెండు గ్రేడ్ పైల్స్  కేవలం ఆయుర్వేద మందులతో తగ్గించవచ్చు, 

3 మరియు 4వ గ్రేడ్ పైల్స్ ను ఆయుర్వేద స్పెషలిటీ చికిత్స  క్షార పాఠన తో పూర్తిగా తగ్గించ వచ్చు.

2 *ఫిషర్* 

 *ఫిషర్* దీన్ని ఆయుర్వేదం లో *పరికర్తిక* అంటారు

 మలద్వారం దగ్గర నిట్టనిలువు చీలికను *ఫిషర్* అని అంటారు. మలవిసర్జనలో కత్తెరతో కట్ చేసినట్లు నొప్పి ఉండటం వల్ల దీన్ని పరికర్తీక అంటారు, మంట కూడ ఉంటుంది.

దీనికి ఆయుర్వేదం లో మంచి చికిత్స అందుబాటులోఉంది.

3 *ఫిష్టులా* దీనిని వాడుక భాషలో  *భగంధరము* అని *నూతి* అని అంటారు.

మలద్వారానికి పక్కన చిన్న గుల్ల లాగా లేదా మొటిమ లాగా   ఏర్పడి, వాపు నొప్పి ఉంటుంది.ఇది కొన్ని  రోజులలో పగిలి చీము కారుతుంది తరువాత మరలా మూసుకుపోతుంది ఇలాగ కొన్ని రోజులు ఎటువంటి నొప్పి లేకుండా మరల కొన్ని రోజులకు నొప్పి ,వాపు వచ్చి పగిలి చీము వస్తుంది 
 దానిమూలంగా తీవ్రమైన నొప్పి తో పాటు కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి గాని నెలకు 1, 2 సార్లు గాని  మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం జరుగుతుంది.
 
ఈ గుల్ల లేదా మొటిమలాంటి వాపు  ఒక్కొక్కసారి స్ప్రెడ్ అయ్యి మలద్వారంలోకి తెరచుకోవడం జరిగినప్పుడు దీన్ని ఫిష్టులా ఇన్ అనో (FISTULA IN ANO) అంటారు. ఇందులో నుండి మలం వస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం  ఉంటుంది, కానీ ఆయుర్వేద స్పెషలిటీ చికిత్స అయిన క్షారసూత్ర చికిత్స తో ఎక్కువ శాతం రోగుల్లో మరల తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ.

*మీ బిడ్డకు మలబద్దకం అయినప్పుడు మీరు ఏమి చేయాలి?*

మీ బిడ్డ ఎప్పుడైనా బాత్రూమ్ నుండి కన్నీళ్లతో బయటకు వచ్చి, "మమ్మీ, నేను మలం వదిలినపుడు బాధిస్తుంది?" అని అన్నాడా? కారణం మలబద్ధకం అయుండొచ్చు, పిల్లల్లో చాలా సాధారణ సమస్య, ఇది మిమ్మల్ని మరియు మీ బిడ్డని చాలా బాధిస్తుంది. మలబద్దకం: పదం యొక్క ధ్వని చాలు మనలో చాలామందిని అసౌకర్యానికి గురి చేయడానికి. కానీ, మీకు తెలుసా చాలామంది పిల్లలు ఈ సమస్యను కొన్ని సమయాల్లో అనుభవించారని మరియు సంవత్సరాల తరబడి పోరాడుతున్నారని? ఆశ్చర్యపోయారా? చాలామంది దీని గురించి బహిరంగంగా మాట్లాడరు.

మైసిటి 4 కిడ్స్ డాక్టర్ అనుపమ్ సిబాల్ తో జరిపిన సంభాషణలో, చాలామంది తల్లులు పిల్లల్లో మలము గురించి ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల గురించి చర్చిస్తున్నారు.

ప్ర. *చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మలమును విసర్జిoచపుడు, మలము గట్టిగా ఉన్నపుడు, మలములో రక్తము లేదా మలవిసర్జన లేనప్పుడు భయపడుతున్నారు - దీనికి కారణమయ్యే సాధారణ సమస్యలేమిటి?*

అమెరికన్ అకాడెమి అఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం మలబద్దకం "మలము ఆలస్యమైనా లేదా ఇబ్బంది అయినా, రెండు వారాలు లేదా అంతకన్న ఎక్కువ రోజులు ఉండి రోగికి తీవ్రమైన బాధ కలిగించడo."

అత్యంత సాధారణ కారణాలు బలహీన ఆహార అలవాట్లు, తగినంత ద్రవం తీసుకోకపోవడం మరియు సరైన టాయిలెట్ శిక్షణ లేకపోవడం.

కొంతమంది పిల్లలకు Hirschsrung's Disease ఉంటుంది. ఈ స్థితిలో, పెద్ద ప్రేగు యొక్క కండరాలు సంకోచించడం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.

ప్ర) *తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవలసిన మలబద్ధకంతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటి?*

మలబద్దకం పొత్తి కడుపు నొప్పికి దారి తీస్తుంది. కొంతమంది పిల్లలు మలబద్ధకం ఉన్నప్పుడు సరిగ్గా తినరు

మరియు చికాకు పడతారు. మలబద్ధకం వల్ల హెమరాయిడ్స్, ఆసన పగుళ్ళు మరియు ఆపుకోలేని మలము లేదా బట్టలు తడపడం వంటివి కలగొచ్చు.

ప్ర: వైద్యుడిని ఎప్పుడు కలవాలి?

అప్పుడప్పుడు వచ్చే మలబద్ధకం పిల్లలలో సాధారణమైనది. ఇది తరచుగా మరియు మళ్లీ మళ్లీ బాధిస్తున్న సమస్య అయినప్పుడు డాక్టరును కలవాలి

ప్ర: *మలబద్ధకం నివారించడానికి పిల్లలలో ఎటువంటి ఆహారపు అలవాట్లు (ఏది తినాలి మరియు ఏది తినకూడదు) చేయాలి? ప్రత్యేకంగా పిల్లల కోసం ఏదైనా సహజ/సేంద్రీయ విరోచనాకారి ఉన్నాయా?*

ఫైబర్ తగినంత మొత్తం ఆహారంలో చేర్చాలి. మైదా పిండి (బేకరీ మరియు జంక్ ఫుడ్) ను నివారించడం, చక్కెర మరియు కొవ్వు అధికoగా ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం, ఎక్కువ నీటిని తీసుకోవడాన్ని ప్రోత్సహించడం మరియు చురుకైన జీవనశైలి మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్షలు సహాయం చేస్తాయి.

ప్ర: *మలబద్ధకాన్ని నివారించటానికి కొన్ని జీవనశైలి / ఇంటి చికిత్సలు ఏమిటి?*

క్రమం తప్పకుండా బాత్రూం అలవాటు చేసుకోడానికి ఒక పద్ధతి ప్రకారం శౌచాలయం వెళ్ళడం మరియు మలము గురించి డైరీని నిర్వహించడం చెయ్యాలి మరియు బహుమానం ఇచ్చుకోవడం ప్రోత్సాహకంగా ఉంటుంది.మలవిసర్జనకు సహాయపడటానికి కండరాల సమన్వయ అభివృద్ధికి సహాయపడే వ్యాయామాలు ఉన్నాయి.

ప్ర: *మలబద్దక సమస్యలతో తమ పిల్లలను తీసుకువచ్చే తల్లులకు ఏదైనా సలహా?*

సమస్య తీవ్రతను బట్టి నిర్దిష్టమైన సలహా ఆధారపడి ఉంటుంది. నన్ను చూసే  పిల్లలల్లో మలవిసర్జన చాలా సాధారణ సమస్యల్లో ఒకటి. కొందరు పిల్లలకు దీర్ఘకాలిక మలబద్ధక చికిత్స అవసరం. చికిత్స కాలంలో అంతరాయం కలగకుండా చూడటం ముఖ్యం
*పిల్లలు మోషన్ ఫ్రీ అవాలి అంటే*
  SMUTH  అనే సిరప్ దొరుకుతుంది, ఒక వారం రోజులపాటు రోజు 2.5 ml రాత్రిపూట త్రాపండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, 

 *పిల్లలు కు కడుపులో నులిపురుగులు తగ్గటానికి mebex tab, మరియు ప్రతి రోజు రాత్రి *త్రిఫల* చూర్ణము ను వాడండి
*ధన్యవాదములు 🙏*
మీ నవీన్ నడిమింటి 
*ఫోన్ -9703706660*

వివరలకు సంప్రదించండి:👇
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

No comments:

Post a Comment