Wednesday 3 April 2024

నిద్రలేమి సమస్య కు నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*నిద్రలేమి సమస్య కు నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
          
🔸🔸 నిద్ర లోపించడం మనిషి ఆరోగ్యానికి చాలా హానికరం. సరియైన నిద్ర లేకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి...
      మనిషికి నిద్ర చాల అవసరం. సరైన నిద్ర లేక పోతే దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా మనపై వుంటుంది. చిరాకు, మతి మరుపు లాంటి లక్షణాలు కనపడతాయి. దీని ప్రభావం ధీర్ఘకాలంలో మన ఆరోగ్యం పై

నిద్ర లేమి మన శారీరక మరియు మానసిక భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

దీర్ఘకాలిక నిద్ర లేమి రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, నిరాశ, గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
నిద్రలేమి నిరాశ, ఆందోళన మరియు మాదకద్రవ్య దుర్వినియోగం వంటి మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది
నిద్రలేమి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు నిర్ణయం తీసుకోవడంతో సహా అభిజ్ఞాcognitive పనితీరును దెబ్బతీస్తుంది.
నిద్ర లేమి శారీరక మానసిక వేధింపులకు గురి చేస్తుంది.
:నిద్ర లేమి అనేది భావోద్వేగ అసనుతుల్యత ను కలిగించును.

🔸 శరీరక అనారోగ్యం…. నిద్రలోపం వలల శరీరం సరిగా విశ్రాంతి పొందలేదు. దీనివలన అలసట, ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర లేమి శరీరాన్ని బలహీనపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.

🔸 మానసిక ఆనారోగ్యం…. నిద్రలోపం వలల ఒత్తిడి, ఆందోళన, అలసట పెరుగుతాయి. దీనివలన మానసిక సమస్యలు, నిర్ణయాలు తీసుకోవడంలో లోపం ఉండును.

🔸 జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది….నిద్రలేమి నాడీవ్యవస్థకు హానికరం. దీనివలన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ' తగ్గుతాయి.

🔸 బరువు నియంత్రణ కోల్పోతాము…..నిద్రలోపం వలల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతుంది.

🔸 ఆయుర్దాయం క్షీణిస్తుంది…. క్రమంగా నిద్ర లేమి శరీరంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల హృదయ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటివి రావచ్చు. ఇది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది.

🔸🔸 ముగింపు……కనుక సరిపడా నిద్ర తీసుకోవడం మంచి ఆరోగ్యానికి అత్యవసరం. రోజుకు 7-9 గంటల నిద్ర పడుకోవడం ఉత్తమం.కొన్ని అధ్యయనాల ప్రకారం, నిద్రలేమి వల్ల ఆయుర్ధాయం 10 నుండి 15 సంవత్సరాల వరకు తగ్గవచ్చని సూచించాయి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
ఫోన్ -9703706660
     *సభ్యులకు విజ్ఞప్తి*
**************************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://chat.whatsapp.com/F63TaaGxoYmB6NX7xrrwSX

No comments:

Post a Comment