Sunday 26 March 2023

తలనొప్పితోపాటు_చూపు_మసకబారటం_వాంతి_వచ్చినట్లుండటం_మెడవెనుక_గుంజుతున్నట్లు_అనిపిస్తుందా

*#తలనొప్పితోపాటు_చూపు_మసకబారటం_వాంతి_వచ్చినట్లుండటం_మెడవెనుక_గుంజుతున్నట్లు_అనిపిస్తుందా?*ఉదయం_పూట_మరీ_ఎక్కువగా_వుంటుందా?*
*#రక్తపోటు_పెరగడం (హై - బిపి /హైపర్ టెన్షన్)*
*అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*
    
              తలనొప్పి సాధారణంగా కనిపించే లక్షణమే అయినా కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు మాత్రం దానిని సీరియస్ గా తీసుకోవాలి.

ఈ క్రింద పేర్కొన్న ప్రమాద సంకేతాలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి:

తలనొప్పి నిద్రతో తగ్గకపోవడం, పైగా నిద్రను చెడగొట్టడం. నొప్పి తీవ్రంగా, తెరలు తెరలుగా రావడం.

తలను పక్కకు తిప్పినప్పుడుల్లా నొప్పి ఎక్కువ కావటం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి మరింత తీవ్రరూపాన్ని దాల్చడం.

కణతలలో నొప్పి కేంద్రీకృతమై ఉండటం, ఏ పక్క కణతలో నొప్పి ఉందో అదే పక్క కంటి చూపు మసక బారటం.

35 సంవత్సరాల వయసు పైబడిన తరువాత జీవితంలో మొదటిసారిగా మైగ్రేన్ తరహా తలనొప్పి రావడం. తలనొప్పి ప్రమాదకరమైన స్థాయిలో ఉందా, లేదా అనేది అంచనా వేయడానికి ఈ కింది విషయాలు. వాటిని అనుసరించి ఉండే వివరణలూ తోడ్పడుతాయి.పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/3053537058244492/
*సూచనలు:*

టెన్షన్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు జీవనశైలిని కాస్తంత మార్చుకుంటే సరిపోతుంది. ఆర్గనైజ్డ్ గా, వ్యూహాత్మకంగా ఉంటే అనవసరమైన హడావుడికి ఆస్కారం ఉండదు. విశ్రాంతిగా గడపడం, ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించిన విధానంలో శరీర మర్ధనలను చేయించుకోవడం వంటి వాటి వలన మంచి ఫలితం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు సమస్య ఎక్కడ ఉందో కనుకోనడానికి సమగ్రమైన కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. మనసును ఆహితమైన ఇంద్రియార్థాలనుంచి మరల్చుకోవాలి. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన జ్ఞాన, విజ్ఞానం ధైర్య, స్మృతి, సమాధులు తోడ్పడుతాయి. అలాగే శారీరక వ్యాయామమూ, కొన్ని ప్రత్యేకమైన ఔషధాలూ అవసరమవుతాయి.

*ఔషధాలు:*

సర్పగంధ చూర్ణం, బ్రాహ్మీఘృతం, వచాచూర్ణం, జటామాంసీ చూర్ణం, తగరు చూర్ణం.

*#ఔషధాలు:*

కర్పూరాదివటి, ఖదిరాదివటి, గంధకవటి, సంజీవనీవటి, టంకణ భస్మం, తాళ సింధూరం, వ్యాధిహరణ రసాయనం. దంత సమస్యలు: చిగుళ్ల వ్యాధులు, పిప్పిపళ్లవంటివి స్థానికంగా బాధించడమే కాకుండా నరాల ద్వారా ఎగువకు ప్రసరించి తలనొప్పిని సైతం కలిగించే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు. దీనిలో ప్రధాన సమస్యకు చికిత్స చేస్తే తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది.

*నవీన్ సలహాలు :*

1. ఇంగువను పొంగించి వేడిగా వున్నప్పుడు పిప్పి పన్ను మీద ఉంచాలి.
 2. అన్న భేది, పొంగించిన ఇంగువ, పటిక వీటిని మెత్తగా నూరి ఉండలాగ చేసి నొప్పిగా వున్న దంతంపైన ఉంచాలి.
3. సుగంధిపాల ఆకును నూరి పిప్పి పంటిమీద వుంచాలి.
4. తుమ్మ బంకనుగాని, మునగచెట్టు బంకనుకాని పిప్పి పన్నుమీద వుంచాలి.
5. జెల్లెడు పాలను సేకరించి కాటన్ బడ్ ను ముంచి పన్ను మీద మాత్రమే ప్రయోగించాలి.
6. పిప్పళ్ళు, సైంధవలవణం, జీలకర్ర, పటిక వీటిని సమతూకంలో తీసుకొని మెత్తగా దంచి టూత్ పౌడర్ మాదిరిగా రోజు రెండు పూట

*#మైగ్రేన్_తలనొప్పి:*

                   *మైగ్రేన్ తలనొప్పి తిరగబెట్టడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి:* విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరకంగా అలసిపోవడం, బహిష్టు సమయాలు, ప్లోరోసెంట్ లైట్లను చూడటం, తదేకంగా సినిమాలు లేదా టీవీలు చూడటం ఇటువంటివి. అలాగే చాక్లెట్లు, వెన్న, మద్యం మొదలైన ఆహార పదార్థాల వల్ల కూడా మై
1. పొద్దు తిరుగుడు గింజల పేస్టును నుదురుమీద రాసుకోవాలి. 
2. సూర్యోదయానికి ముందు వెల్లుల్లిరసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని రెండేసి చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాల్లో వేసుకోవాలి.
 3. మునగాకు రసాన్ని రెండేసి చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ గా వేసుకోవాలి.

 *#ఔషధాలు:*

అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మహా సూర్యవర్తి రసం, సూర్యావర్తి రసం క్షీరబలా తైలం (101 అవర్తాలు), వామనామృతం బిళ్లలు, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు.

*#నిత్యరోంప (#సైనసైటిస్):*

సైనసైటిస్ లో తలనొప్పి ఉండే అవకాశం ఉంది. దీని గురించి చెప్పడానికి ముందు, అసలు తలలో ఉండే సైనస్ ల గురించి కొంత చెప్పాలి.

  1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి.
2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావులీటరు), ఉల్లిముద్ద (పావుకిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి.
3. తుమ్మి ఆకులను (గుప్పెడు, వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

*#ఔషధాలు:*

ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహిరసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు, పైకి వాడాల్సివని - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
   *సభ్యులకు విజ్ఞప్తి*
  ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment