Wednesday 29 March 2023

Kidneys-Creatinine in blood-Problem

Kidneys-Creatinine in blood-Problem
మూత్ర పిండాలు - creatinine సమస్య - సిరి ధాన్యాలు, కషాయాల తో స్వస్థత.

మన దేహం లోని కండరాలలో శక్తి పుట్టేందుకు సంబంధించిన Creatine అనే పదార్థం దేహ ప్రక్రియ ల ద్వారా Creatinine గా మారుతుంది. మూత్ర పిండాల సమర్ధత వాటిలోని గ్లోమెరులు ల ఆరోగ్యం సరిలేనప్పుడు - మూత్ర పిండాలు మనరక్తం లో రోజూ పుట్టే ఒక 'వృధా మలిన పదార్థం' అయిన ఈ Creatinine ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బైటికి పంపడం లో విఫలమౌతాయి. తద్వారా రక్తం లోఈ creatinine విలువలు పెరుగుతాయి. ఈ విలువలు 5 దాటితే కంగారు పడాల్సిన స్థితి ఏర్పడుతుంది.

డాక్టర్ ఖాదర్ సలహాల మేరకు ఈ క్రింది పద్ధతులు పాటించి 6 నుండి 10 వారాలలో ఒక 1 -2 పాయింట్ లు దించుకో గలిగి, మళ్ళీ ఆరునెలలకు సరైన రక్తపు విలువలు పొందారు అనేక మంది పేషెంట్లు. ఈ పద్ధతులు తెలుసుకుందాం.

ఎప్పుడూ చెప్పే విధం గా, పేషెంట్స్ వరి బియ్యం, గోధుమలూ, మైదా వస్తువులు, రిఫైన్డ్ ఆయిల్స్, కాఫీ, టీ, మాంసం, గుడ్లూ, ఆల్కహాల్, సిగరెట్, అధిక దేహ పరిశ్రమ చేయటం మొదలైనవి మానివేయాలి. శక్తిని బట్టి వీలయితే 50 నుండి 70 నిమిషాలు మెల్లగా నడవాలి .

a. సిరిధాన్యాల వాడకం :

సామె బియ్యం : 3 రోజుల పాటు 
అరికెల బియ్యం : 3 రోజుల పాటు 
ఊదలు బియ్యం : 1 రోజు 
కొర్ర బియ్యం : 1 రోజు 
అండు కొర్రల బియ్యం : 1 రోజు

ఈ 9 రోజుల సిరి ధాన్యాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే తిరిగి పాటించాలి.
రోజు మొత్తం లో ఒక్క సిరి ధాన్యాన్నే బ్రేక్ ఫాస్టు, లంచ్, రాత్రి భోజనాలకు వాడండి. ( వీటి తో అన్నం, రొట్టెలూ, ఉప్మా, ఇడ్లీ, దోస, బిరియాని, పొంగలి....అన్నీ సాధ్యమే)

ఆహారం లో 'గంజి' ప్రాముఖ్యత : ఈ సిరిధాన్యాలను ముఖ్య ఆహారం గా తీసుకునేటప్పుడు 'గంజి' రూపం లో వీటిని స్వీకరించడం ద్వారా సత్ఫలితాలు సత్వరంగా పొందవచ్చు. UNPOLISHED సిరిధాన్యాలను 7 గంటలపాటు నాన పెట్టి 1:7 నిష్పత్తి లో ధాన్యానికి నీటిని చేర్చి, వండుకుని, ఘన పదార్థాన్ని నజ్జు చేసుకుని, ఒక porridge లాగా, గంజి లాగా స్వీకరించటం మంచిది. దీనితో తే మీకు ఇష్టమైన కూరలూ, పచ్చళ్ళూ అన్నీ తినవచ్చు.

b. కషాయాలు :

రణపాల (Bryophyllum) (Gets roots and new plants from Leaf edges)
కొత్తిమీర (Coriander)
పునర్నవ (Boerhavia diffusa ) (See Pic below)
(తెల్ల గలిజేరు ఆకు)

ఒక్కొక్క వారం పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలో, ఖాళీ కడుపు మీద వీటి కషాయాలు సేవించాలి. 
వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి.
( కషాయం : గ్లాసున్నర నీటి లో 6 -7 ఆకులను/2 గుప్పెడులను చిన్న ముక్కలుగా చేసుకుని 4 నిమిషాలపాటు ఉడికించి, గోరువెచ్చగా, వడకట్టుకుని త్రాగాలి. అవసరమనుకుంటే, శుద్ధమైన తాటి బెల్లపు లేత పాకం చేసుకుని 2-3 చుక్కలు కషాయాలకు కలుపుకోవచ్చు )
ఈ కషాయాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే పాటించాలి.

రకరకాల కూరగాయలు, ఆకు కూరలు తినండి.

పైన చెప్పిన విధానాలను శ్రద్ధ గా పాటించి ఆరోగ్యాన్ని పొందండి. ఈ విజ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు) !

ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !!

No comments:

Post a Comment