గులాబి పూ లతో లాభాలు 🌹🌹
*********
గులాబీలుఎన్నో రకాలున్నా మీరు దేశవాళి గులాబిపూలనే వాడుకోవాలి.
❤️గుండెకు బలాన్ని కలిగించడానికి
🌹గులాబిపూలరేకలు 20గ్రా, మోతాదుగా రెండు కప్పుల మంచినీటిలోవేసి ఒకకప్పుకు మరిగించి వడపోసి రెండుపూటలా తాగుతుంటే గుండెకు బలం కలగటమేకాక , పొట్టలో పేరుకున్న వాతపిత్తకఫాలు హరించి మనసుకు మహా ఉల్లాసం ఉత్తేజం కలుగుతయ్.
😰శిరోరోగాలు తగ్గడానికి
గులాబిరేకలరసం రెండుపూటలా ముక్కుల్లో 3 చుక్కల మోతాదుగా వేసి పీలుస్తుంటే తలనొప్పి, జలుబు, ముక్కుదిబ్బడ హరించి శ్వాస బాగా నడుస్తుంది.
👄పెదవులను అందంగా ఉండటానికి
లేతగులాబిరేకలను తాజా వెన్నతో కలిపి మెత్తగానూరి రోజూ నిద్రించేముందు పెదవులపైన మృదువుగా ,సున్నితంగా మర్దనచేసి ఉదయంపూట కడుగుతుంటే పెదవులు నున్నగా ఎర్రగా మారుతాయి
👃 తుమ్ములు ఎక్కువగా వస్తుంటే
ఒక గ్లాసు నువ్వుల నూనెలో గుప్పెడు గులాబీ రేకులు వేసి బాగా చిన్న మంట మీద మరిగించి దాన్ని వడపోసుకొని రోజుకు మూడు పూటలా మూడు మూడు చుక్కలు రెండు ముక్కలు లో వేయాలి ఇలా వేయటం వలన అధికంగా వచ్చే తుమ్ములు ఆగిపోతాయి.
⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓
No comments:
Post a Comment