Friday 9 June 2023

అధిక బరువు మోకాళ్ళ లో నడుస్తున్నపుడు, కూర్చొని లేచినప్పుడు నొప్పిగా వుంది. బరువు తగ్గాలంటే వైద్య నిలయం సలహాలు

*అధిక బరువు మోకాళ్ళ లో నడుస్తున్నపుడు, కూర్చొని లేచినప్పుడు నొప్పిగా వుంది. బరువు తగ్గాలంటే వైద్య నిలయం సలహాలు*


(1) పాలు, పాల ఉత్పత్తులను 100% avoid చేసి, మజ్జిగ బాగా తీసుకొండి.

(2) జొన్న, సజ్జ, రాగి రొట్టె వీటిలో ఏదైనా రోజూ మద్యాహ్నం ఒకటి రాత్రిపూట ఒకటి తినండి.

(3) గ్రీన్ టీ, లెమన్ టీ, పంచదార, తేనె లేకుండా తాగండి.

(4) చిరుతిండి మానండి.

(5) ఆకలి అనిపిస్తే మంచి నీళ్ల ను తాగండి.
(6)10 గ్రాములు మెంథాల్( పిప్పరమెంటు పువ్వు, పాన్ లో వాడేది)5గ్రాముల ముద్ద కర్పూరం ఒక చిన్న సీసా లో వేసి మూతపెట్టి రెండు నిమిషాలు ముందు కు వెనక్కి కుదపండి.పల్చటి నీరు లాంటి తైలం తయారవుతుంది.

మీకు నొప్పి ఉన్న చోట బాగా రాయండి.ఘాటుగా కొంచెం చిమచిమలాడుతుంది. శరీరం లో ఏ భాగం లో భరించలేని నొప్పి ఉన్నా, దీనిని వాడవచ్చు.వాడేక మీకు వెంటనే కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది.

వాడిన తరువాత చేతులు బాగా కడుక్కోండి. కంటికి తగిలితే మండుతుంది.ఇతరవిధములుగా ఏ ఇబ్బందీ ఉండదు. ఇన్ష్టెంట్ రిలీఫ్ అంతే.మోకాలు కి లోపల ఎముకలు అరిగి పోయాయేమో డాక్టర్ సలహా మేరకు ఎక్సరే తీయించి శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నం చెయ్యాలి .
(7)కేవలం మోకాళ్ళు లేదా జాయింట్స్ నొప్పులు మొదలయ్యాయంటే, అది వయసు రీత్యా ఎముకల పటుత్వం తగ్గుతుందని శరీరం చేసే హెచ్చరిక కావచ్చు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. మల్టీ విటమిన్ మాత్రలు (జిన్కోవిట్ లాంటివి) ఒక రెండు వారాలు వాడి ఫలితం గమనించండి. అయినా తగ్గట్లేదంటే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

వాకింగ్ చేయండి. నొప్పి వున్నా వాకింగ్ చేయక తప్పదు. నొప్పిని నొప్పితోనే జయించగలం. బలమైన కాళ్లు

*కొన్ని ప్రత్యేక పద్దతులను అవలంభించడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు అందులో కొన్ని ముఖ్యమైన చర్యలు*
1) నిపుణుల సలహాలు తీసుకొంటూ ప్రతి రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
2) శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. అందువల్ల ప్రతి రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
3) రా త్రి త్వరగా భోజనం చేసి కొద్ది సేపు నడవాలి. అటు పై మాత్రమే పడుకోవాలి. అంటే రాత్రి భోజనానికి పడుకోవడానికి మధ్య కనీసం 2 గంటల సమయం ఉండాలి.
4) ఎక్కువ క్యాలరీలు కలిగిన పదార్థాలు అంటే చక్కెర, సోడియం కలిగిన ఆహార పదార్థాలు పూర్తిగా వదిలేయాలి.
5) చక్కెర బదులు తేనె తీసుకోవడం మంచిది.
6) కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి
7) ఉదయం అంటే బ్రేక్ ఫాస్ట్ ను తప్పక తీసుకోవాలి.
8) వీటితో పాటు కొన్ని మందులు, సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. అయితే డైటీషియన్ లేదా నిపుణుడైన వైద్యుడిని సంప్రదించి వీటిని తీసుకోవడం మంచిది.
మన ఆరోగ్యానికి ప్రతీకలు. మన భాదను ఎవరూ పంచుకోలేరు. కనుక మనల్ని మనమే కాపాడుకోక తప్పదు. All the best.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఆరోగ్య   సమస్యలకు ఇక్కడ అవగాహన లభించును.

ఈ గ్రూప్ లో చెప్పే  ఆరోగ్య సలహలు మీ అవగాహనకు మాత్రమే, డాక్టర్ కు ప్రత్యామ్నాయం కాదు.
https://chat.whatsapp.com/ESwZHglbVlh8XYuovAS4iL

No comments:

Post a Comment