Wednesday, 12 July 2023

కొవ్వును కరిగించే కొత్తిమీర

కొవ్వును కరిగించే కొత్తిమీర

చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొంతం. దీన్ని వివిధ ఆహార పదార్థాల్లో వేస్తే, ఆ రుచి అదరహో అనిపిం చడం ఖాయం. అది మాత్రమే కాదు... దీన్ని తరచూ తినడం, వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నీ షియం, ఇనుము, మాంగనీస్ లూ తగిన మోతా దులో లభిస్తాయి. విటమిన్ సి, కెతో పాటు ప్రొటీన్లు ఎక్కువే దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వల్ని సమన్వయ పరు స్తుంది. ఇష్టపడే వారు కొత్తిమీర రసాన్ని కూడా తాగొచ్చు.

* కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్ర బాలో కీలకంగా పనిచేస్తుంది. కొవ్వుని కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సి

డెంట్లూ దీనిలో అధికంగా లభిస్తాయి. అందు లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లనా పుల్ని తగ్గిస్తాయి. కొత్తిమీరలోని యాంటీసె. ప్టిక్ లక్షణాలు నోటి పూతను అదుపులో ఉంచుతాయి. నెలసరి ఇబ్బందుల్ని తగ్గిస్తాయి.

No comments:

Post a Comment