Friday 22 December 2023

విరిగిన_ఎముకలు_త్వరగా_అతుక్కోవాలంటే_వీటిని_తీసుకోవాలి

*విరిగిన_ఎముకలు_త్వరగా_అతుక్కోవాలంటే_వీటిని_తీసుకోవాలి..!*
By Naveen Roy

        ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనుకోకుండా కింద పడినప్పుడు సహజంగానే ఎవరికైనా ఎముకలు విరుగుతుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి.

ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనుకోకుండా కింద పడినప్పుడు సహజంగానే ఎవరికైనా ఎముకలు విరుగుతుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. అయితే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ.. ఎముకలు త్వరగా అతుక్కోవాలన్నా, వాటికి మళ్లీ బలం కలగాలన్నా.. కింద తెలిపిన పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

*1. #కాల్షియం*

ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే అందుకు కాల్షియం కావాలి. కనుక కాల్షియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనకు కాల్షియం పాలు, పెరుగు, గుడ్లు, పాలకూరల, సోయా మిల్క్, బ్రెడ్, తృణ ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల కాల్షియం సరిగ్గా అందుతుంది. ఫలితంగా ఎముకలు త్వరగా అతుక్కుని బలంగా మారుతాయి.

*2. #విటమిన్ సి*

మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను మన శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ సి కావాల్సిందే. కనుక విటమిన్ సి ఉండే.. నిమ్మ, నారింజ, పైనాపిల్, కివీలు, క్యాప్సికం, టమాటాలు, ఉసిరి తదితర పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సి ఉంటుంది. దీంతో కాల్షియాన్ని శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది.

*3. #విటమిన్ డి*

కాల్షియం శోషణకు విటమిన్ డి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే చేపలు, గుడ్లు, పాలు, పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

*4. #విటమిన్ కె*

ఆకుపచ్చని కూరగాయాల్లో విటమిన్ కె పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఎముకలు అతుక్కునేందుకు, ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయ పడుతుంది.

*5. #మెగ్నిషియం*

విరిగిన ఎముకలు మళ్లీ నిర్మాణం అయ్యేందుకు మెగ్నిషయం ఎంతగానో సహాయ పడుతుంది. మెగ్నిషియం అధికంగా ఉండే క్వినోవా, రైస్ బ్రాన్, పాలకూర, బాదంపప్పు, జీడిపప్పు, గుమ్మడికాయ విత్తనాలను నిత్యం అధికంగా తీసుకుంటే ఎముకలు బలం పెరుగుతుంది
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
ఫోన్ -9703706660
      This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02NFGqiMwWbjnNU6kH361F9G8RJrws48VY1dbS6eTTsSPga7RugJR8jh8VPSPJrwFcl&id=1536735689924644&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment