*మగవారిలో_కనిపించే_ఇన్_ఫెర్టిలిటీ_సమస్యల్లో_దాదాపు_90_శాతం_వరకు_స్పెర్మ్_కౌంట్_తక్కువ (#వీర్య_కణాలు)* *లోపం_వల్ల_వచ్చేవే_స్పెర్మ్‌కౌంట్_తగినంతగా_లేకపోతే_వారు_తండ్రి_కావడం_కష్టమే.-*
*అవగాహనా_కోశం_నవీన్_నడిమింటి_సలహాలు*
*these foods are very usefull for men to increase sperm count*
సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. మగవారిలో కనిపించే ఇన్ ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది.
మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటే ఉంది అంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. విటమిన్-సి, ఇ, ఫోలేట్ యాసిడ్ మరియు జింక్ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కింద సూచించిన పదార్థాలు కూడా స్పెర్మ్ కౌంట్‌ను భారీగా పెంచడంలో తోడ్పడతాయి.పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2900228716908661/
పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులు కచ్చితంగా డైట్ ఫాలో కావాలి. అందులోనూ పురుషులకు అతి ముఖ్యం. లేకపోతే లైంగిక సామర్థ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఆహార నియమావళిలో మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం అనేక మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో సంతానం కలగడంలేదు. ఈ క్రమంలోనే వీర్యం ఉత్పత్తిని పెంచుకోవడం కోసం నిర్దిష్టమైన ఆహారం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పలు రకాల పదార్థాలను తినడం వల్ల వీర్యం ఎలా అయితే పెరుగుతుందో, ఓ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మాత్రం వీర్యం తగ్గుతుందట.
*ఇవి_ఎక్కువగా_తీసుకోవాలి:*
*ఓయెస్టర్_గుమ్మడికాయ గింజలు:* వీటిలో ఉండే జింక్ టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. స్పెర్మ్ చచ్చుబడిపోవడాన్ని తగ్గించి కౌంట్‌ను పెంచుతుంది.
*ఆరెంజ్, #బ్రకోలి, #స్ట్రాబెర్రీ:* విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. స్పెర్మ్ అభివృద్ధిలో దోహదపడుతుంది.
*పాలకూర_ఆకుకూరలు:* ‘ఫోలేట్’అధికంగా లభ్యమవుతుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి.
*డార్క్_చాకొలేట్:* అర్జినైన్ అనే అమైనో ఆమ్లాన్ని కలిగి ఉండే డార్క్ చాకొలేట్ వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పెరుగుతుంది.
#సాల్మన్_సార్డినెస్: వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్పెర్మ్ నాణ్యతను,కౌంట్‌ను పెంచుతాయి.
#దానిమ్మ_జ్యూస్: దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టెస్టోస్టిరాన్ స్థాయులను, స్పెర్మ్ క్వాలిటీని ఎక్కువ చేస్తాయి
#నీళ్లు: ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. మంచి వీర్యం ఉత్పత్తి అయ్యేలా తోడ్పడుతుంది.
*వీటికి దూరంగా ఉండాలి:*
#ఫ్రైడ్_ఫుడ్స్: స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయి
కొవ్వు ఎక్కువగా డెయిరీ పదార్థాలు: ఇందులో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల ఆరోగ్యకర వీర్యం తగ్గిపోతుంది
#ప్రాసెస్‌డ్_మాంసం: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
#కెఫిన్: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
#ఆల్కాహాల్: స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
#సోడా: వీర్య కణాలు చచ్చుబడిపోతాయి.
*1) #వెల్లుల్లి:* వెల్లుల్లి ఉండే ‘ఎలిసిన్’ అనే పదార్థం స్పెర్మ్ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పదార్థం జననాంగాలకు రక్తం సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సెలూనియమ్, బీ6 స్పెర్మ్ డ్యామేజ్‌ను అరికడతాయి.
*2) #గుడ్లు:* ఎగ్స్‌లో విటిమన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వృషాణాల్లో కణాల నాశనాన్ని అరికడుతుంది. అలాగే గుడ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.
*3) #అరటి:* అరటి పళ్లలో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సెక్స్ హార్మోన్ల విడుదలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఎ, బీ1, సి విటమిన్‌లు వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి.
*4) #డార్క్ చాకొలెట్స్:* వీటిల్లో ఉండే ఎల్-అర్గినిన్ హెచ్‌సీఎల్ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
ఫోన్ - 9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment