Tuesday 27 February 2024

ఉదయం పరగడుపున రోజు చేయవలసినముఖ్యమైన విషయం ఏమిటి?*ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*ఉదయం పరగడుపున రోజు చేయవలసినముఖ్యమైన విషయం ఏమిటి?*ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
      నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్ర లేచిన వెంటనే పరగడుపున కనీసం 650 mL 3 కప్పులు నీరు త్రాగాలి.

శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది.
మీ జీవక్రియను పెంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శక్తి స్థాయిలను పెంచుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మీరు ఉదయం ఎంత నీరు త్రాగాలి అనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
*2.-తిప్పతీగ ని సంస్కృతంలో అమృతవల్లి హిందీలో గిలోయి అని పిలుస్తారు రోజుకి ఐదు ఆకులు తీసుకోవాలా లేక తక్కువ తీసుకోవాలా అనేది దాని పరిమాణాన్ని బట్టి ఉంటుంది ఇవి బాగా ఎదిగితే పెద్ద పరిమాణం లోకి వస్తాయి అప్పుడు రెండు ఆకులు సరిపోతాయి అలా కాకుండా మరీ చిన్న ఆకులు ఐదు తీసుకోవడం మంచిది ఇక తిప్పతీగ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే ప్రధానంగా రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది ప్రధానంగా శ్వాసకోశవ్యాధులను తగ్గిస్తుంది ఉదాహరణకు ఉబ్బసం దగ్గు ఊపిరితిథుల్లో ఉన్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి తిప్పతీగలో యాంటీ బయోటెక్ లక్షణాలు ఎక్కువ కామెర్లు వచ్చినప్పుడు తిప్పతీగ కషాయం తాగడం వలన అవి తగ్గే అవకాశం ఉంది మానసిక ఆందోళన చర్మ వ్యాధులు గాయలని తగ్గిస్తుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి*

3.-థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోవడం మచింది

థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజమ్  అయిన పక్షంలో మాత్ర పరగడుపున వేసుకోమని డాక్టర్ సలహా ఇచ్చినపుడు అలాగే వేసుకోవాలి .ఒక వేళ అవా ఒకేటైముకి వేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి

సరే… మరి మరచిపోతే గుర్తు రాగానే వేసుకోవడమే కాకపోతే టిఫెన్ తిన్న గంటన్నర తరువాత కడుపు కాస్త ఖాళీ అవగానే వేసేసుకోండి .మానకుండా వేసుకోవాలి .డాక్టర్ సలహా ప్రకారమే .

*4.-ఉదయం  జీలకర్ర నీరు త్రాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది..బరువు తగ్గుతారు.జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.వాటితో పాటుగా మెంతులు కూడా వేసి మరిగించి తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.*

*5.-తేనె మరియు నిమ్మరసంతో నీటిని తాగడం*
దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక ప్రసిద్ధ పద్ధతి. ప్రజలు ఈ పానీయాన్ని తాగడానికి ఎంచుకోవడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి: 
 
 *6.-హైడ్రేషన్:*
 తేనె మరియు నిమ్మరసం కలిపిన నీటిని త్రాగడం వలన మీరు రోజంతా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు, ఎందుకంటే తేనె మరియు నిమ్మరసం రెండూ అధిక స్థాయిలో నీటిని కలిగి ఉంటాయి. 
 
  *7.-విటమిన్ సి:* నిమ్మకాయలు విటమిన్ సి యొక్క మంచి మూలం, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. 
 
 *8.-జీర్ణక్రియ:* తేనె మరియు నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడతాయని నమ్ముతారు. తేనెలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి, అయితే నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడే పిత్త ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. 
 
*9.-గొంతు నొప్పి ఉపశమనం:* గొంతు నొప్పి నివారణకు తేనె మరియు నిమ్మరసం రెండూ సాంప్రదాయకంగా ఉపయోగించబడుతున్నాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు, అయితే నిమ్మరసంలోని ఆమ్లత్వం శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేసి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 
 
*10.-బరువు తగ్గడం:*
తేనె మరియు నిమ్మరసం కలిపిన నీటిని తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఎందుకంటే తేనె మరియు నిమ్మరసం రెండింటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆకలిని అణచివేయడంలో సహాయపడవచ్చు. 
 
ఏది ఏమైనప్పటికీ, తేనె మరియు నిమ్మరసంతో నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని గమనించడం ముఖ్యం మరియు దీనిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు.వైద్య నిలయం లింక్స్
https://fb.me/5107t43fT
*11.-ఖాళీ కడుపుతో తినకూడనివి ఏమిటి?*
      క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలా మంది ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టడం లేదు . ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోవడం లేదు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం,చేసే పనుల మీద మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

1. ఆలస్యంగా నిద్ర లేచినప్పుడు, భాగంగా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు. విడుదల అవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.. వికారం, వాంతుల వంటివి. బాధిస్తాయి. వీటన్నింటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.

2. ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట, అదీ పరగడుపున తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధన్యం ఇవ్వాలి.

3. చాలా మంది నిద్రలేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమo వీటివల్ల హార్మోన్ల అసమతల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాస్ నీళ్లు తాగి ఓ పది నిమిషాల తరువాత వీటిని తీసుకుంటే మంచిది.

4. పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టమాటాలను పరగడుపున తీసుకోరాదు. చాలా మంది టమాటా బాత్ లేదా టమాటా రైస్ వంటివి. తింటుంటారు. ఇలాంటివి తినే ముందు పాలు తాగడమో, వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.

5. కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్కు వెళ్లిపోతారు. అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి ముందు కూడా ఇలాగే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు.

6. పరగడుపున 🍌 జోలికి వెళ్లకూడదు. అరటి పండులో మెగ్నిషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదు.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment