Thursday, 1 February 2024

మైదా తినకూడదు, బ్రాయిలర్ చికెన్ మరియు రెడ్ మీట్ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*మైదా తినకూడదు, బ్రాయిలర్ చికెన్ మరియు రెడ్ మీట్ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
       మైదా, బ్రాయిలర్ చికెన్, రెడ్ మీట్ ఈ మూడు మాత్రమేనా..కోకోకోలాలు, ఆర్టిఫీషియల్ ఫ్రూట్ డ్రింక్స్ , ఎనర్జీ డ్రింక్స్ , మద్యం, రెడీ మేడ్ ప్యాకేజీ ఫుడ్స్, సిగరెట్లు, బీడీలు, చూయింగ్ టొబాకో…ఇలాంటి లక్షల కొద్దీ వున్న అనారోగ్య వస్తువుల వినియోగం... వాటితో జరిగే వ్యాపారం వీటిమీదే అన్ని దేశాల ఎకానమీ మనుగడ ఆధారపడి ఉంది. ప్రజలంతా ఈ అనారోగ్య తిండి తింటూ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు స్రుష్టించే కలుషిత నీరు తాగుతూ, కలుషిత గాలి పీలుస్తూ, రోగాల బారినపడితేనే ఈ లక్షల కోట్ల ఫుడ్ బిజినెస్ లతో పాటుగా ఇంకా లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం ,  కొత్త కొత్త రోగాలు కొత్త రకం మందులు,ఫార్మా ఇండస్ట్రీలు , మందుల తయారీ వాటి ఎగుమతులు , కోట్ల ఉద్యోగాలు, ప్రభుత్వాలు వాటి మనుగడ ఇంకా ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అంతా ఈ మైదా వంటి వాటితోనే నడుస్తున్నాయి. మద్యం మీద ప్రతీరోజూ ఎంత GST వస్తుందో దానికి రెండింతలు మైదా మీద వస్తోంది. అన్ని దేశాల దారి ఒకటే ఈ విషయంలో.

*ఇకపోతే బ్రాయిలర్ చికెన్ విషయంలో కోళ్ల కు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వటమే కాకుండా.. జెనెటికల్లీ మాడిఫైడ్ GD పత్తి, మొక్కజొన్న, సోయా గింజలను ఇంకా ఇలాంటి నానా నిషిద్ధ చెత్త ఆహారంగా పెట్టేస్తున్నారు..* శాఖాహార ఆవులకు కుళ్లిపోయిన మాంసం ఎముకలతో ఆహారం తయారు చేసి పెడితే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇదంతా అధిక దిగుబడి కోసం చేసే పనులే.

అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా పండించే ముఖ్యమైన ఆహారపంట గోధుమ..దాని వినియోగం కూడా చాలా ఎక్కువ. అటువంటి పంట ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్నా రవాణాలో పాడయిపోకుండా ఉండటానికి గోధుమను మైదాగ మార్చితే చాలా ఉపయోగపడుతుంది…ఆవిధంగా ఎక్కువ మందికి ఆహారం కూడా లభిస్తుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
   ఆరోగ్య   సమస్యలకు ఇక్కడ అవగాహన లభించును.

ఈ గ్రూప్ లో చెప్పే ఆరోగ్య సలహలు మీ అవగాహనకు మాత్రమే, మీ ఫ్యామిలీ డాక్టర్ కు ప్రత్యామ్నాయం కాదు.
https://chat.whatsapp.com/J6YVKRQ5WxTFtC3XJsqA4V

No comments:

Post a Comment