Sunday 25 February 2024

ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారు, వారి కంటి చూపు కాపాడుకోవడానికి ఏమి చెయ్యాలి?

*ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారు, వారి కంటి చూపు కాపాడుకోవడానికి ఏమి చెయ్యాలి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*..

       ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫాస్ట్ జేనేరేషన్ లో మన కళ్ళు మనుషులను చూసే కంటే మొబైల్, కంప్యుటర్ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నాం. ఇక రోజంతా కంప్యుటర్ ముందు పని చేసే వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు. మన వర్క్ ఇలా మారిపోయింది కాబట్టి ఆ విషయంలో మనం ఎం చేయాలేము, కానీ ఈ వర్కింగ్ స్టైల్ వల్ల మన కళ్ళ పై పెరిగే ప్రెజర్ గురించి మనం ఆలోచించుకోవాలి.


*ఎందుకంటే రోజంతా కంప్యుటర్ స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల మన కంటికి స్ట్రెయిన్ ఎక్కువ అయ్యి చాలా సమస్యలు రావచ్చు. ఉదాహరణకు మనం కంప్యుటర్ చూసేటప్పుడు ఎక్కువగా కను రెప్పలు ఆర్పము కాబట్టి దీని వల్ల కళ్ళు డ్రై అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ఐ స్ట్రెయిన్ వల్ల ‘కంప్యుటర్ విజన్ సిండ్రోం’ అనే సమస్య బాగా పాపులర్ అవుతుంది.*

దీని వల్ల చూపులో స్పష్టత కోల్పోవటం కానీ లేదా చూసేటప్ప్పుడు మన ఫోకస్ ఒక వస్తువు పై నుండి మరో వస్తువు పైకి వెళ్ళటం కష్టం అవ్వటం కానీ జరుగుతుంది. మరి ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు రోజంతా తప్పకుండా కంప్యూటర్ ముందు కూర్చోవాలి అనే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు.


*20-20-20 రూల్ ఫాలో అవ్వండి*.

1.-ప్రతీ ఇరవై నిమిషాలకు ఇరవై సెకండ్ల పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును చూడండి.
2.-ఈ ఎక్సర్సైజ్ వల్ల ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది.
3.-బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఉపయోగించండి.
4.-కంటి ఆరోగ్యానికి సహకరించే ఫుడ్స్ తినండి. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ వంటివి మీ డైలీ డైట్ లో ఉండేలా చూసుకోండి.
5.-ఈ ‘కంప్యుటర్ విజన్ సిండ్రోం’ కు సరిగ్గా నిద్రలేకపోవటం అనేది మరింత ప్రమాదకరం, అందుకనే సరైన ఐ హెల్త్ కోసం మంచి నిద్ర అవసరం.
6.-మీ కంప్యుటర్ స్క్రీన్ మీ కళ్ళకు కనీసం ఇరవై నుండి ఇరవై ఎనిమిది ఇంచుల దూరం మీ ఐ లెవల్ కంటే కొంచెం కిందే ఉండేలా చూడండి.

ఇవి పాటిస్తూ కంటికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఇక వీటితో పాటే జీవన శైలిని ఆయుర్వేద నియమాలతో మరింత హేల్డీ గా మార్చుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల దరి చేరవు.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
      https://www.facebook.com/share/p/hRiUMPA6n5whgnbu/?mibextid=oFDknk
*Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*. 
         https://chat.whatsapp.com/2zSQD8hHQGb2rfiuDP194t

No comments:

Post a Comment