Thursday 22 February 2024

లివర్ సిర్రోసిస్ రోగి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి యే ఆహారం తినాలి? ఎంత తినాలి?

*లివర్ సిర్రోసిస్ రోగి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి యే ఆహారం తినాలి? ఎంత తినాలి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

లివర్ సిర్రోసిస్ విషయం తెలుసు కదా…అది ముఖ్యంగా రెండు రకాలు - ఆల్కహాల్ తాగే వాళ్ళకి వచ్చేది, ఇంకోటి ఆల్కహాల్ తాగని వాళ్లకు వచ్చేది !

అదృష్టవశాత్తు, దీనినుండి బాగుపడే ఛాన్సులే చాలా ఎక్కువగా ఉంటాయి ! ఎందుకంటే లివర్ కు ఉండే సహజంగా రిపేర్ చేసుకునే శక్తి వలన ! కానీ కొన్ని సంవత్సరాల పాటు, ఆహారపు అలవాట్లపై కఠినమైన ఆంక్షలు తప్పనిసరి !

ఇక…

ఈ లివర్ అనేది, నూనె, నేయి లాంటి కొవ్వు సంబంధ ఆహారపదార్థాల జీర్ణక్రియలో పాల్గొంటుంది కాబట్టి ఈ పేషెంటు, ఇవి లేకుండా ఉండే ఆహారం తీసుకోవాలి !

అంటే, రైసు, చపాతి, పప్పు తినవచ్చు ! పండ్లు కూడా తీసుకోవచ్చు ! స్వీట్లు తినకూడదు వాటిలో కూడా నెయ్యి ఉంటుంది ! ఇక అన్నింటికి మించి ఆల్కహాల్ ను మొత్తం దూరంగా పెట్టేయాలి !

అయితే…

ఒకసారి spirulina అనే ఒక కొత్త ఆహారం గురించి కూడా కనుక్కోండి ! ఇది ఈమధ్య సంపూర్ణ ఆహారం అని చెబుతున్నారు ! మీ శరీరానికి ఒకవేళ గనక పడితే, అది కూడా తీసుకోవచ్చేమో, డాక్టర్ సలహా అడిగి తెలుసుకోండి !
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment