Sunday, 18 February 2024

కిడ్నీలను ప్రభావితం చేసే ఆహార పదార్థాలు ఏవి?

*కిడ్నీలను ప్రభావితం చేసే ఆహార పదార్థాలు ఏవి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

       కిడ్నీలను ప్రభావితం చెయ్యడం అంటే,మంచి గానో,చెడు గానో అర్థం కాలేదు,కానీ,

ఇక్కడ చెడు ప్రభావం అనినర్థం లో తీసుకుంటే,

**ఎక్కువ సార్లు కాఫీ తీసుకోవడం గానీ, కెఫిన్ వున్న పదార్థాలు,cold drinks తీసుకోవడం మంచిది కాదు

**టొమాటో లు ఎక్కువగా వాడకూడదు..కానీ,ఇది అందరికీ వర్తించదు,ఎవరికీ ఐతే,రాళ్ళు కిడ్నీల్లో రాళ్ళు తయారైన చరిత్ర వుందో,వాళ్ళకి మంచిది కాదు.

కానీ,అతి వాడకం ఎవరికీ మంచిది కాదు.

నీళ్ళు తక్కువ తాగుతున్నారు అంటే,వాళ్ళకి uric acid పెరిగే, ఇంకా రాళ్ళు తతారు అయ్యే అవకాశం చాలా ఎక్కువ,అందుకే,ప్రతీ ఒక్కరూ,కాలం తో సంబంధం లేకుండా,రోజుకు కనీసం 2-3 లీటర్లు నీళ్లు తాగడం మంచిది.

అదే వృత్తి రీత్యా ఎక్కువ శ్రమించే వాళ్ళకి,లేదా కొంత మంది కి అతి గా స్వేదం వచ్చే వాళ్ళకి, తగినంత నీళ్ళు, లవణాల మిశ్రమం (ORS) లాంటివి తాగడం మంచిది.

*అలాగే , దాహం వేస్తే ఏమైనా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి,మార్కెట్లో దొరికే,కృత్రిమ పానీయాల కంటే.*

అధిక మోతాదు లో పాలు,పాల పదార్థాలు,తీసుకోవద్దు,

*అలాగే విటమిన్ D, calcium tablets వాడకం ఈ మధ్య చాలా మందికి* ఎక్కువైపోయింది,especially,Covid time నుండీ.

కనుక ఆ టాబ్లెట్స్ ని అతి గా,అవసరం మించి, వాడటం అస్సలు మంచిది కాదు.

*మద్యం అతి గా తీసుకున్నా కూడా,కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది.*

మనం రోజూ తినే ఆహారం లో ఉప్పు వినిమాయోగం కొంతవరకు తగ్గించుకుంటే మంచిది.

**నీటిని మించిన ఆరోగ్యకర పానీయం లేనేలేదు.*

కిడ్నీలు శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసే ఒక ఫిల్టరేషన్ సిస్టం లాంటివి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సరైన కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ ని తీసుకోవాలి.

*ఐదు ముఖ్యమైన కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్*

*నీరు*
నీరు ఆహరం కాకపోవచ్చు కానీ కిడ్నీలు సరిగ్గా పని చేయటానికి ఎప్పటికప్పుడు సరిగ్గా నీరు త్రాగాలి, సింపుల్ గా చెప్పాలంటే రోజుకు మహిళలు అయితే 8 గ్లాసులు, పురుషులు అయితే 13 గ్లాసుల నీరు త్రాగాలి.నీరు త్రాగాకపోవటం వల్ల వచ్చే డీహైడ్రేషన్ కిడ్నీ ఫెయిల్యూర్ కి లేదా కిడ్నీల సమస్యలకు కారణం అవ్వచ్చట. అందుకని కిడ్నీ ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమైనది.

*యాపిల్ పండ్లు*
యాపిల్ పండ్లలో కిడ్నీ కి హాని కలిగించే సోడియం, పొటాషియం, మరియు ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి, అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా యాపిల్ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. యాపిల్ పండ్లు కిడ్నీ లో బ్యాక్టీరియా పెరగకుండా కూడా నియంత్రించగలవట. అలాగే వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ సమస్యల పై ప్రభావం చూపగలవట. ఇంకా యాపిల్ పండ్లలో ఉండే విటమిన్లు, ఫైబర్ మరియు మినరల్స్ మంచి పోషకాలను శరీరానికి అందిస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కూడా యాపిల్స్ తినటం మంచి విషయమే!

*కేల్*
కేల్ అనేది ఆకుకూరలలో ఒక రకం. ఈ కేల్ తక్కువ పొటాషియం ఫుడ్ అవ్వటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నా సరే తినవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ,విటమిన్ సి మరియు క్యాల్షియం సహా ఇతర మినరల్స్ కిడ్నీ సరిగ్గా పని చేయటంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం మధుమేహం, ఈ ఆకు కూర షుగర్ లెవల్ ను నియంత్రించడంలో సహాయపడి మధుమేహం పై ప్రభావం చూపుతుంది .

*ముల్లంగి,*
ముల్లంగి అనేది ఒక మంచి డిటాక్స్ ఫుడ్. ముల్లంగి లో తక్కువ పొటాషియం మరియు తక్కువ ఫాస్పరస్ ఉండటం వల్ల ఇది మంచి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ అవుతుంది. ముల్లంగి లో ఇండోల్ -3-కార్బినాల్ మరియు 4-మిథైల్థియో* -3-బ్యూటెనిల్-ఐసోథియోసైనేట్ ఉండటం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపించటానికి అలాగే కిడ్నీ సరిగ్గా పని చేయటానికి బాగా సహాయపడగలదు. పచ్చి ముల్లంగి కంటే ఉడకబెట్టిన ముల్లంగిలోనే తక్కువ పొటాషియం ఉంటుంది, అందుకని వండుకొని తింటేనే కిడ్నీ ఆరొగ్యనికి మంచిది.

*కాలీఫ్లవర్*
కిడ్నీ ఆరోగ్యాన్ని సంరక్షించటంలో కానీ, కిడ్నీ సమస్యలను నివారించటంలో కానీ కాలీఫ్లవర్ ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది శరీరం లోని టాక్సిన్స్ ను బయటకు పంపించేయటానికి సహాయపడుతుంది.కాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి, ఫోలేట్ మరియు ఫైబర్ కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ఈ కాలీఫ్లవర్ ను కిడ్నీ సమస్యలకు ఒక న్యాచురల్ రెమెడీ గా పేర్కొంటారు.

ఈ ఐదు మీ ఆహారంలో భాగం చేసుకొని కిడ్నీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
         This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment