Monday 4 March 2024

కుర్కురే_ఆరోగ్యానికి_చెడ్డదా జంక్_ఫుడ్ (చెత్త తిండి) అంటే_ఏమిటి?* *దాని_నుండి_పిల్లలను_ఎలా_రక్షించుకోవాలి?**వైద్య_నిలయం_సలహాలు

*కుర్కురే_ఆరోగ్యానికి_చెడ్డదా జంక్_ఫుడ్ (చెత్త తిండి) అంటే_ఏమిటి?* *దాని_నుండి_పిల్లలను_ఎలా_రక్షించుకోవాలి?*
*వైద్య_నిలయం_సలహాలు*

                  మనకు బయట షాప్ లో దొరికే ఎన్నో జంక్ స్నాక్ లలో ఇది కూడా ఒకటి. ఈ స్నాక్స్ అనేవి పూర్తిగా ఆరోగ్యానికి మంచివి కావు, అలా అనే తిన్న వెంటనే ఆరోగ్యం చేడిపోతుందా అంటే అదీ కాదు. అధికంగా తీసుకుంటే ఇవి హానికరం.

ఇప్పుడు మీరు అడిగిన స్నాక్ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఫ్రై చేసినది, ఇలా ఫ్రై చేసినవి తినడం వల్ల ముందు మన జీర్ణాశయానికి సమస్య. అందువల్ల ఇవి అధికంగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

*జంక్_ఫుడ్_లో_ఏమి_ఉంటుంది_ఏమి_ఉండదు?*

*1.-క్యాలోరీలు:* తిండి శక్తినిస్తుంది. ఈ శక్తిని క్యాలోరీలు అంటారు. జంక్ ఫుడ్ లో క్యాలోరీల చిక్కదనం (calorie density) ఎక్కువగా ఉంటుంది. ఇవి తినేవారి శరీరాల్లో క్యాలోరీలు అవసరాన్ని మించి చేరుకుంటాయి. శరీరం వీటిని కొవ్వుగా మార్చుకుని దాచుకుంటుంది. వళ్ళు కొవ్వు పడితే అనేక అనర్ధాలు.
#చక్కర(sucrose), మైదా, తెల్ల బియ్యం లాంటి పిండి పదార్ధాలు: వీటిలో ప్రధానంగా క్యాలోరీలే ఉంటాయి. మిగతా పోషక పదార్ధాలు ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు అంత ఉండవు. క్యాలోరీ చిక్కదనం ఎక్కువ. మితులు దాటటం సులభం. ఇవి అలవాటు చేసుకుంటే వళ్ళు కొవ్వు పడుతుంది, బరువు పెరుగుతుంది. శరీరానికి నేరుగా హాని (proinflammatory effects) కూడా జరగవచ్చును.
వెన్న, నెయ్యి, వనస్పతి *2.-(డాల్డా):* వీటిలోకూడా క్యాలోరీ చిక్కదనం ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరానికి నేరుగా హాని (proinflammatory effects) కూడా జరగవచ్చును. అదేపనిగా తింటే బరువు పెరుగుతుంది.
*3.-నూనె_పదార్ధాలు:* మామూలు నూనెలు, నూనె గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ, జంక్ ఫుడ్ లో బాగా మరిగించిన నూనె వాడతారు. వేడికి నూనెలో రసాయన మార్పులు వస్తాయి. హానికరమైన రసాయనాలు పుట్టుకొస్తాయి. వీటి వలన అనేక జబ్బులు రావచ్చును. కాన్సర్ రిస్కు కూడా పెరుగుతుంది.
*4.-ఉప్పు:* శరీరానికి ఉప్పు అవసరం స్వల్పం. జంక్ ఫుడ్ లో కనపడని ఉప్పు చాలా ఉంటుంది. దీని వలన బీపీ పెరగవచ్చును. ఆయుర్దాయం తగ్గవచ్చును.
*5.-రసాయనాలు:* రుచి కోసం, రంగు కోసం కలిపేవి. మనకు తెలిసిన, తెలియని హానికర పదార్థాలు ఉండవచ్చును.
*6.-పోషకాల_లోపం:*
 జంక్ ఫుడ్ లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు, విటమిన్లు తక్కువగా ఉంటాయి.వైద్య సలహాలు కోసం
https://fb.me/gPNtowqSK
*7.-యాంటి_ఆక్సిడెంట్_లాంటి_పదార్థాలు:*
 ఇవి ఇంజిన్ కి గ్రీజు లాంటివి. ఇవి లోపించితే దీర్ఘకాలంలో అన్ని రకాల జబ్బులూ వస్తాయి. ఇవి ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారంలోనే ఉంటాయి. పిండివంటలలోనూ, జంక్ ఫుడ్ లోనూ అసలు ఉండవు. కొనుక్కుందాం అంటే దొరికేవి కావు.

చాలా మందికి జంక్ ఫుడ్ అలవాటు చిన్నతనంలోనే మొదలవుతుంది. పసితనంలో ఏర్పడిన రుచులు ఎల్లకాలం ఉండిపోతాయి. దుష్ఫలితాలు మాత్రం పెద్దయిన తరువాతనే వస్తాయి.

*జంక్ ఫుడ్ అలవాటు అందరికీ ఒక్క లాగా ఉండదు. కొంత మందికి ముదిరి వ్యసనంగా మారుతుంది. దురద్రష్టవశాత్తూ, ఇది సమాజానికి తప్పుగా కనపడని వ్యసనం. ఐతే తాగుడు కూడా కొన్ని సమాజాల్లో తప్పు కాదని గ్రహించాలి.*

మిగతా వ్యసనాల లాగానే మానసిక వత్తిడి, డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలు ఉన్నవారికి జంక్ ఫుడ్ వ్యసనం వచ్చే రిస్కు ఎక్కువగా ఉంటుంది.

జంక్ ఫుడ్ వ్యసనంగా మారిన వారు అది మానలేరు. ఇతర వ్యసనాల లాగానే దీనికి చికిత్స కష్టము. చివరికి ఒకోసారి తిండి వంటబట్టకుండా ఆపరేషన్ (bariatric surgery)చేయించుకోవాల్సి వస్తుంది.

*జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి?* పూర్వం పిల్లలను తోడేళ్ళనుండి, పులుల నుండి రక్షించుకునే వాళ్ళం. ఇప్పుడు జంక్ ఫుడ్ నుండి రక్షించుకునే రోజులు వచ్చినయ్యి. ఇది అంత సులభం కాదు.. నాకు తోచిన #సూచనలు:

  జంక్ ఫుడ్ పట్ల పెద్దవారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు దృఢమైన విశ్వాసాలు, అలవాట్లు ఉండాలి. జంక్ ఫుడ్ ను సాధ్యమైనంత వరకు పిల్లల దృష్టిలో పడనివ్వకూడదు.

*బయటి_తిండి_సంస్కృతి:* ఇది తగ్గాలి. జీవితంలో సరదాలు నింపుకోవటానికి వేరే మార్గాలు చాలా ఉంటాయి.
పుట్టినరోజులు, ఇతర వేడుకలు: ఆడంబరం లేకుండా అర్ధవంతంగా ఉండేలా చేసుకోవాలి. జంక్ ఫుడ్ విలువ తగ్గించాలి.
తాత అమ్మమ్మలు: పిల్లల పెంపకంలో తాత అమ్మమ్మల పాత్ర వెల లేనిది. ఐతే తల్లిదండ్రులకు, తాత అమ్మమ్మలకు పిల్లల తిండి విషయంలోనూ, క్రమశిక్షణ విషయంలోనూ భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి . పసి మనసులకు పరస్పర విరుద్ధమైన సంకేతాలు చేరకూడదు.
పిల్లల తిండి విషయంలో ప్రాధమిక నియమాలను మరచిపోకూడదు.
మీరు తినేదే మీ పిల్లలకు పెట్టుకోండి. మీరు తినని తిండి మీ పిల్లలకు ఎప్పుడూ పెట్టకూడదు. అందరూ మంచి తిండే తినండి. మంచి తిండి ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. వీలైనంత వైవిధ్యం ఉండాలి.
సాధ్యమైనంత వరకూ కుటుంబంలో అందరూ కలసి తినండి. తిండికి ఉన్న సాంఘిక కోణం గ్రహించండి. మీ పిల్లలు మీ నుండి అంతర్లీనంగా నేర్చుకుంటున్నారని కూడా గ్రహించండి.

ఏమీ తినక పోయినా ఫరవా లేదు. మీరు తినేటప్పుడు టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకోండి. తినక పొతే మళ్ళీ టైం వచ్చేవరకు ఆగటం అలవాటు చెయ్యండి. ఆకలి విలువ తెలియాలి.
ఒకోసారి పిల్లలు ఎప్పుడూ ఒకటే తింటామని అంటారు. ఉదాహరణకి వట్టి అన్నం. ఇంకేమీ తినరు. ఇదేమీ కొంప మునిగే విషయం కాదు. చూసీ చూడనట్లు వదిలెయ్యండి. వారే దారిలోనికి వస్తారు. మన పని అవకాశాలు కల్పించడం, అడ్డు పడటం కాదు.
తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి. వినోదం అంటే (టీవీ, కంప్యూటర్, ఫోన్) లాంటివి అసలే ఉండకూడదు. ఈ విషయంలో కుటుంబంలో కఠినమైన నియమాలు ఉండాలి. ఆటపాటలు, వాదసంవాదాలు కూడా ఉండకూడదు.
తిండిని కానుక (reward)గా వాడకండి. ఆకు కూర తిన్నందుకు ఐస్ క్రీమ్ బహుమానం కాకూడదు. ఏడుస్తుంటే ఊరుకోబెట్టటానికి చిరుతిండి పెట్టకండి
పిల్లలకు వారి వయసుకు తగ్గట్టుగా కొన్ని వంటపనులు, ఇంటి పనులు అప్పచెప్పండి. దీని వలన మీకు పని పెరగవచ్చు. కానీ పిల్లలకు మేలు జరుగుతుంది. ఏం వండాలి, ఎలా వండాలి, అని పిల్లలని సంప్రదిస్తూ ఉండండి. వారి స్నేహితులని మీతోపాటు భోజనానికి అప్పుడప్పుడూ పిలవండి.
"విలువలు తెలుసుకుంటే నిర్ణయాలు సులభం"-డిస్నీ

“It’s not hard to make decisions once you know what your values are”-Disney

What is junk food, and how can I help my child from developing junk food habits?

ఇక అలాగే ఇది తామసిక ఆహారం, అంటే ఇటువంటి ఆహారం అతిగా తినడం వల్ల మన మనసుకు గానీ, శరీరానికి కనీ ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ కలగదు. ఒకరకంగా ఈ రకమైన ఆహరం మనసుపై చెడు ప్రభావాన్నే కలిగిస్తుంది.

ఇంకా ఈ జంక్ స్నాక్స్ కి అడిక్ట్ అవ్వడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు టీనేజర్స్ లో తలెత్తే అవకాశం ఉందట, అలాగే ఇందులో అధిక సోడియం ఉండటం వల్ల డయాబెటిక్ మరియు బీపీ ఉన్న వారికి ఇవి ఇంకా ప్రమాదకరం కావచ్చు. స్నాక్స్ తినడం తప్పు కాదు, కానీ హేల్తీ స్నాక్స్ ని ఎంచుకోకపోవడం తప్పు! రుచికోసం ఎప్పుడో ఒక సరి అలా కాస్తంత తింటామంటే ఒకే కానీ రోజూ ఇలాంటి జంక్ తింటే ఆరోగ్యం అనారోగ్యంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు!
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ - 097037 06660,
              This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment