*👆Erectil Disfunctio awareness*
*అంగస్తంభన అంటే ఏమిటి? దానిని ఎలా నిర్ధారిస్తారు?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
అంగస్తంభన సమస్యలను చూసే పురుషులు సమాజం యొక్క కళంకం గురించి ఇకపై చింతించకూడదు. బదులుగా, వారు ఈ లైంగిక సమస్యను నయం చేయడానికి బహుళ చికిత్సా పద్ధతులను అందించే వైద్య సహాయం తీసుకోవాలి. అంగస్తంభన సమస్యకు సురక్షితమైన మరియు ఉత్తమమైన పరిష్కార మార్గాలలో ఒకటి ఆయుర్వేదం.
*ఆయుర్వేదం EDకి చికిత్స చేయగలదా?*
అవును. EDతో సహా అన్ని లైంగిక రుగ్మతలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదం పాత మరియు నిరూపితమైన చర్యలను ఉపయోగిస్తుంది. ఆయుర్వేద సెక్స్ నిపుణులు ఈ లైంగిక సమస్యను నయం చేయడానికి మూలికల నుండి సహజంగా తీసుకోబడిన మందులను ఉపయోగిస్తారు. మందులు సహజంగా రూపొందించబడినందున, వాటికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
*ఏ ఆయుర్వేద మూలికలు-అంగస్తంభన లోపానికి చికిత్స చేస్తాయి?*
అనేక ఆయుర్వేద మూలికలు లైంగిక రుగ్మతలను నయం చేయగలవు. వీటిలో కొన్ని:*
*1.-తులసి బీజ్* - తులసి లేదా తులసి గింజలు పురుషాంగ రక్త సరఫరాను పెంచుతాయి, తద్వారా కణజాలం బలంగా తయారవుతుంది. లైంగిక అవయవానికి మెరుగైన రక్త ప్రసరణ అంగస్తంభన సమస్యలను నయం చేస్తుంది.
*2.-శతావరి* - ఈ ఔషధ మూలిక ED చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, అందువలన, అంగస్తంభన సమస్యలను నయం చేస్తుంది. అంతేకాకుండా, ఇది EDకి కారణమయ్యే మానసిక కారకాలతో పోరాడుతూ మనస్సును కూడా శాంతపరుస్తుంది.
*2.-అశ్వగంధ*
- సెక్స్ వైద్యులు సాధారణంగా ఈ మొక్క దాని లక్షణాల కోసం మందులను సూచిస్తారు. ఇది పురుషాంగ కణజాలానికి శక్తిని అందిస్తుంది మరియు అంగస్తంభన సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది.
*Penile Diseases Awareness..*
*పురుషాంగం నుండి పసుపు రంగు ద్రవం వస్తూ మూత్ర విసర్జన సమయంలో మంట సమస్య కు*
*జననాంగంపైన_ఎర్రని_పొక్కులు_కనిపిస్తున్న*
*జనైటల్_హెర్పిస్_లైంగిక_వ్యాధులు*
*ప్రోస్టేట్_గ్రంథి_వాపు (ప్రోస్టటైటిస్)*
*#సమస్యలు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు*
మగవారికి జననేంద్రియంలో సాధారణమైన నొప్పి వచ్చినా లేనిపోనివి ఊహించుకుని హడలిపోతుంటారు . దీనికి కారణాలు అనేకం, నొప్పి ఉండే స్థానం మర్మావలయం కావటం, పురుషాంగంలో నొప్పికి శృంగార జీవితానికి సంబంధం ఉండటం, విషయాన్ని ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేకపోడవం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. అయితే దీని మీద సరైన అవగాహన ఉంటే అనవసరమైన భయాందోళనలకు తావుండదు.
1.*#సంభోగంలో_దురుసుతనం_వల్ల_నొప్పి:*
పురుషాంగంలో అనేక రకాలైన నిర్మాణాలుంటాయి. లైంగిక చర్యలో ఇవి ఒకోసారి ఒరిపిడికి లోనై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఉదాహరణకు పురుషాంగపు ముందు చర్మం బిగుతుగా ఉన్నప్పుడుగాని, పురుషాంగం శిశ్నమణి క్రింద భాగంలో చర్మాన్ని శిష్నానికి కలుపుతూ వుండే స్నాయువు కురచగా ఉన్నప్పుడుగాని సంభోగ సమయంలో కదిలికలకు ఇబ్బంది ఏర్పడి నొప్పి వస్తుంది. పురుషాంగంలో ఇటువంటి నిర్మాణపరమైన సమస్యలు ఉన్నప్పుడు సాధారణస్థాయికి మించి కొంచెం ఎక్కువ ఉద్రేకంతోనూ, ఎక్కువ సార్లు సమాగమంలో పాల్గొంటే, సరైన లూబ్రికేషన్ (జారుడుగుణం) లేని కారణంగా పురుషాంగం ముందు చర్మం చిట్లడంగాని, చర్మాన్ని శిశ్నానికి కలిపి ఉంచే ఫ్ఫ్రెన్యులం తెగటం గాని జరిగి నొప్పి వస్తుంది.
నవీన్ రోయ్ సూచనలు: ఇలా జరిగినప్పుడు ఉప్పు కలిసిన వేడినీళ్లతో కాపడం పెట్టుకుంటే రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. అవసరమైతే జాత్యాది ఘృతం అనే మందును పై పూతగా వాడవచ్చు.పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం వైద్య నిలయం లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=518938140033021&id=100057505178618
*2. #విసర్పం (జనైటల్ హెర్పిస్):*
జననాంగంపైన వచ్చే హెర్పిస్ వ్యాధి - ముఖ్యంగా సింప్లెక్స్ వ్యాధి సరైన రక్షణ పాటించని లైంగిక కలయికతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో చమట కాయల మాదిరి నీటి పొక్కులు గుంపులుగా ఏర్పడి, పగిలి, ఒకే వ్రణంగా తయారై, చెక్కుకట్టి పూర్తిగా మానిపోతాయి చాలామందిలో హెర్పిస్ వైరస్ వెన్నుపూసలో దాగివుండి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడుగాని, జలుబుం ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడుగాని తిరగబెడుతూ మానసిక వేదనకు, నిస్పృహకు గురిచేస్తుంటుంది. పొక్కులు కనిపించే ముందు జననాంగం పైన కొద్దిగా దురదగా, లేదా మంటగా అనిపిస్తుంది. ఒకోసారి గజ్జల్లో కూడా కడతాయి. గుడూచి, శారిబా, హరిద్రా, భూమ్యామ్లకి అనే మూలికలు హెర్పిస్ వైరస్ ను సమర్ధవంతంగా అదుపు చేయగలుగుతాయి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టీ, వ్యాధి ఉధృతిని బట్టీ వివిధ సంయోగాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.
#ఔషధాలు: గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, కామదుఘ రసం, మంజిష్టాది క్వాథం చూర్ణం, నింబాది క్వాథ చూర్ణం. పిండ తైలం, షడంగ క్వాథ చూర్ణం.
బాహ్యప్రయోగాలు - మహాతిక్తక ఘృతం, నాల్పామారాది తైలం.
*3. #లైంగిక_వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్):*
గానోరియాలోను, ఇతర మూత్రనాళానికి చెందినా ఇన్ఫెక్షన్లలోను, మూత్రంలో మంటతోపాటు పురుషాంగంలో నొప్పి కూడా ఉంటుంది. సరైన రక్షణ పాటించని అనైతిక లైంగిక సంబంధాలలో సాధారణంగా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. గజ్జల్లో బిళ్ళలు కూడా కడతాయి.
*ఔషధాలు:* చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి,Fc గోక్షురాదిగుగ్గులు, తామ్రభస్మం, వంగభస్మం, వంగేశ్వరరసం, యవక్షారం.
*4. #ప్రోస్టేట్_గ్రంథి_వాపు (ప్రోస్టటైటిస్):*
ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు (ప్రోస్టటైటిస్) పురుషాంగంలో నొప్పి వస్తుంది. ఈ వ్యాధి చాలా మందిలో దీర్ఘ వ్యాధిగా కొనసాగుతుంది. లైంగిక వ్యాధుల నుంచి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వరకు అనేక రకాలు ప్రోస్టటైటిస్ ను కలిగించే అవకాశం ఉంది.
#ఔషధాలు: అభ్రక భస్మం, చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.(పై మందులు అన్ని అందరికి ఒక్క లాగా పని చేయడు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు తీసుకోవాలి )
*5.#పురుషాంగం_ముందు_చర్మం_బిగుసుకుపోవడం (బెలనైటిస్):*
కొంతమందికి బ్యాక్టీరియా వల్లగాని, ఫంగస్ వల్లగాని పురుషాంగం ముందు భాగం ఇన్ఫెక్షన్ కు లోనై, ఎర్రగా వాచిపోయి నొప్పిని కలిగిస్తుంది. మధుమేహవ్యాధి గ్రస్తుల్లోను, వ్యాధి క్షమత్వ శక్తి తగ్గిన వారిలోనూ ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
#ఔషధాలు: కైశోరగుగ్గులు, మంజిష్టాదిక్వాథ చూర్ణం.
బాహ్యప్రయోగం: పంచవల్కల కషాయం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment