Saturday 2 March 2024

HEALTH: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా....? అయితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గినట్లే.....పెంచుకోవడానికి వీటిని తినండి"...!!. 👇🏼

*"HEALTH: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా....? అయితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గినట్లే.....పెంచుకోవడానికి వీటిని తినండి"...!!. 👇🏼*

*'Health': మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిల్లో రక్త కణాల సంఖ్య ఒకటి. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందాలంటే రక్త కణాలు సక్రమంగా ఉండాలి.*

*ఇక ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ ఆక్సిజన్‌ సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటకు తీసుకెళ్లడంలోనూ హిమోగ్లోబిన్‌ ఉపయోగపడుతుంది.*

*ఇక హిమోగ్లోబిన్‌ తగ్గడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు మొదలువుతుంటాయి.*

*ముఖ్యంగా శరీరంలో సరిపడా హిమోగ్లోబిన్‌ లేకపోతే.. అలసట, నీరసం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను ప్రధానంగా కనిపిస్తాయి. మీలో కూడా ఈ లక్షణాలు ఎంతకూ తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అయితే సహజంగా హిమోగ్లోబిన్‌ను పెంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ పదార్థాలేంటంటే..*

*హిమోగ్లోబిన్‌ పెంచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ డి, ఫోలేట్‌, అమైనో యాసిడ్లు, విటమిన్ బి12, ఐరన్ హిమోగ్లోబిన్‌ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. మంచి పెరుగుతుంది.*

*శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెంచుకోవడానికి రోజుకో డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలి. దీని ద్వారా మెగ్నిషియం, ఐరన్‌ స్థాయిలు పెరుగుతాయి. బీపీ నియంత్రణలోకి రావడంతో పాటు గుండె జట్టులు కూడా దరి చేరవు.*

*హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారు అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాల్లో మెగ్నిషియం, ఐరన్‌, ఫైబర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.*

*పాలకూరలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్‌, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాదు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.*

💠💠

No comments:

Post a Comment