Sunday 31 March 2024

ఓఆర్ఎస్_అంటే_ఏంటి_డీహైడ్రేషన్_అవ్వకుండా_ఉండాలంటే_ఏం_చేయాలి

*ఓఆర్ఎస్_అంటే_ఏంటి_డీహైడ్రేషన్_అవ్వకుండా_ఉండాలంటే_ఏం_చేయాలి..*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

           మన శరీరంలోకి ప్రవేశించే నీటి కంటే మన శరీరం నుంచి బయటికి వెళ్లిపోయే నీటి శాతం ఎక్కువైతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో నీటి శాతం తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. సాధారణంగా రొటీన్ లో కొంత నీటిని కోల్పోతాము. అదెలాగంటే, శ్వాస ద్వారా హ్యుమిడిఫైడ్ ఎయిర్ అనేది బయటికి వెళ్తుంది. అలాగే చెమట ద్వారా నీటిని కోల్పోతాము. మూత్రం అలాగే బవుల్ మూవ్మెంట్స్ ద్వారా కూడా కొంత నీటిని కోల్పోతాము. 

*డీహైడ్రేషన్_కి_దారితీసే_కారణాలు:*

*డయేరియా:*

వాటర్ లాస్‌కి ప్రధాన కారణం డయేరియా. నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ప్రతి బవుల్ మూవ్మెంట్ తో వాటర్ లాస్ జరుగుతుంది. డయేరియా అలాగే కొనసాగితే ప్రమాదకరం. డయేరియాతో తలెత్తే డీహైడ్రేషన్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
 
*#వాంతులు:*

వాంతులవల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అదేపనిగా వాంతులవుతూ ఉంటే ప్రమాదకరం కూడా. శరీరంలో ఫ్లూయిడ్ లాస్ జరుగుతుంది. వాంతులు అవుతూ ఉంటే లిక్విడ్స్ ను తాగడానికి కూడా పేషంట్స్ ఇబ్బంది పడతారు.

*#చెమట:*

చెమట ద్వారా శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో వాటర్ లాస్ జరుగుతుంది. వాతావరణం వల్ల శరీరం వేడిగా ఉన్నా, వేడి వాతావరణలో వ్యాయామం చేస్తున్నా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం ఉన్నా చెమట ద్వారా శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి ప్రయత్నిస్తుంది.

*#మధుమేహం:*

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో విపరీతమైన దాహం అలాగే తరచూ యూరినేషన్ అవసరం ఏర్పడటం వంటివి సహజం. వీటి వల్ల వారిలో వాటర్ లాస్ సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది.

*కాలిన_గాయాలు:*

శరీరంలో ఫ్లూయిడ్ అలాగే టెంపరేచర్ రెగ్యులేషన్ కు స్కిన్ పోషించే రోల్ ముఖ్యమైనది. స్కిన్ గాయాలపాలైతే ఈ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. అందుకే, కాలిన గాయాల బారిన పడినవారు డీహైడ్రేషన్ కు గురవుతారు. అలాగే, ఇతర స్కిన్ ఇన్ఫ్లమేటరీ డీసీజెస్ వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

*తగినంత_నీరు_తాగలేకపోవడం:*

తగినంత నీరు తాగలేకపోవడం కూడా డీహైడ్రేషన్ కి దారితీసే ప్రధాన కారణం. తగినంత నీరు అందుబాటులో లేకపోవడం వల్ల కావచ్చు లేదా తగినంత నీటిని తాగలేని నిస్సహాయ స్థితి కావచ్చు వీటికి రొటీన్ వాటర్ లాస్ తో పాటు మిగతా కారణాల వల్ల వాటర్ లాస్ తోడైతే డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది.వైద్య నిలయం లింక్స్ https://fb.me/1FfYT3tyo

*ఎలా డయాగ్నోస్ చేస్తారు:*

పేషంట్ స్పృహలో ఉన్నారో లేదో చెక్ చేస్తారు.

బ్లడ్ ప్రెజర్ రీడింగ్స్ ను అలాగే పల్స్ రేట్స్ ను నమోదు చేసుకుంటారు. డీహైడ్రేషన్ వల్ల పల్స్ రేట్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ పడిపోతుంది. ఎందుకంటే ఇంట్రావాస్కులర్ స్పేస్ లో నీళ్ల కొరత ఏర్పడుతుంది కాబట్టి. ఫీవర్ ఉందో లేదో తెలుసుకునేందుకు టెంపరేచర్ చెక్ చేస్తారు. చెమట పడుతుందో లేదో చెక్ చేస్తారు. అలాగే ఎలాస్టిసిటీ డిగ్రీను అంచనా వేస్తారు. డిహైడ్రేషన్ సమయంలో స్కిన్ లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎలాస్టిసిటీ సామర్థ్యం తగ్గిపోతుంది.

*ఇంట్లోనే డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరించుకోగలమా?*

డిహైడ్రేషన్ సమస్య తీవ్రమైతే ఇబ్బందులు వస్తాయి. ప్రారంభదశలోనే ఈ సమస్యను గుర్తిస్తే ఇంట్లోనే పరిష్కరించుకోగలుగుతాము.ఫీవర్ ను కంట్రోల్ చేసేందుకు అసెటమినొఫెన్ లేదా ఐబుప్రోఫెన్ ను వాడవచ్చు. ఐబుప్రొఫెన్ స్టమక్ ను ఇరిటేట్ చేయవచ్చు. దాంతో, వికారం అలాగే వామ్టింగ్ రావచ్చు. కాబట్టి, ఆల్రెడీ ఈ లక్షణాలున్నవారు దీన్ని జాగ్రత్తగా వాడాలి. కోల్పోయిన ఫ్లూయిట్స్ ను నోటి ద్వారా రీప్లేస్ చేసేందుకు చిన్న చిన్న మోతాదుల్లో క్లియర్ ఫ్లూయిడ్స్ ను రోగికి ఇస్తూ ఉండాలి. ఒకవేళ రోగి గందరగోళంగా అలాగే లెథర్జిక్ గా మారితే, ఫీవర్ తగ్గకపోతే, వామిటింగ్ తో పాటు విరేచనాలు కంట్రోల్ కాకపోతే వెంటనే మెడికల్ కేర్ అవసరమవుతుంది.

*డీహైడ్రేషన్ తో వల్ల వచ్చే కాంప్లికేషన్స్*

కిడ్నీఫెయిల్యూర్, కోమా, షాక్, గుండె జబ్బులు, ఎలెక్ట్రోలైట్ లో అబ్నార్మాలిటీస్ వంటివి డీహైడ్రేషన్ తో వచ్చే కాంప్లికేషన్స్.

*ఎలా ప్రివెంట్ చేయాలి?*

అవుట్ డోర్ ఈవెంట్స్ కి వెళ్లే ముందు మీతో పాటు తగినంత డ్రింకింగ్ వాటర్ ను తీసుకెళ్లండి. చెమట పట్టే యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే వేడి మరియు ఒత్తిడి వల్ల ఫ్లూయిడ్ లాస్ జరుగుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు ఫ్లూయిడ్స్ ను రీప్లేస్ చేయాలి.

బయటికి వెళ్లే ముందు వెదర్ కండిషన్స్ ను గమనించండి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం అవాయిడ్ చేయండి. వ్యాయామాన్ని కూడా అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఎండవేడికి గురవకుండా జాగ్రత్తపడండి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే బయటి యాక్టివిటీస్ ను ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు డీహైడ్రేషన్ కు గురయ్యే రిస్క్ ఎక్కువ. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు వారిలో ఫ్లూయిడ్ లాస్ జరగకుండా కేర్ తీసుకోండి.

ఆల్కహాల్ ను అవాయిడ్ చేయండి. ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి. ఆల్కహాల్ వాటర్ లాస్ కి కారణమవుతుంది.

లైట్ కలర్ తో పాటు లూజ్ ఫిట్టింగ్ క్లాతింగ్ ని ప్రిఫర్ చేయండి. అవుట్ డోర్ కి వెళ్ళవలసి వస్తే పెర్సనల్ ఫ్యాన్ ను తీసుకెళ్లండి.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
ఫోన్ 097037 06660,
           This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment