Saturday 30 March 2024

జలుబు చేసినప్పుడు మీరు పాటించే నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*జలుబు చేసినప్పుడు మీరు పాటించే నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*


☘️ విశ్రాంతి తీసుకోవడం…..శరీరము జలుబు నుంచి కోలుకోవడానికి కొంత విశ్రాంతి నివ్వాలి. పుష్కలంగా నిద్రపోండి రోజుకు కనీసం 7-8 గంటలు.

☘️ అధిక ద్రవాలు త్రాగాలి…..నీరు, వేడి నీరు మరియు వేడి పానీయాలు సూప్ల వంటి ద్రవాలు ఎక్కువగా త్రాగాలి. డీహైడ్రేషన్ ను నివారించడానికి ద్రవాలు ముఖ్యమయినవి.

🍀 అధిక పోషక ఆహారం తినాలి…..పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినండి - పండ్లు, కూరగాయలు, సూప్, జంతు మాంసం, గుడ్లు, పాలు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తినండి.

🍀 గొంతు నొప్పికి చికిత్స చేయండి…. వేడి నీరు మరియు వేడి పానీయాలు త్రాగడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం వలన కూడా ఉపశమనం లభిస్తుంది.

🌿🌿. ఇంటి నివారణలు…..

🌿. అల్లం, తేనె మిశ్రమాన్ని తీసుకోండి

🌿. వేడి నీటి నందు పసుపు, యూకలిప్టస్ ఆయిల్ కలిపి వేడి కాపడం పెట్టుకొండి.

🌿. ఉల్లిపాయ రసం ముక్కులో చుక్కలుగా వేసుకోండి.

🌿. వేడి నీటి నందు చారెడు ఉప్పు కనిపి స్నానం చేయండి.

🌿. ఉప్పు నీటితో ముక్కు శుభ్రం చేసుకోండి.

🌿. అల్లం, తులసి వంటి మూలికలతో టీ చేసుకొని త్రాగండి.

*దగ్గు తగ్గడానికి*
         దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయి.కావున గృహ వైద్యం చెప్పాలంటే మీ పెద్ద వారి నడిగితే వారు అనుభవం మీద చెబుతారు.

నాకు తెలిసినంతలో మీరు ఒకటి రెండు రోజులు మామూలు ఆహారం మానేసి పళ్ళు ,ఎండు పండ్లు మరియు పళ్ళరసాలు మాత్రమే తీసుకోండి.తప్పక ఉపయోగపడుతుంది.దానిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోండి.
1.-కరక్కాయ బుగ్గన పెట్టుకొని పడుకుంటే రాత్రి పూట దగ్గు తగ్గుతుది
2.-లవంగం కాల్చి బుగ్గన పెట్టుకోవచ్చు
3.-పచ్చ జొన్నలు బుగ్గన పెట్టుకొని లాలాజలం మింగుతుంటే గొంతులో ఉన్న తేమాడ/ కళ్లే/ కఫం తెగుతుంది
నాలుగు తులసి ఆకులు నమిలిన కూడా తగ్గుతుంది
4.-అల్లం రసంలో తెనే కలుపుకుని తాగాలి.
5.-పరిగడుతున్న రెండు వెల్లుల్లి గర్భాలు తినాలి.
6.-యాలకుల లోపల గింజలను నమిలి తినాలి.
(ఇవన్నీ ఇంట్లో వాడే సలహాలు మాత్రమే! ఆరోగ్య విషయంలో మీ ఫ్యామిలీ వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
ఫోన్ -9703706660
*సభ్యులకు సూచన*
*****
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

https://chat.whatsapp.com/F63TaaGxoYmB6NX7xrrwSX

No comments:

Post a Comment