*👆Testicular Cancer Awareness.*
*టెస్టిక్యులర్ క్యాన్సర్ లక్షణాలు,అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
*టెస్టిక్యులర్ క్యాన్సర్:*
పురుషుల్లో లంగ్ , ప్రోస్టేట్ క్యాన్సర్ తర్వాత అధికంగా కనిపించే క్యాన్సర్లలో వృషణాల క్యాన్సర్ ఒకటి. పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం ఈ వృషణాలు. సాధారణంగా 15 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న పురుషులకు వృషణాల కాన్సర్ వస్తుంటుంది. వృషణాల క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు. కాలుష్యం, రేడియేషన్ బారిన పడడంతో పాటు వయసు ప్రభావం వలన వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవే కాకుండా కొంతమందిలో వంశపారంపర్యంగా వృషణాల క్యాన్సర్ వచ్చిన వారు కూడా ఉంటారు. కుటుంబంలో తండ్రికి గానీ సోదరులలో ఎవరికైనా వృషణాల క్యాన్సర్ ఉన్నవారుంటే తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వృషణాల్లో ఏర్పడే ప్రధాన ఇన్ఫెక్షన్ ను గొనెడిల్ జెనెసిస్ అంటారు. అంటే వృషణాలు వృద్ధి చెందే సమయంలోనే జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ రకమైన క్యాన్సర్ సోకే అవకాశముంది. ఇటువంటి సందర్భాల్లో ఒక వృషణానికి క్యాన్సర్ సోకితే రెండో వృషణానికి కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వృషణాల క్యాన్సర్ లక్షణాలు:
వృషణాల క్యాన్సర్ సోకినవారికి పొత్తికడుపు కింది భాగంలో నొప్పి వస్తుంటుంది.
వృషణం తిత్తిలో నొప్పి రావడం, మొలభాగం చుట్టు పక్కల ప్రాంతాల్లో నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇవి వృషణాల క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలేమోనని అనుమానించాలి.
ఒక్కోసారి వృషణాలపై ఏర్పడే టెస్టిక్యులార్ మైక్రో లితియాసిస్, అపెడి డైమెల్ తిత్తులు, అప్పెండిక్స్ వృషణాలు కొంచెం నొప్పిని కలుగజేస్తుంటాయి. కాని అవి క్యాన్సర్ కు సంబంధించినవి కావు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
ఇంకొన్ని సందర్భాలలో సార్టంలో ద్రవాలు చేరుతుంటాయి. ఈ సమయంలో తీవ్రమైన అలసట అనిపిస్తుంది.
వృషణాల పరిణామంలో ఎటువంటి మార్పులు కనిపించినా, వాపు లాంటిది అనిపించినా ఇది వృషణాల క్యాన్సర్ అని అనుమానించాలి.
*టెస్టిక్యులర్ క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు:*
పైన తెలిపిన వాటిలో ఏదైనా లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టరుని సంప్రదించి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి. ఇందులో ముఖ్యంగా సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మిగిలిన క్యాన్సర్ల మాదిరిగానే వృషణాల క్యాన్సర్ కూడా ముదిరేకొద్దీ వ్యాప్తి చెందుతుంది. ముందుగా లింఫ్ గ్రంధుల్లోకి చేరిన క్యాన్సర్ కణాలు తర్వాత కిడ్నీలు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ వంటి ప్రధాన భాగాలకు వ్యాపిస్తాయి. పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత క్యాన్సర్ కణాలు ఏమేరకు వ్యాప్తి చెందాయో తెలుస్తుంది కాబట్టి వ్యాధి దశను గుర్తించి చికిత్స చేయడానికి సులువుగా ఉంటుంది.
వృషణాల మీద కణితిని గుర్తించిన తర్వాత ట్యూమర్ మార్కర్ ఉపయోగించి గడ్డ యొక్క పరిణామాన్ని గుర్తిస్తారు. ట్యూమర్ మార్కర్ రీడింగ్ ఆధారంగా గడ్డ యొక్క ఈ పరిణామం… తీవ్రత తెలుసుకుని దాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. టెస్టిక్యులర్ క్యాన్సర్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే వృషణాల క్యాన్సర్ చికిత్సలో సక్సెస్ రేటు ఎక్కువే. నిర్ధారణ అయిన వృషణాల క్యాన్సర్లో 90 శాతం కేసులు పూర్తిగా నయమైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
రసాయన ఆయుర్వేద వైద్యంతో వృషణాల క్యాన్సర్
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://chat.whatsapp.com/LEHiXgzF331E7vRo9MnieY
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment