Sunday 17 March 2024

Cancer awareness..**మొదటి దశ లో నే కాన్సర్ ని ఎలా గుర్తించాలి ? కాన్సర్ రాకుండా ఉండడానికి నివారణ మార్గాలు ఏమిటి ?

*👆Cancer awareness..*
*మొదటి దశ లో నే కాన్సర్ ని ఎలా గుర్తించాలి ? కాన్సర్ రాకుండా ఉండడానికి నివారణ మార్గాలు ఏమిటి ?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

మొదటి దశలో కేన్సర్ ని గుర్తించడం ఎలా నివారణ మార్గాలు

*మొదటి దశలో కేన్సర్ ని గుర్తించడం ఎలా నివారణ మార్గాలు*

ముందుగా స్త్రీలలో ఎక్కువగా వచ్చే కేన్సర్ ఏది

*రెండు రకాలు*

1.-గర్భాశయ కంఠ కేన్సర్

2.-స్థన కేన్సర్ (బ్రెస్ట్ కేన్సర్ )

*గర్భాశయ కంఠ కేన్సర్.. సర్వైకల్ కేన్సర్ అందాం .లేదా కేన్సర్ సర్విక్స్*

దీనికి కారణాలు ప్రవర్తన లోపాలు స్త్రీలో కానీ ఆమెభర్తలో కానీ ఎక్కువమందితో ... సంబంధం కలిగి ఉన్న వారు . వీరిలో గర్భాశయ కంఠ కేన్సర్ రావచ్చు

(దయచేసి నా విన్నపము .. ఈ రకమైన కేన్సర్ వచ్చిన వారందరూ ఇటు వంటి వారా అని ఆలోచించ వద్దు ఇతర కారణాలుకూడా ఉంటాయి..వారి ఆహారం అలవాటు బట్టి ఉంటుంది

కాబట్టి ఈ రకమైన కేన్సర్ కి ఇతర అనేక కారణాలు కూడా ఉంటాయి .

పాపిల్లోమా వైరస్ హెచ్ పి వి స్క్రీనింగ్ చేయించుకోవాలి . పేప్ స్మియర్ నియమంగా పరిక్ష చేయించుకోవాలి . ఎవరికైనా రావచ్చు .నాకెలా వస్తుందనే పిచ్చి ప్రశ్న వద్దు

*2.-రెండవది బ్రెస్ట్ కేన్సర్*

రెగ్యులర్ చెకప్. సెల్ఫ్ చెక్ అని ఉంటుంది స్నానం చేసేటప్పుడు వారిని వారే పరీక్షించుకోవాలి .అనుమానాస్పదమైన గడ్డలు తగిలితే వెంటనే వైద్య సలహా తగురీతి పరీక్షలు చేయించు కోవాలి

ఏరకమైన అనుమానం లేకపోయినా మేమోగ్రఫీ స్కేనింగ్ పరిక్ష చేయించుకోవాలి

*ముఖ్య గమనిక*

స్త్రీలలో రొమ్ములలో గడ్డ తగిలినా చాలా మంది అనేక అపోహలతో మౌనంగా మరణం వేపు సాగిపోతారు చివరికి విషమించాక అందరికీ తెలుస్తుంది

*ఏమిటా అపోహలు*

1.-కేన్సర్ అంటే మందులేదు మరణమే

2.-స్తనం పూర్తిగా తీసేస్తారు అంద వికారంగా ఎలా బతకను

3.-నేను వైద్యం అని ఉన్నది ఖర్చు చేస్తే నా కుటుంబం వీధిన పడుతుంది

*నిజాలు****"*

బ్రెస్ట్ లేక రొమ్ము పూర్తిగా తీయరు కేవలం గడ్డ తీసి లేక ఎక్కువ తీసినా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ తో పూర్వ రూపం సాధ్యం

కేన్సర్ కి మందు లేదన్నది అబద్దం మంచి వైద్యంతో మామూలు జీవితం సాధ్యం

వైద్యం చేస్తే వీధినపడడం కాదమ్మా మీకేమైనా అయితే అనాధలమౌతాం .డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు .ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయి

ఇక అమ్మాయిలలో కనపడే గడ్డలన్నీ కేన్సర్ లు కావు కావండీ ,కానీ పరిక్షలోనే తెలుస్తుంది
https://chat.whatsapp.com/FEZbzYrfAczFzxKPEuYmRD
ఇది చదివిన స్త్రీలకి పాదాభి వందనం చేసి మరీ వేడుకుంటున్నాను

చదువుకున్న వారుస్త్రీలలో అవగాహన పెంచండి .

ఒక్కరు కూడా కేన్సర్ కి బలికాకూడదు మనం నడుము కడదాం

ఒక స్త్రీ బాగుంటే కొన్ని తరాలు బాగుంటాయి

ఇవి స్త్రీలలో

మరి పురుషులలో లేక ఇద్దరిలో

లేటుగా వచ్చిన పుట్టుమచ్చలు

పెద్దవౌతున్నా లేక దురద మొదలైనా వైద్య సలహా అవసరం

విరోచనమయ్యే తీరులో అనుకోకుండా మార్పులు .ఓసారి మలబద్దం ఓసారి విరోచనాలు

శరీరంలో ఏభాగంలోనైనా వేగంగా పెరుగుతున్న గడ్డలు

పి ఎస్ ఏ పరీక్షలు మగ వారికి ప్రాస్టేట్ కేన్సర్ స్క్రీనింగ్

కొన్ని రకాల కేన్సర్ లు ముఖ్యంగా రక్త కేన్సర్ లు

ఇవి చాలా రకాలు .కొన్ని వేగంగా ప్రాణంతీసేవి కొన్ని ఏళ్ళుగడిచినా గొడవ చేయనవి .బయట లక్షణాలు తక్కువ ముక్కులో రక్తం కారడం (అన్ని సార్లు కేన్సర్ కాకపోవచ్చు ) ,లేక శరీరం మీద ఎర్రటి మచ్చలతో అకస్మాత్ గా రావచ్చు

ఇవి ఇతర సమస్యలలోకూడ ఉండొచ్చండోయ్ అలా చూడగానే కేన్సర్ బాబోయ్ అని గొడవ మొదలెట్టక వైద్య సలహా సంయమనం ముఖ్యం .

*అసలు రాకుండా జాగ్రత్తలు.నవీన్ రోయ్ సలహాలు .*
 స్మోకింగ్, గుట్కా లాంటి దురలవాట్లకు ఇతర దష్ట ప్రవర్తనలకు దూరంగా ఉండడం .నియ మిత పరీక్షలు.

నేను చెప్పగలిగినది బహు స్వల్పం .

అపార్థాలు వద్దు

సంయమనంతో

ఆలోచించి,

మీ ఫ్యామిలీ డాక్టర్ని స్వయంగా కలిసి సలహా తీసుకోవాలి

కేన్సర్ రహిత సమాజం నిర్మించుకుందాం
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660

.దేశానికి గర్వకారణం టాటా కేన్సర్ ఆసుపత్రి 
    *విశాఖపట్నం లో రతన్ టాటా ట్రస్ట్ , వాడియా ట్రస్ట్ , గోద్రెజ్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహిస్తూన్న ఇండియన్ కాన్సర్ సొసైటీ వారిచే టాటా మెమోరియల్ హాస్పిటల్ , విశాఖపట్నం లో ఒక ప్రధమ శ్రేణి క్యాన్సర్ హాస్పిటల్ గా ఇండియా లో గుర్తింపబడ్డది.*

క్యాన్సర్ చికిత్స మఱియు పునరావాసం కల్పిస్తూ పరిశోధన వంటి కార్యక్రమము జరుగుతున్నది. స్వల్పమైన రుసుము తో అత్యంత వైద్య నైపుణ్యత ప్రత్యేకత గా పేరుపొందినది.*

క్యాన్సర్ భాదితులకు చికిత్స -పునరావాస గైడెన్స్ క్యాన్సర్ విముక్తి పిమ్మట పాటించవలసిన విధుల గూర్చి కౌన్సిలింగ్ ల నిర్వహణ మొదలగు సేవా కార్యక్రమములు.

No comments:

Post a Comment