Sunday, 17 March 2024

Cancer awareness(What is cancer)

*👆Cancer awareness(What is cancer).....*
*క్యాన్సర్ లక్షణాలు ప్రాధామిక దశలో ఎలా గుర్తించాలి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే క్యాన్సర్ ఉన్న వ్యక్తిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి

*1.-నోట్లో పుండ్లు ఏర్పడటం:*

ముఖ్యంగా పొగాకు నమీలే వారి నోట్లో పుండ్లు ఏర్పడి దీర్ఘకాలంగ మానకపోవడం. ఇలాంటి దీర్ఘకాలీక పుండ్లు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.

*2.-శరీరంలో గడ్డలు ఏర్పడటం:*

రొమ్ములో లేదా చేయి క్రింది భాగంలో గడ్డలు ఏర్పడటం. చనుమొనలలో మార్పులు ఏర్పడటం. ముఖ్యంగా చర్మం దురదగా, ఎర్రగా, పొలుసులుగా సొట్టబడినట్టు తయారవ్వడం.

*2.-మల విసర్జనలో మార్పులు:*

నిరంతర మలబద్ధకం సమస్య కలగటం. అతిసారం మరియు మలంలో నలుపు లేదా ఎరుపు రక్తం పడటం. అలాగే మూత్రంలో రక్తం, మరింత తరచుగా మూత్రవిసర్జన జరగటం.ఇటువంటి అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సూచనలు పొందవచ్చు.

*3.-దీర్ఘకాలిక దగ్గు:*

జలుబు చేసినప్పుడు దగ్గు అనేది సాధారణమే అయినప్పటికీ దగ్గు రెండు వారాలకు పైగా కొనసాగటం. ముఖ్యంగా పొడి దగ్గు ఇటువంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సంకేతాలు కావొచ్చు.

*4.-అకారణంగా బరువు తగ్గటం:*

బరువులో హెచ్చు తగ్గులనేవి సాధారణమే అయినప్పటికీ ఎటువంటి కారణం లేకుండా విపరీతంగా బరువు తగ్గటం, ఆకలిని కోల్పోవడం అనేది కొన్ని రకాల క్యాన్సర్లకి సంకేతం కావొచ్చు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment