Friday, 1 March 2024

Cough causes awareness

*👆Cough causes awareness.*
*దగ్గు తగ్గడానికి మీరు పాటించిన నవీన్ నడిమింటి వైద్య సలహాలు*
          శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు(Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.

అందుకే దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు తాగేసి, దాన్ని అణిచివెయ్యాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకుని, దానికి చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం. చాలా దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది.
2.-కరక్కాయ బుగ్గన పెట్టుకొని పడుకుంటే రాత్రి పూట దగ్గు తగ్గుతుది
3.-లవంగం కాల్చి బుగ్గన పెట్టుకోవచ్చు
4.-పచ్చ జొన్నలు బుగ్గన పెట్టుకొని లాలాజలం మింగుతుంటే గొంతులో ఉన్న తేమాడ/ కళ్లే/ కఫం తెగుతుంది
5.-నాలుగు తులసి ఆకులు నమిలిన కూడా తగ్గుతుంది
6.-జలుబు, దగ్గు, కఫం అనేవి సాధారణ ఆరోగ్య సమస్యలు. ఈ సమస్యలకు కారణం శ్వాసకోశ వ్యాధులు, శీతాకాలంలో వాతావరణ మార్పులు, ఇన్ఫెక్షన్లు మొదలైనవి.

*🌿 శరీరానికి తగినంత విశ్రాంతి నిద్ర కలగజేయడం ద్వారా వైరస్‌తో పోరాడటానికి తగిన శక్తిని పొందుతుంది.*

🌿 తగినంత నీరు త్రాగడం శరీరాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది

🌿 ఆవిరి పట్టడం. వలన నాసికా రద్దీని క్లియర్ చేసి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

🌿 గొంతును ఉపశమనానికి నిమ్మ మరియు తేనెతో టీలు, పులుసులు మరియు గోరువెచ్చని నీటిని సిప్ చేయండి.

🌿 ఉప్పు నీటి తో గార్గిల్ చేయడం గొంతు నొప్పిని తగ్గిస్తుంది

🌿 మెంథాల్ ను ఛాతీకి రాసి నప్పుడు, దగ్గు జలుబు కషం నుండి ఉపశమనం కలుగుతుంది.

🌿 .యూకలిప్టస్ నూనెను స్నానపు నీటిలోను, ఛాతీకి, ముక్కుకు రాసు కోవచ్చు.

🌿 ఒక చెంచా తేనెను నోట్లో వేసుకుని మింగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

🌿 ఒక గ్లాసు నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించి ఆ వేడి వేడిగా తాగవచ్చు.

🌿 ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ అల్లం ముక్కలను వేసి మరిగించి వేడి వేడిగా తాగవచ్చు.

🌿 ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా నిమ్మరసాన్ని కలిపి త్రాగవచ్చు.

🌿 ఒక చెంచా తేనెను నోట్లో వేసుకుని మింగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

🌿 ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపును కలిపి తాగితే దగ్గుకు ఉపశమనం లభిస్తుంది.

🌿 ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ అల్లం ముక్కలను, ఒక పాయ వెల్లుల్లిని వేసి మరిగించి వేడి వేడిగా తాగవచ్చు.

🌿 లవంగాన్ని నాలుక క్రింద ఉంచుకొని ఊటను మింగండి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://chat.whatsapp.com/EWS15oMZ8QSBYzhrlXjIxD

No comments:

Post a Comment