Wednesday, 7 June 2023

బ్రెయిన్_స్ట్రోక్_అంటే_ఏమిటి ?

*బ్రెయిన్_స్ట్రోక్_అంటే_ఏమిటి ?నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహన_కోసం*
,*What_is_Brain_Stroke?*

           ఇప్పుడు -మెదడకు స్ట్రోక్(Barin stroke awareness)--గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

                          మెదడు లోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినపుడు ... ఆ భాగానికి ఆక్షిజన్ , పోశాకపదర్దాలు అందకపోవడం వలన ఆ భాగములోని మెదడు కణాలూ నిర్జీవమవడం వలన ... తత్సంభంద శరీర భాగాలు పనిచేయక పోవదాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు . బ్రెయిన్ స్ట్రోక్ కుడా గండే పోటు లాగానే ఒక అత్యవసర వైద్య స్థితి . స్ట్రోక్ లక్షణాలు ముందుగా సకాలం లో గుర్తిస్తే సరైన చికిత్స లభిస్తే వ్యక్తికి ప్రాణ భయం ఉండదు . వ్యక్తికి స్ట్రోక్ రాకపోయినా ఇక ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తిస్తే , స్ట్రోక్ ను నిరోధించడానికి వీలుంటుంది .

*#స్ట్రోక్_రకాలు :*
స్ట్రోక్ లో రెండు ప్రార్ధన రకాలున్నాయి . ఒక్కోదానికి ఒక్కో కారణం ఉన్నది .
1. మెదడుకు రక్తం సరఫరాచేసే రక్తం గడ్డకట్టి అవరోధం ఏర్పడితే " ఇస్కీమిక్ స్ట్రోక్ " వస్తుంది . కొవ్వు నిక్షెపాలు , కొలెస్ట్రాల్ .. కారణం గా ఈ మార్గం ముడుచుకు పోయి గట్టిపడుతుంది
2. మెదడు లోని ఒక నాళం లో రంద్రాలు ఏర్పదదమో , చిట్లి పోవడమో జరిగితే " హెమరేజిక్ స్ట్రోక్" వస్తుంది . అధిక రక్తపోటు వల్ల ,నాళం గోడలు పలుచబడి పోవడం వల్ల మెదడులో రక్త స్రావం జరుగ వచ్చును.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2747122375552630/
*#కారణాలు :*
#65_ఏళ్ళు_దాటినవారికి_స్ట్రోక్_వచ్చే_అవకాశాలు_ఎక్కువ.
కుటుంబం లో ట్రాన్స్ సియంట్ ఇస్కీమిక్ ఎటాక్ రికార్డు ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువ .
అధిక రక్త పోటు ,
అధిక కొలెస్టిరాల్ ,
క్రమబద్ధం గా గుండె కొట్టుకోకపోవడం (irregular heart beat).
గుండె రక్తాన్ని సరిగా పంపించాక పోవడం .
గతం లో గుండె పోటు వచ్చి ఉంటే ..
మధుమేహము ,
స్థూల కాయం ,
సంతాన నిరోధక మాత్రలు వాడడం ,
ఎక్కువ గా పొగత్రాగడం , వంటివి స్ట్రోక్ కు దారి తీయవచ్చును ,
*#స్ట్రోక్_రాకుండా_జాగ్రత్తలు :*
సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నపుడు .. తరచూ గా వైద్య పరీక్షలు చేసుకోవాలి .
పండ్లు ,కాయగూరలు , తృణధాన్యాలు ,వంటి ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవాలి ,
క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి ,
అధిక బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ,
రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి ,
పొగ , మట్టుమందులు , మధ్యపానీయం లకు దూరం గా ఉండాలి ,
మానసిక వత్తిడిని తగ్గించుకొని ప్రశాంతం గా ఉండాలి ,
*#లక్షణాలు :*
శరీరము లో కుదివైపో , ఎడమ వైపో ముఖ్యం గా మొహం ,చెయ్యి ,కాలు
చచ్చు పడిపోయినట్లు అనిపించడం,
బలహీన పడినా ,
మాట్లాడడం లో మేస రావడం ,
మాటలు అర్ధం చేసుకోవదానికు ఇబ్బంది పడినా ,
కంటిచూపు మందగించినా ,వక్రీకరించినా , ఒక వస్తువు రెండు గా కనిపించినా ,
కారణం లేకుండా అతిగా అసాధారణంగా తలనొప్పి వచ్చినా ,
పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి ,
తనికీలు :
సి.టి.స్కాన్ ,
యమ.అర.ఐ
జనరల్ బ్లడ్ టెస్ట్స్ ... చేసుకోవాలి.
#చికిత్స :
స్ట్రోక్ కనిపించిన 3 గంటలలో చికిత్స ప్రరంబిచాలి .
రక్తనాలలో గడ్డ కట్టడం వల్ల స్ట్రోక్ వస్తే ..
*" థ్రొమ్ మెటబాలిక్ "* మందులు ఇస్తారు . రక్తం గడ్డకట్టడాన్ని నిదానం చేసే మన్దులూ ఇస్తారు .
తీవ్రమైన స్ట్రోక్ వస్తే ౩ గంటల లోపు ఆపరేషన్ అవసరం కావచ్చు .
డాక్టర్ ని సంప్రదించడం ఎంత తొందరగా జరిగితే అంట మంచిది .
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
 Ph- 9703706660
    *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment