Saturday, 6 January 2024

Azithromycin advers effects Awareness.7.1.2024.**అజిత్రోమైసిన్_టాబ్లెట్_ఉపయోగాలు_ఎవరు_వాడాలి_అవగాహనా_కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు

*👆Azithromycin advers effects Awareness.7.1.2024.*
*అజిత్రోమైసిన్_టాబ్లెట్_ఉపయోగాలు_ఎవరు_వాడాలి_అవగాహనా_కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు ,*
 
         Azithromycin Uses: ప్రస్తుతం ఈ అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. కరోనా విజృంభించినప్పటి నుంచి అనేక మంది ఈ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ను అనేకమంది వేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటికైతే ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు అందరూ ఈ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ ను వేసుకొని ఉంటారు. ఈ ట్యాబ్లెట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

*అజిత్రోమైసిన్_ఉపయోగం_ఏమిటీ_అంటే*

     గొంతు, నోరు, చెవి, ముక్కులో ఇన్ఫెక్షన్ సోకినట్లయితే అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా ఈ అజిత్రోమైసిన్ అడ్డుకుంటుంది. కడుపులో నొప్పి, వికారం తలనొప్పి, అతి సారం లాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ ట్యాబ్లెట్స్ ను వేసుకుంటుంటారు. ఎమర్జన్సీకి ఈ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ను వేసుకోవచ్చు.. అయితే డాక్టర్ సలహా మేరకే వీటిని వేసుకోవాలి. ప్రస్తుతం అనేక రకాల కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి సొంత వైద్యం వద్దు దయచేసి గమనించగలరు 🙏.

*1.-#అజిత్రోమైసిన్_ట్యాబ్లెట్స్_ను_ఎవరు_వేసుకోవద్దు?*
          ఎలర్జీ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు. గుండె, కాలేయం, ముత్ర పిండాల సమస్యలు ఉన్నా, గర్భవతులు అయినా ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకోవాలి.
https://fb.me/eHfjeS4LB
*2.-#అజిత్రోమైసిన్_500ఎంజీ_ట్యాబ్లెట్_ఉపయోగాలు*

       కమ్యూనిటీ అక్వైర్డ్ నుమోనియా (CAP): ఇది ప్రధానంగా ఉపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. మేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా లాంటి బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీని చికిత్సలో అజిత్రోమైసిన్ ను ఉపయోగిస్తారు.

*చర్మం_అంటువ్యాధులు:*
 స్టెఫిలోకాకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్, పైయోజెనెస్ లాంటి బ్యాక్టీరియా వల్ల చర్మం ఇన్ఫెక్షన్ అవుతుంది. దీని చికిత్సలో ఈ అజిత్రోమైసిన్ ను ఉపయోగిస్తారు.

*యురేత్రైటిస్_సెర్విసిటిస్:* యురేత్రైటిస్ అంటే మూత్రాశం, ఈ మూత్రాశయం గొట్టం నుంచే మూత్రం బయటికి వెళ్తుంతి.. ఈ మూత్రాశయం వాపు సమస్యతో బాధపడే వారు అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్ ను ఉపయోగిస్తారు.

*#ఫారింగైటిస్_టాన్సిలిటిస్:* ఫారింగైటిస్, టాన్సిలిటిస్ అనేవి అంటువ్యాధులు. వీటివల్ల గొంతులో టాన్సిల్స్ ఫార్మ్ అయ్యి వాచిపోతాయి. ఇది తగ్గడానికి కూడా అజీ 500 ఎంజీని తీసుకుంటారు.

*సైనసైటిస్:* సైనసైటిస్ అంటే ముక్కు చెవి, కళ్ల నుదిటి భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీని చికిత్సలో కూడా అజిత్రోమైసిన్ ను వాడతారు.

*#బ్రోన్కైటిస్:* బ్రోన్కైటిస్ తో శ్వాస నాళాలు వాచిపోయి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దగ్గు, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు కూడా డాక్టర్లు ఈ అజిత్రోమైసిన్ ను వాడమని అడ్వైజ్ చేస్తారు.

*#అజిత్రోమైసిన్_వల్ల_కలిగే_దుష్ర్ప్బభావాలు*
వికారం, వాంతులు
కడుపు నొప్పి
ఛాతి నొప్పి
తలతిరగడం
అలసట
తలనొప్పి
దద్దుర్లు
అతిసారం
కడుపులో అధిక అపాన వాయువు
చర్మం యోక్క ఫోటోసెన్సిటివిటీ
 *ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660,
          *సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి. 
https://chat.whatsapp.com/C0tDSmczEnk0waQZiJv44L

No comments:

Post a Comment